Posts

Showing posts from May, 2020

❤️❤️❤️❤️❤️-గాంధర్వ వివాహం-❤️❤️❤️❤️❤️

Image
❤️❤️❤️❤️❤️-గాంధర్వ వివాహం-❤️❤️❤️❤️❤️ 🔻యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము. 🚩ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు. 🔻గాంధర్వ వివాహం అనగా పరస్పర ప్రేమతో అంగికారంతో జరిగే వివాహం, అప్పటికి, ఇప్పటికి, సమ్మతమే, కాదనడానికి లేదు కాని భద్రత దృష్ట్యా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినపుడు చిక్కులు కలుగుతాయి, అదే శకుంతల కూడా పడింది తరవాత, ఇప్పటివారు కూడా అటువంటి చిక్కులు ఎదుర్కుంటున్నారు…. 🚩శాకుంతలం అంటే శృంగారమే చూస్తున్నారు, ఈ తరవాత జరిగినదాన్ని పెద్దగా పట్టించుకోటం లేదు. మను చరిత్రలో మాయా ప్రవరునితో వరూధిని సంగమం తరవాత చదవక్కరలేదంటున్నారు, అలాగే శాకుంతలంలో కూడా, నిజంగా నేటి కాలానికి ఈ తరవాత జరిగినదే చాలా అవసరం.. ❤️🔻 ❤️🔻🔻❤️🔻❤️🔻 ❤️🔻🔻❤️🔻❤️🔻

🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))

Image
🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450)) 🚩దారితప్పిన యువకులను పాత్రలుగా మార్చి... అంతర్గతంగా వ్యక్తిత్వ వికాసానికి దారిచూపే రచనలు చేసినవారిలో ఆద్యుడు శ్రీనాథుడు. ఆయన గుణనిధి, సుకుమారుడు అనే రెండు పాత్రలను సృష్టించాడు. ఈ వరుసలో అందరికంటే ముందు పుట్టింది ‘గుణనిధి’. అయినా తెనాలి రామకృష్ణుని ‘నిగమశర్మ’కు అధిక ప్రాచుర్యం లభించింది. ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే ‘‘వాడా! వాడు నిగమశర్మ’’ అంటాం. అయితే మన సాహిత్యంలో మదాలసుడు, నిరంకుశుడు, నాగదత్తుడు అనే మరో మూడు భ్రష్ట యువకుల పాత్రలూ కనిపిస్తాయి. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డా చివరికి అప్రయత్నంగా దేవుని మహిమతో మోక్షాన్ని పొందిన ఇలాంటి కథలను తామస కథలు అంటారు. వాటిలో మొదటిది ‘గుణనిధి కథ’. ఇది శ్రీనాథుడు రచించిన ‘కాశీఖండం’లోనిది. పేరుకు పెద్దన్న... 🚩కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడే గుణనిధి. చాలా అందగాడు. కానీ, చదువు వదిలిపెట్టి పేకాట నేర్చాడు. విటులతో స్నేహం పెంచుకొన్నాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం, గీత వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడిపందేలు, పాచ...

💞 నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!💞

Image
💞 నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!💞 🔻'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి.🔻 🚩 సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు వాలు చూపులు రెండు వేలు సేయు నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు విర్రవీగుట లారువేలు సేయు పదమొక్కటియె సేయు పదివేల వరహాలు లావణ్యమది యొక లక్ష సేయు బలుసోయగమె సేయు పది లక్షల వరాలు కులుకు నడక తీరు కోటి సేయు ❤️ ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!❤️

బారిష్టరుపార్వతీశం !!

