Posts

Showing posts from September, 2013

కరుణశ్రీ కవిత్వం అద్వైతమూర్తి

Image
కరుణశ్రీ కవిత్వం అద్వైతమూర్తి చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్ గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్ భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్ తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్

సాంధ్యశ్రీ కరుణశ్రీ కవిత్వం

Image
. సాంధ్యశ్రీ ! (కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి .) - అంజన రేఖ వాల్కనుల యంచులదాటి మనోజ్ఞ మల్లికా కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ కంజ దళాక్షి, నీ ప్రణయ గానములో పులకింతునా మనో రంజని బుష్పవృష్టి పయి రాల్పి నినున్ బులకింప జేతునా! - క్రొంజిగురాకు వేళుల కురుల్ తడియార్పుచు గూరుచున్న య భ్యంజన మంగళాంగి జడలల్లుదునా, మకరంద మాధురీ మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రపుల్ల పు ష్పాంజలి జేసి నీ యడుగులందు సమర్పణ జేసికొందునా! . సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నా రింజకు నీరు వోయు శశిరేఖవె నీవు సుభద్ర సూతినై రంజిత పాణి పల్లవము రాయుదునా నిను మౌళి దాల్చి మృ త్యుంజయ మూర్తినై జమునితో తొడ గొట్టి సవాలు చేతునా! -

'బఫే వైరాగ్యం'.......... హనుమంత రావురాజమండ్రి, అంధ్రప్రదేశ్.

Image
'బఫే వైరాగ్యం'.......... హనుమంత రావురాజమండ్రి, అంధ్రప్రదేశ్. నిజానికి నాకూ ఎందుకోగాని బఫే ఇష్టముండదు..వద్దనుకుంటూనే..లైనులో నించుంటాను..ఆ హాలు చాలా చిన్నది...కన్యాదాత పాపం చాలా గిల్టీ గా అందరికీ సారీ చెప్తున్నాడు...సీజను మూలాన ఇంకేదీ దొరకలేదుట. ఇదైనా ఎవరో కాన్సిల్ చేసుకుంటే దొరికిందట. రిసెప్షన్ కి చాలామంది వచ్చారు. మా పాతమిత్రులు కొందరు కలిసారు.... ఆ కాస్త ప్లేసులోనూ...ఓ ప్రక్క మొలకలెత్తే గింజలు, పచ్చికూర ముక్కలు, ఓ ప్రక్క ఘుమ ఘుమలాడే మషాలా వంటకాలు, అదికాక మామూలు భోజనం... ఆ ప్రక్క ఛాట్....ఇంకో ప్రక్క పెసరట్టులు, మినపట్టులు, రవ్వట్టులు... వేడి వేడిగా వేస్తున్నారని అట్ల లైనులో నా పా.మిలు కొందరు జొరబడ్డారు.... ఆ పెనంమీద ఆట్లు ట్రిప్పుకి నాలుగేసే రెడీ అవుతున్నాయి...సర్వర్ అట్లకాడతో అట్లు అలా పైకెత్తగానే "నాకూ" "నాకూ" అంటూ గాలిలోకి చాలా ప్లేట్లు లేస్తున్నాయి. 'మాయాబజారు' సినీమాలో రమణారెడ్డి సృష్టికి ఎగపడే కౌరవసోదరులు గుర్తొచ్చారు. జగన్మోహిని అమృతం దేవతలకు మాత్రమే వయ్యారంగా పంచుతున్నట్టు ఆ అట్లకాడ ఓనర్ ప్లేట్లు ఎంచి ఎంచి మరీ పెడుతున్నాడు...

ముద్దుల నా యెంకి

Image
ముద్దుల నా యెంకి       గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ    కూకుండ నీదురా కూసింత సేపు!    …………………..   నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,    యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  || ……………….    కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,    దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  || ……………….    యీడుండమంటాది ఇలు దూరిపోతాది,    యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  || (పొన్నాడ వారి చిత్రం)

Night angle ....Bhratha Rathna Latha Mangeshkar.

Image
Pvr Murty "s Sketch . our Night angle ....Bhratha Rathna Latha Mangeshkar. Our best wishes..

