Posts

Showing posts from June, 2014

“గ్రావిటీ” కన్నా మన ఖర్చు తక్కువే – మోడీ

Image
“గ్రావిటీ” కన్నా మన ఖర్చు తక్కువే – మోడీ మనం గ్రావిటీ నుండి బయట పడే శ టీ లైట్స్ తక్కువ ఖర్చు తో  పంపుతున్నాం.... హాలీవుడ్ లో “గ్రావిటీ” మూవీ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఏడు ఆస్కార్ అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. గ్రావిటీ చిత్రంలోని కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేశారట. పీఎల్ఎస్వీ-సీ23 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన “గ్రావిటీ”ప్రయోగం విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోడీ “గ్రావిటీ” చిత్రానికి అయిన ఖర్చు కంటే మార్స్ మిషన్ ప్రయోగానికి అయిన ఖర్చు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నడిపిస్తూ మన శాస్త్రవేత్తలు భారతదేశ ఘనతను చాటారని ప్రశంసించారు మోడీ. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే, 2013 లో విడుదలైన “గ్రావిటీ” సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్ఫోన్సో తెరకెక్కించారు. ఈ చిత్రం దాదాపు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందించబడింది.

హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు.

Image
హృదయమందున్న జ్యోతియే ఆత్మ వస్తువు. దానితేజస్సు సర్వ వ్యాప్తమైఉంటుంది. అందులోనే లోకములన్నీ కనుపిస్తాయి. బాల కృష్ణుడు ఈదీపశిఖలో కనుపింఛే బ్రహ్మాండాన్నే తన నోటిలో యశొదకు చూపిస్తాడు.  . ఈజ్యోతి అతి సూక్ష్మమైనది. కృష్ణుడు నోరుతెరచి తన హృదయాంతర్గతమైన జ్యోతినే యశోదకు చూపిస్తాడు. చిత్తముయొక్క విక్షేప శక్తివలన ఆమె అబ్బురపడి చూస్తూ ఉండిపోయినది. ఆమె యశోద. అంటే యశమును ఇచ్చునది. ఆమెద్వారా ఈ సంఘటన లోకానికి తెలిసినది. ఆయన యశస్సు లోకానికి చాటిచెప్పినది.ఆమెకు జగత్తుకు కారణమైన బిందువుని చూపిస్తే , ఆమెకు దానిలోని లోకములన్నీ కనుపించాయి. అర్జునునికి ఒక్క విశ్వరూపం మాత్రమే చూపించాడు. కృష్ణుడు ఆమె అవిద్యను ఆమెకి తిరిగి ఇచ్చివేశాడు. ఆమె కృష్ణుని దివ్యత్వంతెలుసుకోలేదు . బాలునికి ఏగాలో సోకినది. అని అనుకొని విభూతి పెట్టి ఉంటుంది

తిరుపతి వెంకట్ కవులు....

Image
తిరుపతి వెంకట్ కవులు.... ఆ జంట కవుల పూర్తి నామధేయములు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి. దివాకర్లవారిది పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, ఎండ గండి గ్రామం. తల్లిదండ్రులు:-శేషమ - వేంకటావధాని. ప్రజోత్పత్తి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమీ బుధవారం జననం.(1872). . చెళ్ళపిళ్ళ వారిది తూర్పు గోదావరి జిల్లా,ధవళీశ్వరం సమీపమున గల కడియము గ్రామం. తల్లిదండ్రులు:- చంద్రమ్మ - కామయ్య. ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమ వారం.(1870) . ఈ జంట కవులు నర్మోక్తులతో, హాస్య సంభాషణతో, చతుర వచో విలాసంతో, సభాసదులను ఆనంద పరవశుల్ని చేసే వారు. వాగ్గాంభీర్యంతో ప్రత్యర్థుల్ని అవాక్కయేలా చేసేవారు. సరస సంభాషణలో కూడా వీరుతక్కువవారేంకాదు. . ఒకపర్యాయం వీరు మండపేటలో కళాభిజ్ఞత, లోకజ్ఞత, రసజ్ఞత గల " మణి " అనఁబడే వేశ్యను చూచి, ఆమె చేసిన నాట్యాన్ని చూచారు. చాలా సంతోషింఛారు. అభినందించారు. అంతటితో ఊరుకోక ఆమెతో కొంటెగా " మణి మామూలుగా ఉండే కంటే " కడియం " లో ఉంటే సార్థకత లభిస్తుంది. శోభస్కరంగా ఉంటుంది. అన్నారు. (వారిది కడియం గ్రామమేకదా! అక్కడుంటే--- ...

