తనదైన హాస్యానికి చిరునామా -హస్యగంగ రేలంగి. 🌹


తనదైన హాస్యానికి చిరునామా 🌹

🤣🤣🤣🤣🤣🤣🤣


వెండితెరకు స్వర్ణయుగం లాంటి రోజుల్లో ప్రజల గుండె తెరపై నవ్వుల నయాగరాలా ఉప్పొంగిన హస్యగంగ రేలంగి. 

ఆయన ఏం చేసినా నవ్వొస్తుంది. 

నవ్వించటం కోసమే ఏమైనా చేస్తాడు కూడా! 

కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తన ప్రతిభకున్న అన్ని కోణాలని అద్భుతంగా ఆవిష్కరించారు రేలంగి.

ఆకారంతోను, ఆహార్యంతోనే కాక అభినయంతో సైతం ప్రేక్షకులను తన నవ్వులతో ఊయలఊగించినహాస్యచక్రవర్తిరేలంగి.ఉర్రూతలూగించారు...


రేలంగి వెంకట్రామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో 

1910వ సంవత్సరం ఆగస్టు 9న జన్మించాడు. ఆయన తండ్రి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ.. హరికథలు చెప్తుండేవారు. 

అందుకే రేలంగి చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడింది. తండ్రి వద్ద హరికథలు చెప్పడం, పాటలు పద్యాలు పాడటంతో పాటు హార్మోనియం కూడా నేర్చుకున్నాడు. ఓ నాటక సంస్థ ద్వారా పలు నాటకాల్లో ఎన్నో పాత్రలు పోషించారు. 

వీటిలో ఆయన పోషించిన స్త్రీ పాత్రలు ఆ రోజుల్లో జనాన్ని ఉర్రూతలూగించాయి. సినిమాలో నటించాలనే కోరికతో ఆయన తొలిసారిగా సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన 

'శ్రీ కృష్ణ తులాభారం'లో విదూషకుడిగా నటించారు. 

అప్పటి నుంచి చిన్న చిన్న పాత్రలు వేస్తూ జీవితం సాగించారు. 

స్టూడియో అరుగుల మీదే నిద్ర...


1947వరకూ సి.పుల్లయ్య దగ్గరే ఉంటూ ఆయన సినిమాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేసిన రేలంగి కెరీర్‌లో మైలు రాయిలాంటి మలుపు 'గొల్లభామ' చిత్రం. 

కీలకమైన పాత్రలో తన సత్తా ఏమిటో చాటుకున్నాడు రేలంగి. 

'గొల్లభామ' సినిమా తర్వాత కూడా సినీ రంగంలో అవకాశాల కోసం చెమటోడ్చారు. రాత్రి సమయంలో స్టూడియో అరుగుల మీద పడుకున్నారు. చిన్న చితకా వేషాలు వేస్తూ.. నానా యాతన పడ్డారు. అందుకే ఆయనకు త్వరగానే బ్రేక్‌ వచ్చింది. 1947లో విడుదలైన 'వింధ్యరాణి' సినిమా రేలంగి దశను మార్చింది. 

ఆనాటి నుంచి విజయా ఫిల్మ్‌పేర్‌లో ఆయన ఏదో ఓ కీలక పాత్రను పోషిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 

1950వ సంవత్సరం నుంచి రేలంగి తిరుగులేని హాస్యనటుడిగా

సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకున్నారు. 

అప్పటి నుంచి నటించే ఓపికా, కోరిక లేనంత వరకు, చిట్ట చివరి నిమిషం వరకు ఆయన నెంబర్‌ వన్‌ హాస్య నటుడిగానే రాణించారు. ముఖ్యంగా 'విజయా, 'వాహిని' వారి చిత్రాలలో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.


కేవలం రేలంగి కోసమే ఆ సినిమాలను నాలుగెదు సార్లు చూసిన అభిమానులున్నారు.

మహానటులతో సమానంగా రాణించారు.

.

మహానటుడు నాగయ్య దగ్గర నుంచి అగ్ర నటులుగా పేరుగాంచిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ చిత్రాలలో ఎన్నో హాస్య పాత్రలు చేశారు

. ఒక్కోసారి వారి పాత్రలో సమానమైన క్యారెక్టర్స్‌లో నటించి మెప్పించారు. 'రోజులు మారాయి' చిత్రంలో రౌడీయిజంతో ఆయన పండించిన హాస్యం, విలనిజం అజరామరం. 

పుల్లయ్యగారి దర్శకత్వంలో ఆ నాటి అగ్రతార, మహానటి అంజలీదేవి సరసన హీరోగా 'పక్కింటి అమ్మాయి' చిత్రంలో అద్భుతంగా నటించారు.