Image
❤️ఇది చదివిన వాళ్లు ఎవరైనా వున్నారా... అపురూప గత జ్ఞాపకాలు ఇవి.💞 🚩95 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ఇప్పుడు చదివినా నవ్వే వస్తుంది ఇష్టమైన పుస్తకము శ్రీ మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి గారికి నమస్సులు🔻🙏🏿🔻 లెఖ్ఖలేనన్నిసార్లు! తప్పక చదవవలసిన తెలుగు పుస్తకాలలో ఓకటి. 🔻రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి అత్తగారి ఊరు నర్సాపురం తాలూకా, గుమ్మలూరు అనే గ్రామం. ఇతను అక్కడికి వెళ్ళినపుడు తన బంధువుల కోసం ఒక పడవ ప్రయాణంలో ఉండే కష్టాలు, తమాషాలు సరదాగా చెప్పాడు. వాళ్ళు ఆనందించి దాన్ని ఓ కథలా రాయమన్నారు. అప్పటికి ఆయన రాసిన మూడు కథలు సాహితి, భారతి పత్రికలలో అచ్చయి ఉన్నాయి. అప్పటికి ఆయనకు దీన్ని ఓ రచనగా మలచాలనే సంకల్పం లేదు. కానీ శ్రోతలు ఇచ్చిన ఉత్సాహంతో ముందుగా ఒక కుర్రవాడిని నర్సాపురం నుంచి నిడదవోలు, అక్కడ నుంచి మద్రాసు చేరినట్లు రాసి కుర్రవాళ్ళకు చదివి వినిపించాడు. వారు బాగుందనడంతో ఉత్సాహంతో కథానాయకుడు అక్కడి నుంచి బారిష్టరు చదువు కోసం ఇంగ్లండు ప్రయాణించడం వరకు రాయాలనుకున్నాడు. ఆ రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి బారిష్టరు చదవడమంటే గొప్ప. అప్పటి దాకా పేరు పెట్టని పాత్రకు పార్వతీశం అని పేరు...

🚩విగ్రహారాధన–కారణం…

Image
🚩విగ్రహారాధన–కారణం… 🔻ఉపాసనలో విగ్రహారాధన ఐదవ వర్గంలోకి వస్తుంది. మనసు చంచలమైనది. ప్రతిక్షణం పరిభ్రవిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించి ఏకాగ్రత సాధించటానికి మార్గం విగ్రహారాధన. వైదికకాలం నుండి విగ్రహారాధనకు ప్రాధాన్యత ఉంది. మనోధృతిర్ధారణా స్యాత్ సమాధిర్బ్రహ్మాణి స్థితిః| అమూర్తో చేత్ స్థిరా న స్వాత్ తో మూర్తి విచింతయేత్|| జ్ఞాని స్థితిని పొందటానికి సాధకుడు మొదట స్థిరత్వం సాధించాలి. అది విగ్రహారాధన వల్లనే సాధ్యమౌతుంది. దానివల్ల మనసుకు ఏకాగ్రత లభిస్తుంది. మనస్సులో భావం ఉత్పన్నం కావటానికి ఒక చిత్రపటం లేదా ప్రతిమ అవసరమన్న అంశాన్ని శాస్త్రీయంగా కూడా వైజ్ఞానికులు అంగీకరించారు. ఉదాహరణకు ఒక వ్యక్తి చేతిలో తన తల్లి, సోదరి, భార్య చిత్రపటాలు ఉన్నాయనుకుందాం. తల్లి చిత్రం చూడగానే అతనిలో ఆమె వాత్సల్యం; సోదరి చిత్రం చూడగానే స్నేహం, ఆర్ద్రత,భార్య చిత్రం చూడగానే ప్రణయభావం జాగృతం కావటం సహజం. ఏకలవ్యుడు ఏమి చేశాడు? ధనుర్విద్య అభ్యసించటానికి ద్రోణాచార్యుని ప్రతిమను భక్తీభావంతో పూజించి ఆ ప్రతిమలో గురువును భావన చేసి, ధనుర్విద్యలో అర్జునుని మించిన విలుకాడుగా ఎదిగాడు. ధ్రువుడు నా...

❤️🚩🔻🙏🏿ద్రౌపది!.🙏🏿🔻🚩❤️

Image
❤️🚩🔻🙏🏿ద్రౌపది!.🙏🏿🔻🚩❤️ 🚩 యగ్నసేని ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు. యుక్తవయస్సుతో పుట్టింది. ఒక్కసారి ఊహించుకోండి.. చిన్నతనం లేకుండా.. ఒకేసారి యుక్తవయస్సులో పుట్టడం, వారసత్వ లక్షణాలు పొందడం అంటే చాలా ఆసక్తిగా ఉంది కదూ. పాంచాల రాజు అయిన ద్రుపదుడుకి అగ్ని ద్వారా జన్మించింది. ఆ కాలంలో ద్రౌపది చాలా అందమైన మహిళ. 🚩 ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట? 🚩 సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు ...

