భాగ్యములకుప్ప పిళ్ళారప్ప!

భాగ్యములకుప్ప పిళ్ళారప్ప!

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!

తమిళనాడులో వినాయకుడిని పిళ్ళయ్యార్ అంటారు. అక్కడనుంచి వచ్చిందే "పిళ్ళై" అన్న పేరు. తెలుగులో కూడా కొన్ని చోట్ల వినాయకుణ్ణి ఈ పేరుతో పిలుస్తారనుకుంటాను. ఆ పిళ్ళారప్పని గురించి కొన్ని చాటు పద్యాలు:


శ్రీకర దంతరుచిజితసు

ధాకర మృడపార్వతీముదాకర గుణర

త్నాకర వరధీకర పర

భీకర భాగ్యములకుప్ప పిళ్ళారప్పా!


(శుభాలనిచ్చేవాడూ, తన దంతకాంతులతో తెల్లని జాబిల్లినే ఓడించినవాడూ, శివపార్వతులకి ఆనందం చేకూర్చేవాడూ, సద్గుణ సాగరుడూ, వరము (సిద్ధి), ధీ (బుద్ధి) ఇచ్చేవాడూ, శత్రుభయంకరుడూ - భాగ్యముల కుప్పైన ఆ పిళ్ళారప్పే!)


ఓరీ బాలుడ నీవిటు

రారా యని నన్ను బిలిచి రంజిలు దయచే

గోరిక లొసగుము భువి నీ

పేరును బ్రకటించి చెప్ప బిళ్ళారప్పా!


భక్షింపుము గావలసిన

భక్షణములు నీకు నిత్తు భక్షించియు నీ

కుక్షి గల విద్య మాకున్

బిక్షంబిడి కావుమప్ప పిళ్ళారప్పా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!