'బఫే వైరాగ్యం'.......... హనుమంత రావురాజమండ్రి, అంధ్రప్రదేశ్.
'బఫే వైరాగ్యం'..........
హనుమంత రావురాజమండ్రి, అంధ్రప్రదేశ్.
నిజానికి నాకూ ఎందుకోగాని బఫే ఇష్టముండదు..వద్దనుకుంటూనే..లైనులో
నించుంటాను..ఆ హాలు చాలా చిన్నది...కన్యాదాత పాపం చాలా గిల్టీ గా
అందరికీ సారీ చెప్తున్నాడు...సీజను మూలాన ఇంకేదీ దొరకలేదుట. ఇదైనా
ఎవరో కాన్సిల్ చేసుకుంటే దొరికిందట. రిసెప్షన్ కి చాలామంది వచ్చారు. మా
పాతమిత్రులు కొందరు కలిసారు....
ఆ కాస్త ప్లేసులోనూ...ఓ ప్రక్క మొలకలెత్తే గింజలు, పచ్చికూర ముక్కలు,
ఓ ప్రక్క ఘుమ ఘుమలాడే మషాలా వంటకాలు, అదికాక మామూలు భోజనం...
ఆ ప్రక్క ఛాట్....ఇంకో ప్రక్క పెసరట్టులు, మినపట్టులు, రవ్వట్టులు...
వేడి వేడిగా వేస్తున్నారని అట్ల లైనులో నా పా.మిలు కొందరు జొరబడ్డారు....
ఆ పెనంమీద ఆట్లు ట్రిప్పుకి నాలుగేసే రెడీ అవుతున్నాయి...సర్వర్ అట్లకాడతో
అట్లు అలా పైకెత్తగానే "నాకూ" "నాకూ" అంటూ గాలిలోకి చాలా ప్లేట్లు లేస్తున్నాయి.
'మాయాబజారు' సినీమాలో రమణారెడ్డి సృష్టికి ఎగపడే కౌరవసోదరులు
గుర్తొచ్చారు. జగన్మోహిని అమృతం దేవతలకు మాత్రమే వయ్యారంగా
పంచుతున్నట్టు ఆ అట్లకాడ ఓనర్ ప్లేట్లు ఎంచి ఎంచి మరీ పెడుతున్నాడు
అట్లను.
నేనూ కొంతమంది మిత్రులం భోజనాలలైనులో పడ్డాం...
"ఇంత కూడుంటెట్టమ్మా..ఇంత పప్పుంటెయ్యమ్మా"...నా లోపల్నించి కోరస్
వినపడుతోంది...బాబూమోహన్ చేతిలో అల్యూమినియమ్ కంచంలా నా చేతిలో
చిప్ప నాకు తెలియకుండానే కదులుతోంది. లైనయితే ఎంతకీ కదలటంలేదు.
అనుమానంవచ్చిచూస్తే కొందరు తెలివైనవారు ముందువార్ని "హలో బాగున్నారా"
అంటూపలకరించి దూరిపోతున్నారు..బఫే అంటే 'క్లాసు'..చూసీ చూడనట్టు
ఊరుకోవాలి కాని అడక్కూడదు.
సెర్వింగ్ టేబిల్ దగ్గర చాలా క్రౌడ్..సర్వర్ మా ప్లేట్స్ లాక్కుని
"టిక్కూ" "టిక్కూ" అంటూ ఏవేవో వేసి ప్లేటులు చేతిలో పెట్టాడు///సంజీవనోద్ధారక
హనుమాన్ లా విజయోత్సాహంతో నిండు ప్లేటులు పైకి పట్టుకుని...జనాన్ని
గెంటుకుంటూ కొందరివతలకి వస్తుంటే., ఐటమ్ అయిపోతే మళ్ళీ అడగడానికి
దగ్గరగా ఉంటే మంచిదని అక్కడే లాగించేస్తున్నారు మరికొందరు.. కొంచెం
ఖాళీగావున్నచోట నించున్నా....నా వెనకాలే మావాళ్ళు కూడా వచ్చారు....
అలా అలా చూస్తుండగనే ఆ ఏరియా కూడా నిండిపోయింది..
ఒకాయన గులాబ్ జాం తినడానికి చెమ్చాతో కుస్తీ పడుతున్నాడు గుండ్రంగా
వున్నఆ గడుసు గులాబ్ జాం చెమ్చాబారిపడకుండా తప్పించుకుంటూ
ప్రక్కాయన ప్లేటులోకి జారింది. ఇందాక తెచ్చుకున్నది నేనుగాని
తినలేదా ఏమిటి అని ఆలోచించినవాడై కామ్ గా తినేస్తూన్న ఆయనకి
ఈయన్ని వాచ్ చేస్తున్న ఆయన శ్రీమతి కనపడింది..చక్ మని చూపు తిప్పేసు
కున్నాడీయన. డిసైడ్ అయిపోయాడు...ముందున్నది క్రోకోడైల్ ఫెస్టివల్ అని.
ఐనా కోరివచ్చిన గులాబ్ జాంని వదల లేకపోయాడు. ఒక తప్పుకి రెండు
శిక్షలుండవని తెలిసిన ఙ్ఞాని కనుక ఇంకో స్వీట్ కూడా తెచ్చుకుని వెనక్కి తిరిగి
లాగించేస్తున్నాడు.....సుగర్ స్టాకిస్టేమో పాపం ! ఏమో పాపం.