వైష్ణవమాయ

Image
వైష్ణవమాయ ............ By - Kameswara Sarma Sriadibhatla ఒకసారి అగస్త్య మహర్షి శ్రీకృష్ణ దర్శనార్ధమై ద్వారకకు వెళ్ళి యమునకు ఆవలి దరి ఉండి తానొచ్చినట్టుగా కృష్ణమూర్తికి వర్తమానం పంపేరట.  కబురందిన కృష్ణయ్య హడావుడిగా సత్య భామను పిలిచి భామా యమునకు ఆవలి వొడ్డున అగస్త్యుల వారు విడిసి ఉన్నారు వారికి తగు ఉపచారములుకావించి నగరిలోనికి తీసుకురా, ఆఁ అన్నట్టు ఎప్పుడు భోంచేసేరో ఏమో వారికోసం భోజన సామగ్రికూడా వెంట తీసుకు వెళ్ళుమా అని చెప్పగా, అలాగే అని బయలుదేరిన సత్య భామ వెంఠనే వెనుదిరిగి వచ్చి నాధా యమున ఉద్రుతముగా ప్రవహిస్తునాది దాటి పోవుట కష్టముగా ఉన్నాది ఎలా అంటూ చెప్పిందిట.  అందుకు నల్లనయ్య నవ్వి, అస్కలిత బ్రహ్మచారి నన్ను పంపాడు, యమునమ్మా నా దారి తొలగుమా అని చెప్పు నీ పని ఐపోతుంది అని చెప్పేడట. అది విన్న సత్యభామ పక్కున నవ్వుతూ అదేమిటి స్వామీ అష్టకళత్రములు అఫిషియల్గా కాక మరో పదహారువేలమంది అనఫిషియల్ భార్యలు ఉన్న మీరా అస్కలిత బ్రహ్మచారి? చాల్లెద్దురూ మీ పరాచికాలూ అందిట.  మాధవుడు మంద్స్మిత వదనుడై, చెప్పి చూడరాదా సత్యా అన్నాడట, సరేలెమ్మనుకున్న సత్య పరివారం వెంట రాగా మొత...

Sublime love.....R.K films the best in 50's

Image
Sublime love.....R.K films the best in 50's SHANKAR JAIKISHAN super tune composing....a hit song still makes its way. till to day we remeber...one of the most beautiful song from Raj kapoor era.his type of sogs are beyond for present generation.... What amelody...&meaning full......

అల్లసాని వారి అల్లిబిల్లి ఏడుపు అన్నాడు రామ లింగడు.

Image
అల్లసాని వారి అల్లిబిల్లి ఏడుపు అన్నాడు రామ లింగడు. పాటున కింతులోర్తురె కృపా రహితాత్మక నీవు ద్రోవ ని చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొను మంచు చూపి య ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చె కల స్వనంబునన్ మీటిన గబ్బి గుబ్బ చను మిట్టల నశ్రులు చిందు వొందగాన్ !!

కడవ ఎత్తుకు వచ్చింది కన్నె పిల్ల,, గుండె ఝల్లు మనేలా.....

Image
కడవ ఎత్తుకు వచ్చింది కన్నె పిల్ల,, గుండె ఝల్లు మనేలా.....

మనుచరిత్రలో వరూధిని స్వపరిచయం:

Image
మనుచరిత్రలో వరూధిని స్వపరిచయం: పేరు వరూథిని, విప్రకు మార ! ఘృతాచీ, తిలోత్తమా, హరిణీ, హే మా, రంభా, శశిరేఖ లు దార గుణాఢ్యలు మదీయలగు ప్రాణ సఖుల్

నా సర్వం మీకే సమర్పితం’

Image
‘అయితే సరే స్వామీ, మీరు నిజంగా తీసుకునేట్లయితే, అలా అడగండి. దక్షిణగా మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాను. మీరు అడగాలే కానీ నేను ఇవ్వనిదంటూ ఉండదు’ అన్నాడు. ‘అయితే సరే. అడుగుతున్నాను, ఇప్పుడు ఇవ్వు. ఏమిస్తావబ్బా?’ అంటూ ఆగాడు స్వామి. ‘ఏదైనా తీసుకోండి. నా సర్వం మీకే సమర్పితం’ అన్నాడు ఆ మనిషి. ‘అయితే నువ్వీ లోకంలో చేసిన పుణ్యమంతా నాకిచ్చెయ్’ అన్నాడు రమణుడు. ‘నేనేమీ పుణ్యం చేసుంటానండీ? నాకు ఒక్క సద్గుణమైనా లేందే?’ అన్నాడు అతడు. ‘అడిగినది ఇస్తానని వాగ్దానం చేశావు కదా? ఇప్పుడు నేను అడిగాను మరి ఇవ్వు. సద్గుణవంతుడివవునో కాదో, ఆ విషయం వదిలెయ్. నీవు గతంలో చేసిన పుణ్యమంతా ఇచ్చెయ్యమంటున్నాను, ఇవ్వు.’ ‘అలాగే ఇస్తాను, స్వామీ. కానీ ఇవ్వడమెలాగ? ఎలా ఇవ్వాలో చెప్పండి. ఇచ్చేస్తాను’ అన్నాడు అతడు. ‘నోటితో మనస్ఫూర్తిగా ఇలా అనుఃనేనితః’క్రితం చేసిన పుణ్యమంతా గురువుకు అర్పిస్తున్నాను. ఇక ముందు ఆ పుణ్యఫలం యొక్క ఫలితమేదీ నాకు దక్కదు. అయినప్పటికీ అందుకై నేను చింతించను, అని హృదయపూర్వకంగా అను’ అన్నారు స్వామి. ‘అలాగే స్వామీ, నా జీవితంలో నేనేదైనా పుణ్యమనేది చేసి ఉంటే, ఆ పుణ్యమూ దాని ఫలితమూ అన్నీ కూడా మీకు ...