శ్రవణానందం

Image
శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి. . సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు వాలు చూపులు రెండు వేలు సేయు నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు విర్రవీగుట లారువేలు సేయు పదమొక్కటియె సేయు పదివేల వరహాలు లావణ్యమది యొక లక్ష సేయు బలుసోయగమె సేయు పది లక్షల వరాలు కులుకు నడక తీరు కోటి సేయు . ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!! . అసాధారణ కవితావేశ సంపన్నులైన శ్రీ తిరుపతి వేంకట కవులిరువురూ ఒకే కాంతను ఇంతగా మెచ్చుకున్నారూ అంటే ఆ కాంత ఏ కాంతయో?

మనిషి ఆశాజీవి..

Image
మనిషి ఆశాజీవి....... .మనిషి ఆశాజీవి. ఎంత ఆశాజీవి అంటే, లక్ష రూపాయల జీతం కోసం కష్టపడి, ఉదోగ్యం సాధించినా, ఇంకో లక్షవస్తే బాగుండని దాని కోసం ప్రయత్నిస్తాడు.  అది సాధిస్తే, ఇంకో లక్షకోసం. ఆస్తుల విషయంలో కూడా అంతే. ఎన్ని ఆస్తులున్నా, ఇంకా ఇంకా కూడబెట్టాలన్న తపన.  కొన్ని తరాలను పోషించదగ్గ సంపద ఉన్నా, ఇంకా పోగు చేసి, మరింత ధనవంతుడిని కావలనే తపన, ఏదో వెంపర్లాట.  ఇది జీవితాంతం ఉంటుంది. నిజానికి జీవితం మొత్తం ఈ వెంపర్లాటలోనే గడిచిపోతుంది. యవ్వనంలో సంపాదించడం కోసం కష్టపడతాడు,  ముసలివయసు రాగానే రోగాలను నయం చేసుకోవడం కోసం మొత్తం సంపద ఖర్చు చేస్తాడు. ఇదంతా గమనించిన వ్యక్తిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. చచ్చేటప్పుడు నేను వీటిని కట్టుకుపోను, మరి వీటి కోసం ఇంత ఆందోళన ఎందుకు అనిపిస్తుంది.  మరణం తర్వాత మనిషి వెంబడి వచ్చేవి కర్మల ఫలితాలు, అంటే పాపపుణ్యాలు మాత్రమే.

చాల్లేవమ్మా నాకు చెప్పవచ్చేవు....

Image
చాల్లేవమ్మా నాకు చెప్పవచ్చేవు....నోరు మూసుకొని మూల కూర్చో... అత్తగారు అంటే ఎలా ఉండాలో నాకు చెప్పా వచ్చేవు...  లలితా పవారు తో ..మన కాంతం... x

షావుకారు జానకి...కృష్ణకుమారి... స్వంత తో బుట్టువులు...

Image
షావుకారు జానకి...కృష్ణకుమారి... స్వంత తో బుట్టువులు... x

హింది సూర్యకాంతం......లలితా పవర్....

Image
హింది సూర్యకాంతం......లలితా పవర్.... x

మన అమ్మ లక్కలు....చాయాదేవి...సూర్యకాంతం. (Shadow Devi....Sun Shine,)

Image
మన అమ్మ లక్కలు....చాయాదేవి...సూర్యకాంతం. (Shadow Devi....Sun Shine,)

రాధ ఎవరు?

Image
రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ. గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ

కొంటెబొమ్మల బాపు

Image
కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం వ్రాసి,ప్రముఖ కవి ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు.

బుస కొట్టబోతున్న బస్సు చార్జీలు !