ఆ ప్రక్క...ఒకాయన ప్లేట్ పట్టుకుని కబుర్లు చెప్తూ తింటున్నాడు.. యెత్తులలో
ఉన్న తేడాలవలన ఆయన మూతి క్రిందుగా ప్రక్కాయన ప్లేటు నీటుగా అమరింది.
సదరు మూతిగలాయన ప్లేట్--దానిక్రింద వుంది..మూతికి దగ్గరలోని ప్లేట్ తనదా
లేక దూరముగా నున్నది తనదా అన్న సందిగ్ధంలో వుండగా మరో పొట్టాయన
క్రింద ప్లేట్ తన ప్లేట్ గా భావించాడో లేక అంత ఎత్తు చెయ్యెందుకు ఎత్తడం
అనుకున్నాడో అందుబాటులో వున్న ప్లేట్ తో అడ్జస్ట్ అయిపోతున్నాడు.
ఒకావిడకి తింటుంటే ఎక్కిళ్ళు...మంచినీళ్ళక్కడెక్కడున్నాయో..దగ్గరలో కనపడటం
లేదు....అటుగా వెళ్తున్న ఓ బుడతడ్ని నీళ్ళు తెచ్చిపెట్టమంది...వాడి రెండు చేతుల
లోనూ రెండు ఐస్క్రీం గిన్నెలు...మూతినిండా ఐస్క్రీం..."అమాయకురాలా...నేనెలా
తేగలను" అన్నట్టు చూసాడు సదరు బుడతడు....
అక్కడ వున్న ఓ లావుపాటి ప్రక్కింటి (ముళ్లపూడి) పిన్నిగారి భోజనం పూర్తయిందిలా
వుంది..ఎంగిలి ప్లేట్ ఎక్కడ పెట్టాలా అనుకుంటూ పెరుగుమూతితో వస్తోంది, ఎక్కిళ్ళ
అక్కయ్యగారి కాళ్ళ దగ్గరవున్న ఖాళీలో ఎంగిలి ప్లేట్ పెట్టి హస్తశుద్ధికై నిష్క్రమించింది
ఆ పెరుగుమూతి....ఎక్కిళ్ళ బాధతో స్టెప్స్ వేస్తున్న ఆ ఎ.అ.గారు ఈ లా.ప్ర.ము.
పిన్నిగారి ఎంగిలి ప్లేట్ లో ఉద్ధతితో ఓ స్టెప్ వేసారు...ఆ నాట్య ఉద్ధతి యొక్క
ఉధృతానికి ప్లేట్ లోవున్న పులుసుముక్కలు ఎగిరి నీట్ గా టక్ చేసుకుని అటుతిరిగి
భోంచేస్తున్న ఓ నాజూకుగారి వైట్ షర్ట్ యొక్క తెలుపుమీద అంటుకున్నాయి...ఆ
అలికిడికి ఆయన వెనక్కి తిరిగాడుకాని..ఆయనవీపు ఆయనకి కనపడదు కదా పాపం...
ప్రక్కనున్నభోజరాజు కిసుక్కున నవ్వబోయి..గబుక్కున నవ్వుకి మూతేసి,
మూతేసిన మూతితో తను గ్రహించిన విషయాన్ని నాజూకుగారికి విశదీకరించి పుణ్యం
కట్టుకున్నాడు....
నాజూకుగారి ముఖంలో కాంతి మాయమయింది. "మరకలు చేసుకు వస్తే ఊరుకొనేది
లేదు. అసలే తెల్లషర్ట్ వేసుకెళ్తున్నారు జాగ్రత్త///ఖబడ్దార్..." అంటూ జాగ్రత్తలు చెప్పి
మరీ పంపింది...నాజుకుగారి లలితాంగి. హౌ టు ఫేస్ హెర్ ..అదీ ఆయన సమస్య....
అలా అందర్నీచూస్తూ నేను పాపం చాకచక్యంగానే తింటున్నాను...ఒక్కోప్పుడు కాలం
కలసి రాదు కదండీ ? నా ప్రక్కాయన ఎడంచేయి సరిగ్గా సడన్ గా నా కుడి మోచేతికి
తగిలింది... నోట్లోకివెళ్ళవలసిన నా చెయ్యి గురితప్పి ముక్కులోకి వెళ్ళింది...రెండు
భయంకరమైన తుమ్ములొచ్చాయి..వాటి ధాటీకి ప్లేట్ సపదార్థంగా యెగిరింది...
అందులోవున్న భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయములన్నీ యెగిరి నాకూ...నా తోటివారికి
సచేల స్నానం..తుమ్ముల ధ్వనికి పిల్ల ఏడుపులు...పెద్ద నవ్వులూ కలబోసిన
నేపధ్యంలో....'వాష్ బేసిన్' దగ్గరకి పరుగెత్తా...నాట్ టు వాష్ ది బేసిన్..
నన్ను నేను వాష్ చేసుకోడానికి. నాతో సరియెంగిలి స్నానాలు చేసిన పెద్దలు
"బొత్తిగా మేనర్సు లే" వంటూ నా వెనకాల వస్తున్నారు...
ఆ రోజే మళ్ళీ డిసైడయిపోయా...బఫే లో భోజనం చేయకూడదని...
"ఆఁ ఇది కూడా ఓ వైరాగ్యమే బాబూ....ప్రసూతి వైరాగ్యం...మరేదో వైరాగ్యం లాగా "

Comments
Post a Comment