బాల రసాల...

Image
Courtesy:-కామేశ్వర రావు భైరవభట్ల   బాల రసాల... బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు కౌ ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై ఏవిటి, ఇది పోతన పద్యంలా అనిపిస్తోంది కాని కాదు అని ఆలోచిస్తున్నారా? అవును ఇది పోతన పద్యం కాదు. ఇది మంచన రచించిన కేయూరబాహు చరిత్ర కావ్యంలోని పద్యం. ఈ మంచన కవి క్రీ.శ. 1300 ప్రాంతం వాడని పరిశోధకుల అభిప్రాయం. పోతనకన్నా ముందరివాడు. ఇక్కడ "కూళలు" అంటే క్రూరుడు, మూఢుడు అనే అర్థం. అటువంటి వారికి సుకుమారమైన కావ్య కన్యకని ఇచ్చి ఆ పడుపుకూడు తినడం కన్నా పొట్టపోసుకోడానికి కవులు హాలికులగా మారి పొలం దున్నుకోడం మంచిది. అదికూడా లేదూ అంటే "కౌద్దాలికులు" అయినా పరవాలేదు అని దీని భావం. "కుద్దాలము" అంటే ఒక రకమైన గడ్డపార. కౌద్దాలికులంటే గడ్డపార పట్టుకొని కందమూలాలు తవ్వి తీసుకొని తినేవాళ్ళు అని అర్థం చెప్పుకోవచ్చు. నిజానికి మంచన తన కేయూరబాహు చరిత్రని నండూరి గుండనమంత్రికి అంకితం ఇచ్చాడు. అంచేత ఇక్కడ అతని ఉద్దేశం కావ్యాన్ని కూళలకి అంకితమివ్వకూడనే కా...

భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది:

Image
భర్తృహరి సుభాషితాల్లో నా మనసుకి చాలా హత్తుకున్న శ్లోకం ఇది: యదా కించిజ్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్య భవ దవలిప్తం మమ మనః యదా కించిత్కించిద్బుధజనసకాశా దవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః తాత్పర్యం: కొద్దిపాటి జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నప్పుడు మదగజం లాగా మదించి నేనే సర్వజ్ఞుణ్ణని  భావించినాను. తరువాత మెధావంతులైన పెద్దలవల్ల కొద్దికొద్దిగా జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత నాకేమీ తెలియదనీ, మూర్ఖుణ్ణనీ భావిస్తూ పూర్వపు గర్వాన్ని వదలి సుఖంగా ఉన్నాను. వివరణ: ఒక పండితుడు ఈ పద్యం లో తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. "అల్పో విద్యో మహాగర్వీ" అనే న్యాయానుసారం కొద్దిగా చదువుకున్న వాడికి గర్వమెక్కువగా ఉంటుంది. ఆ గర్వం తో వాడు సర్వజ్ఞుణ్ణని భావిస్తాడు. తర్వాత పండితుల వద్ద విద్యలను నేర్చుకుని కొంత జ్ఞానం సంపాదించిన తర్వాత అతని వివేకం కలిగి అంతకు పూర్వపు గర్వం తొలగిపోయి ’నేను మూఢుణ్ణి, ఏమీ తెలియని వాడిని అని భావిస్తాడు’ వేమన కూడా ఇలాంటివాళ్ళ గురించే  "అల్పుడెపుడు పల్కు ఆడంబరము గాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రో...

పరువు పోతే మరల రాదు.

Image
పరువు పోతే మరల రాదు. .పదవి పోతే బతుకు చేదు.. న్యాయమైతే ఒప్పుకోదు.. రగిలిపోతే మచ్చపోదు”. “అంతా తప్పేనని తెలుసు. అదీ ఒక ముప్పేనని తెలుసు… తెలిసీ లేదని ఖండించుటలో లేకితనం ప్రజలకు తెలుసు..”

అద్వైతమూర్తి....