Image
బుస కొట్టబోతున్న బస్సు చార్జీలు ! మొన్ననే రైల్వే చార్జీలు ఒక కూత కూసేసాయి ! ఇప్పుడు తాజాగా బస్సు కస్సు బుస్సుమంటోందన్నమాట ! వీటికి తోడు,,,నెల నెలా గ్యాస్ గయ్యిమంటుందట ! ఉల్లి మల్లీ ఘాటైపోతున్నదట ! బియ్యం కొందామంటే బయ్యమేస్తుందట ! కందిపప్పు కొండెక్కింది ! కరెంటు షాక్ కొడుతున్నది ! వాయించి "వేయించు" కోవడమేఈ కొత్త పాలనలో !

నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం

Image
 నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం -వింజమూరి వెంకట అప్పారావు   ఆధునికాంధ్ర సాహితీ జగత్తులో ” ఆకులు రాలని, పూలు వాడని, నిత్య వసంతారామం కృష్ణశాస్ర్తి సాహిత్యోద్యానవనం” అని  నాటి నేటీ మేటీ కవుల , విమర్శకుల అభిప్రాయం. అది కాదనలేని వాస్తవం.. ఒక సుందర దృశ్యాన్ని చూసినా, ఒక మనోహర కవితను చదివినా కృష్ణశాస్తి స్మృతి మన మనో వీథిలో తళుక్కుమనకమానదు.   వ్యక్తిని మహోన్నతుడిగాను , మహా మనిషి గాను, మహాకవి గాను, యుగకర్త గాను మలచడంలో జన్మత: అతనికి సంక్రమించే  ప్రతిభా పాఠవాలే గాక, వంశపరంపరాగత గుణాలు..గణాలు.. తల్లిదండ్రుల శిక్షణాదికాలు కొంతవరకు , విద్యాబుద్ధులు కొంతవరకు,  పుట్టిపెరిగిన వాతావరణము కొంతవరకు, గురు ప్రభావము,, మిత్ర సహవాసము, సమకాలీన ఉద్యమ ప్రభావము, నాటి సామాజిక ఆర్ధిక, రాజకీయాది స్థితి గతులు, మరికొంతవరకూ తోడ్పడతాయి. ఇవన్నీ కృష్ణశాస్త్రి జీవిత, వ్యక్తిత్వ, వికాసాభ్యున్నతులకేవిధంగా దోహదపడ్డాయో వీరి కవితలలో, సినీగీతాలలో స్పష్టంగా గోచరిస్తాయి.  విరహ వేదనను అత్యంత హృద్యంగా మరెవరూ  వ్రాయలేనంతగా అక్షరాలను పొదివి వాడేది వారి కలం . ...

ఏముంది విశాఖలో......

Image
ఏముంది విశాఖలో......(కవిత:---హెచ్చార్కె) ఎప్పుడైనా తను జ్ఙాపకం వస్తుంది జీడిమామిడి చెట్ల మెత్తని నీడల్లో మొదటి సూర్య స్పర్శ కోసం, తన కోసం పొంచి వున్న నేను జ్ఙాపకం వస్తాను ఏముంటాయి క్లాసురూంలో అదే నన్నయ లేదా భట్టుమూర్తి తువ్వాలు దుశ్శాలువా సవరించి మహాప్రస్థానం పద్యాల్లో గర్జించే పదాలకు నింపాదిగా‍ అర్థాలు చెప్పే మాష్టార్లు, బయట నల్లగా మెలికలు తిరిగి, పాం పడగల్లా లేచి, నిట్టనిలువుగా పడిపోయే రోడ్లు... అంతే, ఏమీ ఉండవు: చిరాగ్గా తల తిప్పి, అటు వైపు చూస్తే నునుపు రాతి మీద కదిలే అద్దపు సెల పాటలా ... పగలు కదా, వెన్నెలకు బదులుగా... ఒక చెంప మీదుగా జారే సూర్యుడు,  పగటి కాంతిని మెత్త బరిచే మత్తు మగత, వస్తువులు ఉండీ లేకుండే అంతర్మధ్యం రామకృష్ణా బీచ్‍లో కూడా ఏమీ ఉండదు జిగురు సాయంత్రపు బొటన వేళ్లతో ఇసుకను దున్నుతున్న కొన్ని దిగుళ్లు ఎప్పుడు ఏ తప్పు చేసిందో, రాతి ఒంటిని వంచి, ముక్కు నీటికి రాస్తున్న ఆకుపచ్చ డాల్ఫిన్, దూరంగా, ఘీంకార స్వరంతో మూలుగుతూ కదిలే కొండలా ఇంకొక ఓడ... అంతే, ఏమీ వుండవు: ఇసుకలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచేలోగా ఒక చోట న...