❤️యద్దనపూడి సులోచనారాణి .!

Image
❤️యద్దనపూడి సులోచనారాణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం . ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది. ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి. 🔻యద్దనపూడిసులోచనారాణి గురించి ఈ సంగతి తెలుసా !🔻 🚩నగరం నుంచే రచనా ప్రస్థానం రచనల్లో నగర వీధుల ఊసులు వృద్ధుల కోసం ‘విన్‌’ ఆశ్రమం❤️ హైదరాబాద్‌: తెలుగు నవలా ప్రపంచాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏలిన సాహిత్య సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనారాణి నవలా ప్రస్థానం నగరంలోనే ప్రారంభమైంది. 1957లో హైదరాబాద్‌వాసి నరసింహారావుతో వివాహానంతరం యద్దనపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజ గ్రామం నుంచి ఇక్కడి అత్తవారింట్లో అడుగుపెట్టారు. పల్లెటూరిలో పెరిగిన ఆమెకు తొలినాళ్లలో నగర జీవితానికి అలవాటవడానికి కొంత సమయం పట్టింది. అదే సమయంలో పుస్తకాలను ఆత్మీయనేస్తాలుగా మలుచుకొన్నారు. సాహిత్య పఠనంతోపాటు కథలు రాయడం తొలినాళ్లలో యద్దనపూడికి ప్రధాన వ్యాపకం. అప్పటి వ...

🚩."గతానుగతికో లోకః"

Image
🚩."గతానుగతికో లోకః" 🔻అని పెద్దలు అంటూండగా వింటూంటాం. అది ఈ క్రింది శ్లోకంలోని పాదమే. శ్లో. గతానుగతికో లోకః న లోకః పారమార్థికః | గంగాసైకతలింగేన నష్టం మే తామ్రభాజనమ్|🔻 ఒక బ్రాహ్మణుడు గంగానదిలో స్నానము చేద్దామని గంగ ఒడ్డుకు వెళ్ళాడు అతని దగ్గర ఒక రాగి చెంబు ఉన్నది. అదే అతని విలువైన వస్తువు కనుక తను గంగలో స్నానం చేసి వచ్చేసమయానికి యెవరైనా దానిని దొంగిలించుకొని పోతే ఎలాగ? కాబట్టి చెంబును భద్రంగా దాచాలి అనుకున్నాడు. మంచి ఆలోచనొకటి తట్టింది. అప్పటికి గంగ ఒడ్డున ఎవరూలేరు. జాగ్రత్తగా బ్రాహ్మణుడు ఒడ్డున ఉన్న ఇసుకలో ఒక గొయ్యి త్రవ్వి , అందులో తన రాగి చెంబు యుంచి గొయ్యి పూడ్చివేశాడు. మరి అనుమానం వచ్చింది. అంత పెద్ద నదీ తీరములో తాను చెంబు యెక్కడ పెట్టాడో కనుక్కోవడం ఎలా?? మరొక దివ్యమైన ఆలోచన మెదిలింది. వెంటనే చెంబు ఉంచిన చోట పైన ఇసుకతో ఒక లింగము చేసి గుర్తుగా పెట్టుకున్నాడు. అతడు స్నానమునకు వెళ్ళగానే మఱికొందరు గంగా స్నానానికై వచ్చారు. వారు ఈ లింగమును చూచి , స్నానము చేయటానికి ముందు గంగ ఒడ్దున తప్పక ఒక ఇసుకతో శివలింగము చేసి స్నానము చేయాలి కాబోలు, అలాంటి...