Image
కరుణశ్రీ కవిత్వం:- అద్వైతమూర్తి చూచెదవేలనో ప్రణయ సుందరి, కాటుక కళ్ళలోని యా లోచనలేమిటో హరిణ లోచని నీ చిరునవ్వులోని సం కోచములెందుకో కుసుమ కోమలి నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నేటికి సుధామయ సూక్తి కళావిలాసినీ మనదాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్ గనియెన్ సాగెను భాగ్యనౌక కవితా కాళిందిలో నవ్య జీ వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము నే కొల్ల గొం దును నీ కోమల బాహు బంధనములందున్ కోటి స్వర్గమ్ములన్ భావోద్యానమునందు కొత్త వలపుం పందిళ్ళలో కోరికల్ తీవెల్ సాగెను పూలు బూచెను రసాద్రీ భూత తేజమ్ముతో నీవే నేనుగ నేనెనీవుగ లతాంగీ ఏకమై పోదమీ ప్రావృణ్ణీ రద పంక్తి క్రింద పులకింపన్ పూర్వ పుణ్యావళుల్

గురజాడ వారి జయంతి.....

Image
అప్పారావు అంటే అందరికి లోకువే ...... ఈ రోజు గురజాడ వారి జయంతి..... ఆ మహాను భావుడి తలచిన వాడు ఎవ్వరు లేరు ... జోకులకు మాత్రమే అప్పారావు ....

పతియే ప్రత్యక్ష దైవం.......

Image
పతియే ప్రత్యక్ష దైవం....... హనుమంత రావుgaru in Hashya vallari... (ఆలోచన ఆవిడది::అక్షరం నాది) ### (ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. అప్పుడే భార్య వీధివైపు నుంచి లోపలకి వచ్చింది.) భార్య: (తెచ్చిన ప్రసాదం భర్తచేతిలో పెట్టి,కుర్చీ భర్తదగ్గరకి లాక్కుంటూ)... ఏమండీ! ఇవ్వాళ గుళ్ళో వుపన్యాసం చెప్తూ భర్తయే ప్రత్యక్షదైవం అంటూ చెప్పారండి. ప్రత్యక్షదైవం అంటే యేమిటండీ? భర్త: ఇన్నాళ్ళకి ఓ మంచి ప్రశ్నవేసావోయ్ తాయారూ! చెప్తా విను. ప్రత్యక్షదైవం అంటే కనిపించే దేముడని అర్థం. నిజానికి దేముడు మనకంటికి కనపడడు కదా...అంచేత కనపడే భర్తలోనే అంటే పతిలోనే దేముణ్ణి చూడమని దాని భావం...అర్ధమయిందా? భార్య: బాగా అర్ధమయిందండీ..నేనూ అదే అనుకున్నానండీ...రేపు యేకాదశి కదా? రేపట్నించి మిమ్మల్నే నేను పూర్తిగా దేముడిలా కొలుచుకుంటానండీ.. భర్త: అలాగే తాయారూ! ఇన్నాళ్ళకు నీకో మంచి బుద్ధి కలిగింది. నాకు చాలా సంతోషంగా వుంది. * * * * * * * * * (నేపధ్యంలో తాయారు పాడుతూ వుంటుంది... ::తెల్లవారవచ్చె తెలియక నా స్వామి మరల పరుండేవు లేరా...) భర్త: (ప్రవేశిస్తూ..వళ్ళంతా దులుపుకుంటూ..) ప్రొద్దున్నే సుప్రభాతం ...

పరనింద మృత్యువువంటిది.

Image
పరనింద మృత్యువువంటిది. మనము అనవసరముగా ఎవరినైనా నిందిస్తే నిందింపబడిన వాడి పాపములో సగం మనకివస్తుంది. అంతేకాక మనం ఎంతో కష్టపడి ఆర్జించుకున్న పుణ్యసర్వస్వములో సగం అతనికి వెళిపోతుంది. కావున అనవసరముగా పరనిందచేయరాదు. నీవు చేసిన తప్పుకు పశ్చాత్తాపముచెంది పాపఫలము అనుభవించిన తరువాతశ్రీకృష్ణపరమాత్మ కృపచే ముక్తిని పొందుతావు”

మనుచరిత్రము. .....పిస్కా సత్యనారయణ గారి విశ్లేషణ..

Image
పిస్కా సత్యనారయణ గారి విశ్లేషణ.. ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత, భాగవతముల తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము, ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి అద్వితీయ ప్రబంధం మనుచరిత్రము. ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది.  మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ, మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు. పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి. ఆ 2 పాత్రల్లో మొదటిది - ప్రవరుడు; రెండవది - వరూధిని.  ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్ని గడుపుతున్న ఒక ఆదర్శ గృహస్థు. ....ఇక - వరూధిని ఒక అప్సరస. అద్భుత సౌందర్యరాశి, అపురూప లావణ్య వారాశి.  విధివైచిత్రి వలన వీరిద్దరూ అనూహ్యమైన రీతిలో, మనోహరమైన మంచుకొండల మధ్యలో, అనగా మనోజ్ఞమైన హ...

ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!"