అమ్మ ఒక ఆకాశం.....

Image
అమ్మ ఒక ఆకాశం, బిడ్డకు సొంత దేహంతో అన్నం పెట్టే అమ్మ ఆమ్మకు తప్ప ఇక ఎవరికి, ఎవడికి వంగినా అది శిరస్సు కాదు

కృష్ణుని పేరు ఏమిటి?

Image
కృష్ణుని పేరు ఏమిటి?  ఎవరు పెట్టారా పేరు? చిన్నప్పుడు బారసాల (బాలసారె) వంటి సంస్కారములు జరిగినట్లు ఎక్కడా వినలేదే? పుట్టగానే తండ్రి వసుదేవుడు యమునను దాటించి నందుని ఇంట్లో విడిచి వచ్చాడు.  తండ్రి బియ్యంలోపేరు వ్రాసి నామకరణం చేయాలి. తల్లితండ్రుల నివాసం కారాగారం. వ్రేపల్లెలో తరచు పూతనాది రాక్షసుల రాకపోకలు. ఒకనాడు గర్గమహర్షి వచ్చాడు. నందయశోదలు కృష్ణుని బాలారిష్టములను గురించి బెంగ పెట్టుకొని ఆయనకు కృష్ణుని చూపింఛారు.  ఆయన నవ్వుతూ ఈబాలుడు ఎవరనుకొన్నారు? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. సకలదేవతాస్వరూపుడు. విష్ణువే. గోలోక కృష్ణుడు. మీపిల్లవాడు కాదు. దేవకీవసుదేవులబిడ్డడు. మీకు ఆడపిల్ల జన్మించినది. మీకు తెలియకుండా ఈ మార్పిడి జరిగినది.  ఈయనకు మనము పెట్టే పేరులేదు. కృష్ణుడు అనే పిలవండి. పైగానల్లనివాడు. ఆపేరు సార్థకము. క అంటే బ్రహ్మ. రు అంటే అనంతుడు. ష అంటే శివుడు. ణ అంటే ధర్మము. అ అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు)

శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు.

Image
శ్రీకృష్ణుడు మానినీ చిత్తచోరుడు అంటే ఏమిటి?  చిత్తమంటే మనస్సు అనే అంతఃకరణ. మనసు అంటే ఆలోచనలే.. గోపికలు మొదట్లో "మధురానగరిలో చల్ల నమ్మబోదూ" అని తిరిగేవారు.  ఇప్పుడు పాలూ, పెరుగూ, వెన్నా మరచిపోయారు. అత్తగారు భర్తా, పిల్లలూ ఎవరూ గుర్తులేరు. కొందరు భర్తగా, కొందరు కుమారుడుగా, ఆవులు దూడగా భావించుకున్నారు. ఎవరిఊహ వారిదే. ఎవరికి వారు అతడి సాన్నిహిత్యంలోనే ఉన్నారు. ఇదే యోగం. పతంజలి మాటలలో "చిత్తవృత్తి నిరోధం." గోకులంలో అందరూ మానినులే. అందరి హృదయాలలోనూ కృష్ణుడే. ఈపరిస్థితిలోనే ఒక రాత్రి వారికి రాసక్రీడ అనుభవం జరిగినది. మధ్యలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు. తరువాత వెంటనే గోకులాన్ని వదలి అక్రూరునితో మధుర వెళ్ళిపోయాడు. కాని అందరిహృదయాల్లో చిత్తచోరుడుగా ఉండిపోయాడు. చోరుడు అంటే చిత్తాన్ని పూర్తిగా ఆక్రమించినవాడు.