🌷🏵️🌷-మహానటి- సావిత్రి .🌷🏵️🌷

Image
🌷🏵️🌷-మహానటి- సావిత్రి .🌷🏵️🌷 👉చందమామ ఏలా అందరి సోంతమో ; సావిత్రీ ప్రతీ వారికీ సోంతమే . మన అందరికీ ఆవిడ తో ఆ అనుబంధం విడదీయనిది . ఆవకాయ ; గోంగూర ఏలా అయితే ప్రతీవారికీ ముఖ్యంగా మన తేలూగూవారికి సోంతమో--_ ఇష్టమో ; సావిత్రి కూడా మనఅందరకీ ఇష్టం మన ఇంటి బిడ్డ. మనకి ఇష్టమైన విషయము మీద ఏలాగ మనం బంధం-- అనుబంధం ఏర్పరుచుకుంటామో; ఏలా దానిని మనకే సంబంధించిన మన విషయం అని నిర్వచించుకుంటామో; అనువయించుకుంటామో అలాగే సావిత్రి తో మన అనుబంధం . అది విడదీయరానిది అసలు ఓక సావిత్రీ తోనేనా?? జమున ; భానుమతి; అంజలి; కన్నాంబ ; రేలంగి; సూర్యకాంతం; షావుకారు జానకి ; కృష్ణకుమారి ; నాగయ్య ; యేస్వీ రంగారావు; csr ఆంజనేయులు ; జగ్గయ్య ; కాంతారావు ; ఛాయాదేవి ; రామారావు; రాజనాల ; నాగేశ్వరరావు; రమణారేడ్డి ; గిరిజ ; చలం; నాగభూషణం ; అల్లూ రామలింగయ్య ; పద్మనాభం ; రాజబాబు ; శారద ; గీతాంజలి ; రమాప్రభ; హేమలత (ఈ కేరక్టర artiste ఇంకా hyderabad లో ఉన్నారు 92 years. అత్తలు కోడళ్ళు సినీమా లో సూర్యాకాంతానికి అత్తగారు ; లేదా కాంచన రాజశ్రీ నాగేశ్వరరావు ల ఆత్మగౌరవం సినీమా చూసినట్టు అయితే...

🔻🙏🏿-వాతాపి గణపతిం భజే: -🙏🏿🔻 ...........(ముత్తుస్వామి దీక్షితార్)................

Image
🔻🙏🏿-వాతాపి గణపతిం భజే: -🙏🏿🔻 ...........(ముత్తుస్వామి దీక్షితార్)................ 🚩వాతాపి గణపతిం భజే: గణపతి పై అంత అందమైన కృతి  ఎలా అయింది? కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారు తిరువారూరులో జన్మించారు.  అలనాటి వాతాపి (ఇప్పటి బాదామి) నుండి గణపతి విగ్రహాన్ని పల్లవులు చాళుక్యుల పై సాధించిన విజయానికి ప్రతీకగా తిరువారూరు తరలించి అచట ప్రతిష్టించారని చరిత్ర కథనం. ముత్తుస్వామి గారు షోడశ (పదహారు) గణపతి కృతులను వ్రాసారు. అందులో ఒకటి హంసధ్వని రాగంలో బాణీ కట్టిన  "వాతాపి గణపతిం భజే".ఈ రాగం యొక్క సృజన కర్త ముత్తుస్వామి గారి తండ్రి గారైన శ్రీ రామస్వామి దీక్షితార్ గారు.  ఈ కృతి యొక్క ప్రతి పదార్ధము, తాత్పర్యము, వివరణ దిగువన చూడగలరు.🔻 🚩పల్లవి వాతాపి గణ పతిం భజే(అ)హం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి = బాదామి; గణపతిం = గణపతిని; భజే = భజించెదను; అహం = నేను (శ్రీ దీక్షితార్); వారణ = ఏనుగు; ఆస్యం = ముఖము; వర = వరములు; ప్రదం = ఇచ్చువాడు. 🚩అనుపల్లవి భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం (మధ్యమ కాల సా...

🚩బంగారు దొంగ!! (అమరావతి కధలు .)