Image
తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది. తెలుగు కవిత్వమ్మీద ఆసక్తీ అభిమానం ఉన్నవారెవరైనా తప్పకుండా చదివి తీరాల్సిన కావ్యం విరాటపర్వం. అవును తిక్కన తీర్చిదిద్దిన విరాటపర్వం అచ్చంగా ఒక కావ్యమే! ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు ఎవ్వాని గుణలత లేడువారాశుల కడపటి కొండపై గలయ బ్రాకు నతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు. ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం యిది. సాధారణంగా ఎవరికీ ధర్మరాజంటే మంచి అభిప్రాయం ఉండదు. అది చాలా సహజం. కానీ యీ పద్యాన్ని చదివాక "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!" అనుకోక మానరెవరూ. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ వర్ణించాడు. మళ్ళి మూడవపాదం అతని సంపద, వైభవం...

'విశ్వనాధ పంచశతి

Image
విశ్వనాధ గారంటే అందరికీ గంభీరమైన పద్యాలే గుర్తుకు వస్తాయి. నాకు మాత్రం ఆయనలోని సునిశితమైన వ్యంగ్యం, హాస్య చతురతా జ్ఞాపకం వస్తాయి. 'విశ్వనాధ పంచశతి ' అని వారు ఐదు వందల పద్యాలు వ్రాశారు సరదాగా. ఏ పద్యానికాపద్యమే ఓ రస గుళిక. ఒక్కో పద్యాన్ని పంచ్ లైన్ గా తీసుకొని ఒక్కో కథ వ్రాయవచ్చు . మచ్చుకు ఇవి చూడండి: " వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు అంగనామణి పెండిలియాడి కూడ ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె " " ఊరి భార్యలెల్లరూహించి యామెను మంచంబుతోనిడిరి శ్మశానమందు అట పిశాచకాంతలాలోచనము జేసి పడతి మరల నూరి నడుమనిడిరి " ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!

వస్తా....వెళ్లి వస్తా ...అంటూ నాడు మన వినాయకుడు...

Image
వస్తా....వెళ్లి వస్తా ...అంటూ నాడు మన వినాయకుడు...

'అంకముఁ జేరి శైలతనయా ......

Image
'అంకముఁ జేరి శైలతనయా స్తనదుగ్ధము లానువేళ బా  ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్ గబళింపఁబోయి యా  వంకఁ గుచంబుఁ గాన కహివల్లభు హారముఁ గాంచి వే మృణా  ళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్.' (మనుచరిత్ర....అల్లసాని ) Satyanarayana Piska వారి వివరణ. గణపతిదేవుణ్ణి ఎందరో కవులు ఎన్నెన్ని విధాలుగానో ప్రస్తుతించారు. ఐతే, ఈ పద్యంలో చిత్రించినట్టుగా ' బాలవినాయకుడు ' బహుశా మరెక్కడా ప్రత్యక్షమవలేదేమో! ఇందులో కవి అత్యంత రమణీయంగా ఆ గిరిజాతనయుణ్ణి మన కన్నులకు కట్టినట్టుగా చూపించాడు. పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవి తన గారాల కుమారుడైన చిన్నివినాయకుడికి స్తన్యం ఇవ్వాలని ఒళ్ళోకి తీసుకుంది. పాలు తాగుతున్న ఆ అల్లరిపిల్లాడు కుదురుగా ఉండకుండా తన తొండముతో అవతలివైపున్న రెండో కుచమును అందుకోడానికి ప్రయత్నించాడు. (ఇది చాలా సహజమైన బాల్యచేష్ట! తల్లిపాలు తాగుతున్న పసిపిల్లలను కాసింత పరిశీలనగా పరికిస్తే ఈ దృశ్యాన్ని ఈనాటికీ మన ఇళ్ళల్లో దర్శించవచ్చు)....ఐతే, ఆ వైపున అమ్మగారి రెండవ స్తనం లేదట! పైపెచ్చు, నాగేంద్రహారం ఉందట ఆ చోట! సహృదయ పాఠకులు ఈపాటికి కనిపెట్టే ఉంటారు.

కింకవీంద్ర ఘటా పంచావన

Image
కింకవీంద్ర ఘటా పంచావన తెలుగువారికి అష్టావధానం అనగానే గుర్తుకొచ్చే జంటకవులు తిరుపతి వెంకట కవులు. ఓసారి వారు అవధానం చేస్తుండగా కాశీనాథ శాస్త్రి అనే పృచ్ఛకుడు ఆ జంటకున్న‘ కింకవీంద్ర ఘటా పంచావన ‘ అనే బిరుదును అపహాస్యం చెయ్యడానికి ఇలా వక్రభాష్యం చెప్పాడట. “ కింకవీంద్ర అంటే నీటి పక్షుల్లో గొప్పవైన అని, ఘటా అంటే గుంపు అని, పంచ అంటే వెడల్పయిన అని, అవనము అంటే ముఖం కలది అనీ అర్థాలు వస్తాయి. కనుక ఈ బిరుదుకు ‘ పెద్ద కొంగలు ‘ అంటే సరిగ్గా సరిపోతుంది “ అని వ్యాఖ్యానించాడు. దానికి ఆ జంట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి గారు తడుముకోకుండా ఇలా సమాధానమిచ్చారు..... “నిజమే ! కాశీనాథుల వారు సెలవిచ్చినట్లు మా బిరుదుకు పెద్దకొంగలు అన్న అర్థం వస్తుంది. అయితే ‘ కా ‘ అంటే నీరు, ‘ ఆశి ‘ అంటే తిరుగునని అర్థాలు వస్తాయి. కనుక ‘ కాశీ ‘ అంటే చేపలు అని అసలు అర్థం వస్తుంది. కాశీనాథులు కనుక పెద్దచేపలు అవుతుంది. అంటే ఆయన పాలిట మేము పెద్దకొంగలమే ! “ అన్నారట. ఇంకేముంది...! కాశీనాథుల వారి నోట మారు మాట వస్తే ఒట్టు.