పొడుపు కథలు

పొడుపు కథలు     1)అడవిలో పుట్టి అడవిలో పెరిగి మాఇంటికొచ్చి తైతక్కలాడింది?                  కవ్వం      2)అమ్మ అంటే దగ్గరకొస్తాయి,నాన్న అంటే దూరం జరుగుతాయి. ఏమిటవి?                   పెదవులు     3)కాసేపటికొకసారి వాటంతట అవే టపటప కొట్టుకుంటాయి.ఏమిటవి?                 కనురెప్పలు     4)గోడమీది బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చేపోయేవారిని వడ్డిస్తుంటుంది.ఏమిటది?                 తేలు     5)పళ్ళున్నా కొరకలేనిది. ఏమిటది?                దువ్వెన     6)నడిచేకొద్దీ తగ్గేది?                దూరం     7)రెండువైపులా చెవులున్నా వినలేనిది?               గంగాళం     8)నీదేకానీ నీకన్నాఇతరులే ఎక్కువ వాడతారు?     ...

మనం తింటున్నఇడ్లీ.

Image
ఇప్పుడు మనం తింటున్నఇడ్లీ, ఒకప్పుడు మన పూర్వులు తిన్న ”ఇడ్డెన” ఒకటే.. తెలుగునాట నాలుగు వ౦దల ఏళ్ళుగా ప్రసిద్ధి పొ౦దిన ఆయుర్వేద గ్రంథం ‘యోగరత్నాకరం’లో ఆనాటి తెలుగువారి ఆహార పదార్థాల వివరాలు కన్పిస్తాయి. దీని గ్ర౦థకర్త ఆ౦ధ్రుడు కావచ్చునని పండితులు నిర్ధారించారు కూడా! ‘ఇండరీ’ అనే ఒక వ౦టక౦ ఇ౦దులో ఉ౦ది. మినప్పప్పు(లేదా పెసర పప్పు)ని రుబ్బి అల్లం, జీలకర్ర కలిపి ఆవిరిమీద ఉడికించినవి ఈ ఇండరీలు. వీటినే ఆవిరికుడుములు లేదా “వాసెనపోలి” పేర్లతో మొన్నమొన్నటిదాకా పిలిచేవారు. అప్పట్లో ఇ౦డరీలని కూడా పిలిచి ఉ౦టారు. ఉప్పుడురవ్వ కలపకుండానే వీటిని తయారు చేసుకున్నారని గమని౦చాలి.

చాయి పది రుపాయలైన చప్పుడు చెయ్యకుండా తాగుతాము ..

Image
చాయి పది రుపాయలైన చప్పుడు చెయ్యకుండా తాగుతాము .. 14 లక్షల ఉద్యోగులని ఆదుకొనే రైల్వే శాఖ 40 రూపాయలు పెంచితే మాత్రం గోల గోల చేస్తాము ..  ధరలు పెంచకుండా మంచి సిగ్నలింగ్ వ్యవస్త కావలి, ఇంకా కొత్త లైన్స్ కావాలి అంటే రైల్వే మాత్రం ఎలా తెస్తుంది స్వామి

శ్రీకృష్ణా యదుభూషణా.

Image
శ్రీకృష్ణా యదుభూషణా. (పోతనామాత్యుడు..) శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ! x

అసలు శ్రీకృష్ణుడు ఎవరు?

