Skip to main content
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే?
Gumma Ramalinga Swamy
భాగవతము -- పోతన
మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు
లలితా రసాల పల్లవ ఖాదియైచోక్కు కోయిల సేరునే? కుటజములకు
బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనా మృత పాన విశేషమత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?
వినుత గుణసీల ! మాటలు వేయునేల ?
ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది. ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .భగవంతుడే తప్ప మరో ఆలోచన లేని మనస్సుకి ఇంకొకరు చెప్పడం వినడం ఉండదని., పోతన అభిప్రాయం .అతనూ ఆకోవకు చెడిన వాడే కదా !తన అభిప్రాయాని భక్తుడయిన బాలకుని చే చెప్పించాడు.వృద్యంగా తను చెప్పదలచుకున్నది . ఒకరడిన ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నలే గుప్పించడం ఇందులోని విశేషం . ఈ పద్య భక్తికిపట్టుకొమ్మ . అర్ధం చెబుతాను. మందార పువ్వుల తేనెల మాధుర్యానికి అలవాటు పడ్డ తుమ్మెద ఉమ్మేత్తు చెట్ల వైపుకు పోవునా? స్వచ్చమయిన నిర్మల మయిన గంగానదిలో తేలియాడు రాజ హంసలు వాగులకు వంకలకు పోవునా ? లేత మామిడి చిగుళ్ళు ఆరగించు కోయిలలు .కొండ మల్లెలు మ్రింగునా ? నిండు పున్నమిలో విహరించు చకోర పక్షులు పొగమంచు దరికి చేరునా ? అలా చేయవు. ఈ చెప్పు విధానం క్రొత్తది కాదు .పోతనకు ముందువాడు ఆ ప్రాంతము వాడు అయిన పాల్కురికి సోమన్న అంతకు ముందే చాలా ప్రయోగాలు చేసాడు. ఆ ప్రాంతం వాడయిన పోతనుకు ఆ వాసన అబ్బినది . పద్మనాభుని నిత్యమూ ద్యానించు నా చిత్తము ఇతర విషయముల వైపుకు పోవునా ? ఇది ఒక ఉపన్యాసకుడు వేదికనెక్కి గట్టిగా వాదించు ఫక్కి . ఇది పోతనకు చాలా ప్రితిపాత్రమయిన బాణీ . ఈ తరహాలో చాలా పద్యాలు భాగవతం నిండా గుప్పించాడు ఈ రాచనా ప్రక్రియ సోమన్నకు పోతన్నకు ప్రత్యేకము .ఆ హక్కులు వారిద్దరివే .ఇది బహుళ ప్రచారం పొంది పద్యం. తెలుగు నాట ఈ పద్యంలో ఒక పాదమయినా రాని స్త్రీ పురుషులు ఉండరనుటలో అతిశయోక్తి లేదు . ..
పంచ శరద్వయస్కుడవు బాలుడ వించుక గాని లేవు భా
భాషించెదు తర్కవాక్యముల జెప్పిన శాస్త్రములోని యర్ధ మొ
క్కించుక యైన జప్ప వసురెంద్రుని ముందట మాకు నౌదలల్
వంచుకోనంగ జేసితివి వైరివిభూషణ వంశదుషణా !
ప్రహ్లాదుని మాటలకు ఆగ్రహించిన గురువులు కోపగించి, బాలకా ఐదేండ్ల వయస్సు వాడవు, నీవు చిన్న వాడవు, ఇన్ని తర్క వాఖ్యములు చెప్పుచుంటివి మేము చెప్పిన శాస్త్రములలోనివి కొంచముగూడా చెప్పుటలేదు. రాజువద్ద మాకు తలవంపులు తెచ్చుచున్నావు. నీ వంశమును దూషించున్నావు .
పోతన పద్యాలు రసమయం
ReplyDeleteఅటువంటి మంచి పద్యాలను అందించిన మీకు ధన్యవాదాలు!!
అద్భుతం
ReplyDelete