Image
🚩బంగారు దొంగ!! (అమరావతి కధలు .) ముఖ్య పాత్రలు-దొంగ, జానకి రామయ్య, భూషయ్య. 🚩🚩 బాపు బొమ్మ-వినాయకుడి మీద ఎక్కి కూర్చున్న భూషయ్య, కొంత డబ్బులు పడేస్తుంటే, అనందంతో అవులిస్తూ చేతులు ఎత్తి తీసుకుంటున్న దొంగ. వినాయకుడు విచారంగా తన నెత్తిన ఎక్కిన భూషయ్యను భరిస్తుంటాడు. బొమ్మ అంతర్యం అసలు దొంగ ఎవరో చెప్పటమే.❤️ 🚩🚩🚩 -కథ-ఊళ్ళొ జరిగిన ఒక సంఘటన. గుళ్ళొ దొంగతనం జరుగుతుంటే పసికట్టిన జానకిరామయ్య ఊరివారిని హెచ్చరిస్తాడు. ఊళ్ళోవాళ్ళు, వాడువీడని లేకుండా అందరూ గుడిమీదపడి దోంగను పట్టుకుని, వీరొచితంగా చావగొడతారు భూషయ్యతో సహా. కథ పేరు "బంగారం దొంగ" అని పెట్టకుండా, "బంగారు దొంగ" పెట్టడంలోని చమత్కారం కథలోని కొసమెరుపు. ఆ దొంగ, భూషయ్య చేత నియోగించబడ్డవాడు. వాడికి డబ్బిచ్చి, దొంగతనానికి పురిగొల్పి, బంగారుపూతను సంగ్రహిస్తూ వాడికి నాలుగు రూకలు పడేస్తుంటాడని భూషయ్య-దొంగల సంభాషణలో తెలుస్తుంది. బంగారం దొంగ భూషయ్య, భూషయ్యకు దొంగ (వీడికి పేరులేదు) బంగారు దొంగ. వేసంకాలం మిట్టమధ్యాహ్నం, శివాలయంలో రికామిగా జరుగుతున్న దొంగ పని బయటపెట్టడానికి మొలల వ్యాధిగ్రస్తుడైన జానకిరామయ...

❤️🔻"సహృదయులు"🔻❤️

Image
❤️🔻"సహృదయులు"🔻❤️ 🚩రసానుభూతి కలగడానికి, స్పందించే హృదయం అవసరం. అలాంటి మనసున్న వాళ్ళనే "సహృదయులు" అంటారు. ఈ సహృదయత అనేది సాధారణంగా మన చేతుల్లో ఉండే విషయం కాదు. కొంతమందికి చిన్ననాటినుంచే డిటెక్టివ్ నవలలు చదవడం ఇష్టం కావచ్చు. మరొకనికి హాస్య నవలలు మాత్రమే నచ్చుతూ ఉండవచ్చు. ఇవి పుట్టుకతోనే వచ్చే వాసనలనే అనుకోవాలి. ఇలాంటి వాసనలనే మనవాళ్ళు "పూర్వజన్మ" వాసనలు అన్నారు. పుట్టుకతోపాటు, పుట్టి పెరిగిన వాతావరణం, మానసిక స్థితిగతులూ మొదలైనవి కూడా ప్రభావం చూపిస్తాయి. రుచిభేదాన్ని బట్టి కొందరికి కొన్ని రసాలు రుచిస్తే మరికొందరికి మరికొన్ని రుచిస్తాయి. ఒకే సన్నివేశం అనేకమందికి అనేకరకాలైన అనుభూతిని కలిగించవచ్చు కూడా! ఈ విషయాన్నే చమత్కారంగా సూచించే శ్లోకమొకటి రాజశేఖరుడు తన కావ్యమీమాంసలో ఉదాహరించాడు. కాని మనం మాట్లాడుకోవలసింది తెలుగు పద్యాల గురించి కదా! అంచేత అలాంటిదే ఒక తెలుగు పద్యాన్ని ఉదాహరిస్తాను. శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు ఒక భువనవిజయ సభలో చెప్పిన పద్యమిది. ఒక అందమైన అమ్మాయిని చూస్తే, ఒక వేదాంతికి, ఒక నవయువకునికి, ఒక పిల్లవానికీ...

🔻ఋష్యశృంగుడు-శృంగగిరి పీఠం.🔻

Image
🔻ఋష్యశృంగుడు-శృంగగిరి పీఠం.🔻 🚩శ్రీ రామ చంద్ర మూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషిసల్పినటువంటి వ్యక్తి, గొప్ప తపోధనుడూ ఋష్యశృంగుడు. 🙏🏿 ఆయన సాక్ష్యాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే... ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెళితే, ఆ శృంగేరిలో "కిగ్గా" అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది.🙏🏿 ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది ఆయన శివ స్వరూపంగా, శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు. అందుకే శృంగేరీ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి. గొప్ప తపో భూమీ అందుకే శృంగేరీ పీఠాన్ని అధిష్టించినటువంటి ప్రతి పీఠాధిపతికూడా తనదైన ముద్రవేశారు.🙏🏿 ఆశేతుహిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి, ఈ సనాతన ధర్మంలోని భక్తులకైనా సరే... వారు ఎన్నో విషయాలను అందించీ మన జీవితాన్ని సార్దకతచేసిన మహాపురుషులు ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు.🙏🏿 చంద్ర శేఖర భారతీ నిరంతరమూ బ్రాహ్మీభూత స్థితియందు ఉండేవారు. అలా ఒక్కొ...