Image
అసలు శ్రీకృష్ణుడు ఎవరు? భాగవతం, హరివంశం, మహాభారతం, బ్రహ్మవైవర్తపురాణం చదివితే ఆయన వృత్తాంతం తెలుస్తుంది. దశవతారాలలో ఆయన ఉన్నాడా? లేకపోతే దశావతారాలు ఏమిటి? కృష్ణస్తు భగవాన్ స్వయం - అని వ్యాసుడు ఎందుకు అన్నాడు? జయదేవుని అష్టపదులు చెప్పినది ప్రమాణంకాదు. ఫరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు మాత్రమే విష్ణువు దశావతారాలలోనికి వస్తారు. అవి విష్ణువు అంశలు. కృష్ణావతారం అంటాము కాని అది కృష్ణుడి స్వయం అవతరణ. ఈ కృష్ణుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి?  కృష్ణుడు-విష్ణువు వీరిసంబంధం తెలియాలంటే మత్స్యావతారంనుండి శ్రీరామునివరకూ గల అవతారాలనూ శ్రీకృష్ణుని ప్రత్యేకతనూ పరిశీలించాలి. సృష్టిలో ద్వంద్వాలు ఎప్పుడూ ఉంటాయి. దేవతలను సృష్టించిన పరమేశ్వరుడే, రాక్షసులనీ సృష్టించాడు. పూర్వయుగాలలో రాక్షసులూకూడా తపస్సులుచేసి లోకకంటకులైనప్పుడు, విష్ణువు ఒకొక అవతారంలో ఒకొక బలీయమైన దుష్టశక్తిని పరిమార్చాడు. క్రితము ద్వాపరయుగంనాటికి అటువంటి రాక్షసులు లేరు. రాక్షసత్వం, కౄరత్వం, అధర్మం చాలామందిలో ప్రవేశించింది. కంస, జరాసంధ, శిశుపాలాదులు కృష్ణుని బంధువులే. అజ్ఞానంకూడా అనేకంగా వ్యాపించింది. కృష్ణుని పాత్ర 125 సంవత్సరాల వ్యవహ...

Bhagavatha - Narakasura vadham

Image
  Bhagavatha - Narakasura vadham Indra reports to Krishna about the demon Naraka's atrocities. Naraka had snatched Varuna's (Indra's brother) umbrella, the insignia of sovereignty, and also Aditi's (Indra's mother) ear rings and evicted her from her abode in mount Mandara. Narakasura was the son of mother earth, Bhoodevi. The Lord had conferred a boon on mother earth, that Naraka would not be killed by him without her consent. Krishna, along with Satyabhama, flies on Garuda to Pragjyotishapura, the capital of Narakasura's abode in Pragjyotisha (now Assam). Pragjyotisha was well fortified on all sides, with heavy artillery and mountain ramparts.  The was made inaccessible due to its belts of water, fire and wind, encircled with myriad snares laid by Naraka's associate and follower, the five-headed Mura. Flying with great speed on Garuda, Krishna shatters the ramparts with his mace, Kaumodaki. With his arrows and his discus Sudarshana, he destroys th...

ఆలోచనలు

Image
ఆలోచనలు ఆలొచనల్లో వేడి, వాడి లేకపోతే యువకులైన వ్రుద్దాప్యాన్ని అనుభవించవలసిందే. పుట్తుకతో అందరికీ గొప్ప భావాలు కలగవు. ప్రపంచాన్ని చూసి, మనుషులు పడే బాధలు, పెనుగులాట బతుకును చూసి, ఇదేం జీవితం అనుకుంటే ---- అప్పుడు అన్వేషణ మొదలవుతుంది.

సంస్కృతి

Image
సంస్కృతి ఎవరి రొట్టెను వారే తినడం ప్రకృతి. పక్కవారి రొట్టెను లాక్కుని తినడం వికృతి. మన రొట్టెను కొంత పక్కవారికి తినడానికి ఇస్తే అదే సంస్కృతి. మనకున్నంతలో, మనకున్నదాంట్లో నుంచి కొంతభాగం పక్కవాళ్లతో పంచుకోవడమే మన సంస్కారం, మన సాంప్రదాయం.

హద్దు

Image
హద్దు హద్దు దాటితే ఎవరైనా ఒకటే. ఎలాంటి వారైనా సరే...ఎంతటివారైనా సరే...హద్దుల్లో ఉంటూ జీవితాన్ని గడపాలి. హద్దు మీరితే దానికి తగిన శిక్షను అనుభవించి తీరాల్సిందే. ఇది ఖచ్చితమైన దైవ నిర్ణయం. సత్య ధర్మాలను ఆచరిస్తూ సక్రమార్గంలో నడుచుకున్న వారినే దైవం ఆదరించి ముక్తినిస్తుంది. అలా కానప్పుడు భూమికి భారాన్ని కలిగించే పాపాత్ములుగానే ఏదో ఒక కారణాన్ని చూపి హద్దు మీరిన వారిని నశింపచేస్తుంది దైవం. ఇది అక్షర సత్యం. ధర్మానికి నష్టం కలిగినప్పుడల్లా సంధర్భానికి తగ్గట్టు ఏదో ఒక రూపంలో దైవం అవతరించటం సర్వసాధారణమైన విషయం.