సి. యస్. ఆర్. హస్త సాముద్రికం....

Image
సి. యస్. ఆర్. హస్త సాముద్రికం  తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగానికోచ్చిన వారే ! 1930 దశకంలో కథానాయకుడిగా వెలిగిన ఈయన 1950 దశకంలో క్యారెక్టర్ నటుడిగా మారారు. దేవదాసులో పార్వతిని పెళ్ళాడిన జమిందారు పాత్రలో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయన మాటల చమత్కారానికి నిదర్శనం. దేవదాసు షూటింగ్ విరామ సమయంలో సెట్ బయిట కూర్చున్న సావిత్రితో సి. యస్. ఆర్. " అమ్మాయీ ! ఏదీ నీ చెయ్యి చూపించు " అన్నారు. సావిత్రి  తన చెయ్యి చూపించి ఆయన ఏం చెబుతారా అని కుతూహలంగా చూస్తోంది . కాసేపు తదేకంగా ఆ చెయ్యిని పరిశీలించిన సి. యస్. ఆర్. " నీకు మూడు ముఖ్యమైన విషయాలు చెబుతాను. అవి ఒకటి నిన్నెవరూ సరిగా అర్థం చేసుకోరు. రెండు నీ ప్రతిభకు తగ్గ వేషం దొరకడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు మూడు నీకు అప్పుడప్పుడూ స్టమక్ ట్రబుల్ వస్తూంటుంది " అన్నా...

మహిళలంతా ఓచోట గుమికూడితే .....

Image
మహిళలంతా ఓచోట గుమికూడితే ఎలా ఉంటుందో చెప్పడంలో జంఘాలశాస్త్రి ఇలా రెచ్చిపోయాడు. -- 'ఎక్కడ వినిన గాజుల గలగల, అందెల ఝణఝణ , కాంచీఘంటికల గణగణ, ఎక్కడజూచిన జెక్కుటద్దముల తళతళ, గుబ్బిగుబ్బిల పెళఫెళ, తారాహారముల మిలమిల,  వేణీభారముల జలజల, ముద్దుమొగాముల కలకల, ఎక్కడకు బోయిన నగరు ధూపముల గమగమ, చందన చర్చల ఘుమఘుమ,  మృగమదలేపముల ఘుమఘుమ... --- కొర్నాటి చీరలవారు, బనారసుకోకలవారు, బరంపురపు పీతాంబరములవారు, సన్నకుసుంబాచీరలవారు, గోచికట్లవారు, గూడకట్లవారు, చుట్టుత్రిప్పులవారు, మేలిముసుగులవారు, వ్రేలుముళ్ళవారు, జడచుట్లవారు, వంకకొప్పులవారు ....

మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా?

Image
 ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి  జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. --  మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున  ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా?  ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. ..

' సింహత్రయం'

Image
Padmini Bhavaraju..... పిఠాపురం రాజాస్థానంలో పానుగంటి లక్ష్మీనరసింహం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కూచి నరసింహం అనేవారు ' సింహత్రయం' అనే పేరుతొ ప్రసిద్ధికెక్కారు.  పానుగంటి లక్ష్మీనరసింహం గారు వ్యంగ్య రచనలో అందే వేసిన చెయ్యి. తెలుగు సాహిత్యంలో పానుగంటి రాసిన సాక్షి వ్యాసాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన తూర్పుగోదావరి జిల్లా, సీతానగరంలో 1865 నవంబర్ 2న జన్మించారు. పిఠాపురంరాజా సూర్యారావు కోరిక మేరకు పానుగంటి అనేక నాటకాలు రాశారు.  ఆయనను ‘ఆంధ్రా షేక్‌స్పియర్’, ‘ఆంధ్రా ఎడిసన్’ అని పిలిచేవారు. ఆయనకు ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు ఉంది. ‘విప్రనారాయణ చరిత్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘రాధాకృష’్ణ, ‘కాంతాభిరామం’, ‘రాతిస్తంభం’, ‘కళ్యాణ రాఘవం’ లాంటి ఎన్నో రచనలను తెలుగు పాఠకులకు అందించారు.  ఆయన రాసిన చాటువులు చూడండి ... వేపారి కంటె సరసుడు  నేపాళపు మాత్రకంటే మేలౌ మందున్  వేపాకు కంటె చేదును  సాపాటున కంటే సుఖము నహి నహి మహిలోన్ ! బచ్చుండవు నెర దాతల మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా చిచ్చుండవు కవి వర్యుల మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ ! సెట్టీ ...

