పిం గళిసూరనగారి మనవడు !

పిం గళిసూరనగారి మనవడు !

.


పింగళిసూరనగారు, అల్లసానివారి మనుమరాలి భర్తయట! 

చిన్నట అల్లరిచిల్లరిగా తిరుగుచు నందరిచే చవాట్లుదినుచుండు

వాడట. చదువురానిమొద్దువని యొకమారు పెద్దనగారే తిట్టినారట.పౌరుషమువచ్చి యింటినుండి పారిపోయిరట.

సూరన జాడకై వెదకి వేసారి మనుమరాలి యభాగ్యమునకు 

దురపిల్లి యూరకుండిరట. 

అట్లుపోయిన యాసూరన కాశీనగరమునకేగి 

సర్వ విద్యలయందు నిష్ణాతుడై తిరిగి వచ్చినాడు. అప్పటికాతనిృరూపురేఖలు, వేషభాషలును మారుటచే 

పెద్దన గుర్తింప లేకపోయెనట. 

గోత్రనామములను,ప్రవరను, 

తాత,తలిదండ్రుల పేరులనుఅడిగి వివరముల

నెరింగి సూరనేయని నిశ్చయించి 

,యింతకాలమునకువచ్చితివా? 

యికనీచదువు సంధ్యల నడుగనులే, పొమ్ములోనికిబోయి,

నీభార్యనుపల్కరింపుమన, 

సూరన"తాతా! నేను సర్వ విద్యల నేర్చితిని, 

నీకన్నమిన్నగా కవిత్వమును గూడ చెప్పగలనులే"యన


" నేదీ నీవురచించిన పద్యమొకటి వినిపించుమనెనట".


అపుడుసూరన-


తలపం జొచ్చెడియప్పుడంత-యనిచదువగనే "చాల్చాలులే! 

యెత్తుగడలోనే యిన్నివిరుపులా?యిదానీకవిత్వమనిపరిహసింప ,

"తాతా! అప్పుడేయేమైనది, ముందువినరాదా?యనుచు-


మ:"తలపం జొప్పెడి నొప్పె నప్పుడు,:తదుజ్జ జ్జైత్రయాత్రా సము 

త్కలికా రింఖ దసంఖ్య సంఖ్య జయవత్కంఖాణ రింఖావిశృం 

ఖల సంఘాత ధరాపరాగ పటలాక్రాంతం బన

ర్గళభేరీరవ నిర్గళద్గగన రేఖాలేక పంకాకృతిన్!


అనేపద్యం యేకబిగిని చదివాడట

!పెద్దన లేచివచ్చి సూరననుకౌగిలిమచుకొని,

గొప్ప పద్యమును జెప్పితివిరా మనుమడా! సెబాసు! అని మెచ్చినాడట!


ఇంతకీ పద్యంలోముందున్ననాల్గు చిన్నపదాలేతప్ప


మిగిలినదంతా ఒకేసమాసంృకావటం విశేషం! 

"నంద్యాలకృష్ణమనాయుడు(కళాపూర్ణోదయకృతిపతి)


దండయాత్రకువెళుదున్నాడు.లెక్కలేనిగుర్రాలదండు.

అవిపరుగులుతీస్తుంటే,వాటిడక్కలనుండి లేచినధూళి,

ఆకాశంవరకూ వెళ్ళిఆకాశగంగలోపడుతోంది.

అదియాగంగలో బురదగా మారుతున్నది అని యుధ్ధవర్ణనం.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!