శ్రీ నారాయణ రెడ్డి (సినారే) గారి మీద తనికెళ్ళ భరణి ఛలోక్తులు:

Image
శ్రీ నారాయణ రెడ్డి (సినారే) గారి మీద తనికెళ్ళ భరణి ఛలోక్తులు: సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు, పుప్పొడి అక్షరాలూ.. అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారె తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె ఇంతింతై విశ్వంభర నంత చూసినారె జ్ఞానపీటి పైన జానపదములేసినారె

ఆపద చుట్టుముట్టినప్పుడు దైవానికి మొక్కుతారు.

Image
ఆపద చుట్టుముట్టినప్పుడు దైవానికి మొక్కుతారు. ఏవేవో మొక్కుబడుల రూపంలో దైవనికి ఇవ్వజూపుతారు. బలమైన నమ్మకం ఉండటం మంచిదే కానీ అవసరార్ధం చేసే ప్రార్ధనకున్న విలువ ఏమంత గొప్పది కాదు. ఎవరి శక్తికి సమానమైన శక్తి వేరొకరికి లేదో అతడే భగవంతుడన్నాయి శాస్త్రాలు.

మొదటి సగం తాపీ గానూ, రెండో సగం ఆదుర్దా గానూ నడుస్తుంది "

Image
భీష్మ ' చిత్రాన్ని సమీక్షిస్తూ ముళ్ళపూడి వారు: " మొదటి సగం తాపీ గానూ, రెండో సగం ఆదుర్దా గానూ నడుస్తుంది " అని రాసారు. ఇలా రాయడానికి కారణం ' మాయాబజార్ ' చిత్రానికి సంభాషణలు మొదటి సగానికి తాపీ ధర్మారావు గారు, రెండో సగానికి ఆరుద్ర గారు రాసారు. అదీ సంగతి."

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే

Image
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల (F)ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు. అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన...

బియాస్ నది ఘటన

Image
పిల్లల చితికి నిప్పు పెట్టడమే తండ్రి కి గుండె కోత.. అసలు పిల్లలే కనిపించకుండా పోతే  అదీ ఎంతో ప్రయత్నం తరువాత కూడా అంటే  ఆ తల్లిదండ్రుల మానిసికి స్థితి మరీ ఘోరం.,.. ........బియాస్ నది ఘటన

'గురజాడ అడుగుజాడ.'

Image
మహాకవి గురజాడ అప్పారావు నూట యాభయ్యో జయంతి (2012) సందర్భంగా రచయిత్రి ఓల్గా వెలువరించిన సాహిత్య వ్యాసాల సంకలనం 'గురజాడ అడుగుజాడ.' గురజాడ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది 'కన్యాశుల్కం' నాటకం. ఒక్కమాటలో చెప్పాలతో గురజాడ మిగిలిన సాహిత్యం అంతా ఒక ఎత్తు, 'కన్యాశుల్కం' నాటకం ఒక్కటీ ఒక ఎత్తు. అర్ధం చేసుకోగలిగిన వారికి అర్ధం చేసుకోగలిగినంత. సమకాలీనం కాదనో, మరొకటనో పక్కన పెట్టేవారితో ఎలాగో ఏ పేచీ లేనే లేదు.  అత్యంత సహజంగానే ఓల్గా తన వ్యాసాల్లో కూడా 'కన్యాశుల్కం' కి పెద్ద పీట వేశారు. మొత్తం తొమ్మిది వ్యాసాలున్న ఈ సంకలనంలో ఆరు వ్యాసాలు 'కన్యాశుల్కం' నాటకాన్ని గురించీ, అందులోని పాత్రలని గురించీ ఉన్నాయి. 'మధురవాణి' అభిమానులకి మనసు నిండిపోయే వ్యాసం 'మానవత్వం పరిమళించే మధురవాణి' ఈ సంకలనంలో మొదటి వ్యాసం. "కన్యాశుల్కం ఆచారానికి బలైపోయిన బుచ్చెమ్మనూ, బలి కాబోతున్న సుబ్బినీ, వేశ్య అయిన మధురవాణి రక్షించడమే కన్యాశుల్క నాటక సారాంశం. అణచివేతకి గురైన స్త్రీలు ఒకరికొకరు తోడైతే ఆ అణచివేత నుండి బయటపడగలరనే ఆశను కల్పించింది మధురవాణి" అంటారు ఓల...