❤️"మనః ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః "❤️

Image
❤️"మనః ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః "❤️ మనస్సే మనుషుల బంధ మోక్షములకు మూల కారణం కదా ! 1. ఓమ్‌ మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ అశుద్ధం కామసంకల్ప౦ శుద్ధం కామ వివర్జితం || “మనస్సు” అనేటు వంటిది రెండు విధాలుగా వున్నది. ఎవరికైనా సరే అందరిలో కూడా. ఒక విధముగా వున్న మనస్సు పేరు ‘శుద్ధము’ – అంటే పవిత్రము. దాంట్లో ‘శుభము’ వుంటుంది. శుభవాసనలు వుంటాయి. రెండవ విధమైనటువంటిది ‘అశుద్ధము’ – అంటే మాలిన్యమైనది. దాంట్లో అశుభ వాసనలు వుంటాయని, అపవిత్రము వంటిదని చెప్తున్నాడు. ‘శుభము’- అంటే ఏమిటి? ‘పవిత్రము’- అంటే ఏమిటి? ‘అశుభం’ – అంటే ఏమిటి? అంటే రెండవ చరణములో “అశుద్ధం కామసంకల్పం, శుద్ధం కామవివర్జితం” – అని తేల్చేశాడు. అశుద్ధము అంటే కోరికలతోటి, కోరికలు ఎలా వుంటాయి? స్వార్థమును ఆశ్రయించి వుంటాయి. స్వార్థమును ఆశ్రయించేటి కోరికలన్నీ, స్వార్థాన్ని తృప్తిపరిచేట్టుగా వుంటాయి. దాన్ని కామసంకల్పం అంటారు. అటువంటి కోరికల్ని, అటువంటి స్వార్థాన్ని దానికి సంబంధించకుండా వుండేటువంటిది ‘శుద్ధం’ – అన్నాడు. అదెట్లాగో నిర్వచించలేము, ‘కామవివర్జితమ్‌’ – ఇటువంటి కోరికలు లేకుండా వుండే...

🚩లాక్ డౌన్ లో లవ్❤️ (డిఫరెంట్ లవ్ స్టొరీ )

Image
🚩లాక్ డౌన్ లో లవ్❤️ (డిఫరెంట్ లవ్ స్టొరీ ) హీరో..హీరోయిన్ లది ఎదురు బొదురు ఇల్లు ! లాక్ డౌన్ నడుస్తుంది కానీ వీళ్ళ ప్రేమకు లేదు ! ఒకళ్ళని విడిచి ఒకళ్ళు వుండలేనంత డీప్ గా ప్రేమించేసుకున్నారు ! లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అని ఇద్దరు ఎదురు చూస్తున్నారు ! వీరి ప్రేమ ఫలించి లాక్ డౌన్ ఎత్తేశారు ! అంతే హీరో వేగంగా మేడ దిగటం మొదలు పెట్టాడు! హీరోయిన్ కూడా అంతే వేగంగా మేడ దిగింది !❤️ ఇద్దరూ మేడ దిగిన తర్వాత...తర్వాత... హీరో వైను షాపు వైపు పరిగెత్తాడు !😀 హీరోయిన్ బ్యూటీ పార్లర్ వైపు పరిగెత్తింది !😳 (14 రీళ్లు అయిపోయాయి ) THE END 🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

❤️కరోనా నేపధ్యం లో అంత్యదశసేవలు !! 🔻అంత్యదశసేవలు . .. భీష్మ నిర్యాణం🙏🏿

Image
❤️కరోనా నేపధ్యం లో అంత్యదశసేవలు !! 🔻అంత్యదశసేవలు . .. భీష్మ నిర్యాణం🙏🏿 ❤️ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది. భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు. 58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది. భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్...