శుక్ర నీతి.:-

Image
శుక్ర  నీతి.:-   "నేనడిగిన మూడడుగుల నేలా నాకియ్యి – అంతేచాలు" అని పదేపదే అంటున్న వామనుని మాటలు శుక్రచార్యునికి అనుమానం కలిగించాయి. దానం చేయటానికి సంసిద్ధుడైన బలిచక్రవర్తిని ఆ ప్రయత్నం నుంచి మరలింపదలచాడు. ఎందువల్లనంటే శుక్రుడు – "రాక్షసరాజ్య నిర్మాణధుర్యుడు" వామనుడై వచ్చినవాడు విష్ణువనీ, "మూడడుగుల నేల" అనే నెపంతో బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడనీ, సమస్తమూ కోల్పోయి బలి "బడుగు పగిది" బ్రతుకవలసి వస్తుందనీ హెచ్చరించాడు. ఆత్మవినాశ హేతువైన దానాన్ని చేయకపోవటం వల్ల అసత్యదోషం ఉండదన్నాడు. చాలా ప్రమాణాలు చూపాడు. చివరకు –   "వారిజాక్షులందు వైవాహికములందుఁ  బ్రాణ విత్త మాన భంగమందుఁ  జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు  వొంకవచ్చునఘమువొందడధిప!"         అనే నీతిని వెలయించాడు. ఇదంతా శుక్రునికి బలిపై ఉన్న వాత్సల్యం. రాక్షస గురువుగా ఆయన ధర్మం. కులాచార్యుడు శుక్రుడు చెప్తున్న హితవాక్యాలను విన్న బలి – "క్షణమాత్ర నిమీలిత లోచనుడై" ఆయనతో - "మహాత్మా! మీరు చెప్పేది యధార్థమే . ఏదడిగినా ఇస్తానని చెప్పిన నేను – ఇపుడు కాదనలేను. భూదేవి బ్రహ్మతో –...

పింగళి, కాటూరి కవులకు ఒక విశిష్టస్థానం .

Image
ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో పింగళి, కాటూరి కవులకు ఒక విశిష్టస్థానం ఉంది. ఈ జంటకవుల పేరు వినగానే "సౌందరనందము" గుర్తుకు వస్తుంది. "గుడిగంటలు", "పౌలస్త్య హృదయము", "తొలకరి" మొదలైన వారి ఇతర రచనలు ఆంధ్రభాషామతల్లికి అమూల్యాలంకారాలు.  ఈ కవుల "తొలకరి" అనే కవితాసంకలనంలో, "రసాలము" అనే ఖండికలో - కేవలం ఏడు పద్యాలున్నాయి. దానిలోని మహత్తర సందేశాన్ని మనం ఒకసారి మననం చేసుకుందాం. రసాలము అంటే మామిడిచెట్టు. దానినుంచి మనం అందుకోదగిన సందేశమేమిటో చెప్పారీకవులు. "తరువులు మనకు గురువులు" అన్నారు కదా పెద్దలు.  మామిడి చెట్టును తోటవాకిటిలో నిలబడిన శోభనదేవతగా వీరు వర్ణించిన తీరు చూడండి - "పరిణత సత్ఫలమ్ముల, సువానలీను సుమమ్ములన్, మనో  హరమగు తేనెదొన్నెల, లతాంత రజమ్మను కుంకుమమ్ముఁబ  ళ్ళెరమున నించి, చేతగొని లేనగవొప్పగఁదోట వాకిటన్  సురుచిర మూర్తితో నిలుచు శోభనదేవతవీవు భూజమా !" "ఓవృక్షమా! పండిన పళ్ళు, సువానతో అలరారే పువ్వులు, తేనెదొన్నెలు, పుప్పొడి అనే కుంకుమ ఉన్న ఒక పళ్ళెం చేతులతో పట్టుకొని మనోహర రూపంతో,...

ఒక్కసారి మీ పాత అనుభవాన్ని నెమరు వేసుకొండి మరి.