అలాగే 'పెద్ద మనుషులు' చిత్రంతో తను ఆ

ల్‌ రౌండర్‌ అనిపించుకున్నాడు. 'గుణ సుందరి కథ', 'షావుకారు', 'మిస్సమ్మ', 'నర్తన శాల', 'మాయా బజార్‌', 'దొంగరాముడు', 'అప్పుచేసి పప్పుకూడు', 'చదువుకున్న అమ్మాయిలు', 'ఇద్దరు మిత్రులు', '

జగదేక వీరుని కథ', 'చింతామణి', 'రాముడు భీముడు', '


వెలుగు నీడలు', 'జయం మనదే', 'మహా మంత్రి తిమ్మరుసు' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.


మొదట్లో రేలంగి చాలా ఇబ్బందులు పడ్డారు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 'గుణ సుందరి కథ' సినిమాతో ఆయన దరిద్రం వదిలిపోయింది.


'కీలుగుర్రం' రేలంగిని తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నిలబెట్టింది. ఓ కొత్త తరం నవ్వుకు బీజం వేసింది. 

అన్నిటికన్నా ఆయన గొప్పదనం టైమింగ్‌. ఎస్వీర్‌ వంటి నటసింహాల సరసన సైతం అద్భతమైన టైమింగ్‌తో రక్తి కట్టించారు.

'మాయాబజార్‌' చిత్రంలో రేలంగి, సావిత్రిల మధ్య ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించడం రేలంగికి ఉన్న పాపులారిటీకి నిదర్శనం. అలా ఓ అగ్ర కథానాయికతో ఆడిపాడాడు. 

గిరిజతో ఆయన కాంబినేషన్‌ ఎవర్‌గ్రీన్‌ కామెడీ పార్ములా. తెలుగు సినిమా చరిత్రలో రేలంగి, గిరిజల జోడి ఓ ప్రత్యేక అధ్యాయం. 

మిగిలిన హీరోయిన్ల కన్న గిరిజతో రేలంగి కాంబినేషన్‌ అద్భుతంగా పండింది. ఇక సూర్యకాంతంతో రేలంగి కలిస్తే నవ్వులే నవ్వులని చెప్పవచ్చు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లు పోటాపోటీగా జనాన్ని నవ్వించారు. 

స్వరంతోనూ అలరించారు..

చిన్నప్పటి నుంచి పాటలు పాడే అలావాటున్న రేలంగి తన స్వరాన్ని సుస్వరంగా మలుచుకొని ఎన్నో హిట్‌సాంగ్స్‌ పాడారు.

'అప్పుచేసి పప్పుకూడు', 'మిస్సమ్మ', 'పరమానందయ్యశిష్యులు', 'పెద్దమనుషులు వంటి చిత్రాల్లో రేలంగి స్వయంగా పాటలు పాడారు.


'జీవితమే ఓ జోక్‌'..

రేలంగి వెంకట్రామయ్య హాస్యనటుడిగా ఎంతటి గొప్ప నటుడో, 

వ్యక్తిగా కూడా అంత లోతైన వాడు. దుర్భర పేదరికం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అత్యున్నత శిఖరాలను చూసిన ఆయన జీవితాన్ని స్వీకరించిన తీరు వింటే కళ్లు నీళ్లు తిరుగుతాయి. రేలంగి చివరి రోజుల్లో థైరాయిడ్‌ వచ్చింది.

దీంతో ఆయన చాలా సినిమాల్లో వీల్‌ ఛైర్‌ మీద కూర్చొనే దాదాపు 30కిపైగా సినిమాల్లో నటించారు. రేలంగి జీవితానుభవాలు విషాద హాస్యానికి నిలువెత్తు నిదర్శనాలు.

ఓ సారి రేలంగి, 'రాళ్లు రప్పలు, తిని అరిగించుకునే వయసులో మరమరాలు కూడా దొరకలేదు. నవరత్నాలు ఆణిముత్యాలు కొనగలిగిన ఇవాల్టి స్థాయిలో ఇప్పుడు మరమరాలు కూడా అరగడం లేదు', 'జీవితాన్ని మించిన జోక్‌ ఏముంది..' అని అన్నారట.

దక్షిణ భారతదేశంలో ఒక క్యారెక్టర్‌ నటుడు 'పద్మశ్రీ' పురస్కారం అందుకోవడం రేలంగితోనే మొదలు.

రేలంగి ఆకలి రుచి తెలిసిన మనిషి కనుక రోజూ నట్టింట పాతిక మందికి భోజనాలు పెట్టి ఆ సంతోషంతో కడుపునింపుకునేవాడట. ఉదారంగా, ధారాళంగా విరాళాలు ఇచ్చేవారని తన సన్నిహితులు చెబుతుంటారు. అసలైన హాస్యానికి చిరునామా అయిన రేలంగి 1975 నవంబర్‌లో మరణించారు.

అయన మరణంతో హాస్యాన్ని అభిమానించే అభిమానుల మది, సినిమా నవ్వు చిన్న బోయిందని చెప్పవచ్చు. 

అయితే ఇప్పటికీ ఆయన సినిమాల్ని చేసి నేటి తరం ప్రేక్షకులు కూడా నిండుగా నవ్వుకుంటారు.


😃🤣😂😃🤣😂😃🤣😂😃🤣😂😃🤣😂😃🤣😂😃🤣😂


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!