Image
మిత్రులారా గుర్తున్నదా ఈ పరికరం. మనచిన్నప్పుడు తెగ వాడేవాళ్ళం. సాయంత్రం అవుతున్నది అంటే ముందు చేసే పని బుడ్డిలో కిరసనాయిల్ పోసి, వత్తి సరిచేసి, పైన గ్లాస్ ని ముందు బట్టతో ఆతరవాత కాస్త ముగ్గుతో మెరిపించి రెడీ చేసేవాళ్ళం. అలాగే చిన్నసైజు దీపాలు. పెట్రమాక్స్ దీపాలు కాస్త జాగ్రత్తగా వెలిగించేవాళ్ళం. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇవన్ని త్వరలో తిరిగి మనజీవితాల్లో ప్రవేశించ వచ్చును. మల్లి ఒక్కసారి మీ పాత అనుభవాన్ని నెమరు వేసుకొండి మరి.

Vennelalone Pellinaati Pramaanaalu

Image
మధురమైన పాట ఆహ్లాదకరమైన పాట వినే కొద్ది వినాలనిపిస్తుంది. మొన్నటి కన్నా నిన్న మిన్నగా...... వెన్నెల లో వేడిమీ లోనే చల్ల  అంత వయసు మాయ...

Vennelalone Pellinaati Pramaanaalu

Image
మధురమైన పాట ఆహ్లాదకరమైన పాట వినే కొద్ది వినాలనిపిస్తుంది. మొన్నటి కన్నా నిన్న మిన్నగా...... వెన్నెల లో వేడిమీ లోనే చల్ల  అంత వయసు మాయ...

ఎరక్క పోయీ వచ్చి....ఇరుకున పడ్డ వినాయకుడు.....తెలుగు వనంలో....

Image
ఎరక్క పోయీ వచ్చి....ఇరుకున పడ్డ వినాయకుడు.....తెలుగు వనంలో....

సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం…

Image
* గత దశాబ్దంగా తమ ఒంపు సొంపులతో, ఆటపాటలతో ఆంధ్ర పేక్షకుల గుండెకాయల్ని వేరు శనక్కా యల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం… ఈ సోదరీమ ణులిదరూ ఆంధ్రులపాలిట ఇషదవాలు. ఆవకాయ, గోంగూర లాంటివారు. ఈ పచ్చళ్లలో ఏదో ఒకటి లేనిద్ద్టే ఎౖ తెలుగువారి భోజనం ఎలా ఉండదో, వీరిదరిలో ఏ ఒక్కరెనా లేకుండా తెలుగు సినిమాయే అసలు ఉండదు.

Sitha Agni pravesam a Modren art.

Image
 Sitha Agni pravesam a Modren art. అగ్ని పూనిత  సీత.....

మ్రింగెడివాడు విభుండని... పోతనామాత్యుడు.(వివరణ భైరవ భట్ల కామేశ్వరరావు గారు.)

Image
మ్రింగెడివాడు విభుండని... పోతనామాత్యుడు.(వివరణ  భైరవ భట్ల  కామేశ్వరరావు గారు.) మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనె సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! హాలాహలం పొంగుకొచ్చి లోకాలని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు అందరూ కలిసి వెళ్ళి మహేశ్వరుడికి మొర పెట్టుకొంటారు. అసలే శివుడు భోళాశంకరుడాయె! వాళ్ళలా వేడుకొనేసరికి అతని మనసు కరగకుండా ఉంటుందా? ప్రపంచాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించే అనుకంప అతనిది! అందుకే ఆ విషాన్ని మొత్తం మింగి ప్రపంచాన్ని కాపాడడానికి పూనుకొంటాడు. తన అర్థాంగి కదా పార్వతి, ఆమె యేమంటుందో అని ఆమె వైపు చూస్తాడు. ఆమె చిరునవ్వుతో తన అంగీకారాన్ని తెలుపుతుంది! ఇదీ సంస్కృత భాగవతంలో ఉన్న సన్నివేశం. "ఎంత దేవుళ్ళైనా, చూస్తూ చూస్తూ తన భర్త విషం తాగడానికి ఏ భార్యయినా అంగీకరిస్తుందా?" పోతన లాంటి భాగవతోత్తమునికి దానికి సమాధానం దొరకడం పెద్ద కష్టమై ఉండదు. అయితే ఇక్కడ గొప్పతనం ఏవిటంటే, ఆ సందేహాన్నీ దాని సమాధానాన్నీ, కవితాత్మకంగా తెలుగు భాగవతంలో చిత్రించడం! తనే నేరుగా ఇది చెప్పేస్తే, అది వ్యాఖ్యానంలా ఉంటుంది. కాబట్టి ఆ సందేహ...

నేడు ‘అచ్చ తెలుగు’ చిత్రకారుడు వడ్డాది పాపయ్య (‘వ.పా.’) జయంతి, వారి చిత్రాలు.

Image
నేడు ‘అచ్చ తెలుగు’ చిత్రకారుడు వడ్డాది పాపయ్య (‘వ.పా.’) జయంతి.