అల వైకుంఠ పురంబులో

Image
పోతన తెలుగు భాగవతం నుండి. అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహి పాహి యనఁ గుయ్యాలించి సంరంభి యై. కష్టాలలో చిక్కుకున్న వారిని రక్షించే విష్ణుమూర్తి ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ వారి అంతఃపురం ఉంది. దాని పక్కనే ఉన్న మేడ సమీపంలోని అమృతపు జలాల సరస్సు దగ్గర చంద్రకాంత శిలపై పరచిన కలువ పూల పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. ఒళ్ళు తెలియని భయంతో కాపాడు కాపాడు అని మొరపెట్టుకోటం ఆలకించాడు. x

మహావీరుడు కానీ మహనీయుడు కాడు..

Image
కర్ణుడు. మహావీరుడు కానీ మహనీయుడు కాడు.. (Vanam Venkata Varaprasadarao) ' యదిహాస్తి తత్ అన్యత్ర యన్నేహాస్తి న తత్ర క్వచిత్' అన్న మహాభారత /ఇతిహాస కథనము గురించి ప్రస్తావిస్తూ మహాభారతంలోని ప్రతి పాత్రకు ఈ ట్రాజిక్ ఫ్లా ఉన్నది. ఎన్నో మంచి గుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం ఆ పాత్రను, ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది అని మానవ చరిత్ర మనకు చెప్తున్నది, ఒక అసూయ అనే గుణాన్ని తీసేస్తే దుర్యోధనుడు ధర్మరజుకంటే , భీముడికంటే ఏమీ తీసిపోడు, అదే గుణం కర్ణుడిలో లేకుంటే అర్జునునికన్నా ఏమీ తీసిపోడు ఎందులోనూ, ఒక్క పరస్త్రీ వ్యామోహం లేకుంటే వీడి ముందు ఎవడూ సరిపోదు అని సాక్షాత్తో ఆంజనేయుడే రావణుడి గురించి అన్నాడు అని నేను అంటే మా క్లాస్ మేట్స్ ఒకటే చప్పట్లు! యిది స్వోత్కర్ష కోసం కాదు, ఆ అంశం భారతీయులకు, వాల్మీకికి, వ్యాసులవారికి కొత్త విషయము కాదు అని చెప్పడం కోసమే అప్పుడు నా భావాలను చెప్పింది, ఇప్పుడు మిత్రులకు చెప్తున్నది కూడా. దుర్యోధనునికోసం తన సర్వస్వాన్ని అర్పించిన కర్ణుడికి తను చేతున్న దానముల ఫలితం దుర్యోధనునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది అని తెలిసీ ఆ దానాలు చెయ్యడం దుర్యోధనుడిని వంచించడం, తానూ ఆత్...

"పుష్పవిలాసం" ....

Image
నలవైఆరేళ్ళక్రిందట్నే అంటే అరవై ఎనిమిదిలో చంద్రాభొట్ల సత్యనారాయణమూర్తి గారు ఒక పద్యరచయిత గారు "పుష్పవిలాసం" అనే పేరుతో ముప్ఫైనాలుగు పద్యాల ఖండికనొకదాన్ని వ్రాసినారు.ఈరోజు వారు స్వయంగా సభలో చదివి వినిపించినారు. ఎంతోఅందమైన ఛందోబద్ధమైన పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాప పద్యాలకు దీటైన పద్యాలలో పువ్వులను కోయవద్దని తరుణులకు తను చెప్పబోగా ఒక చిన్ని పువ్వు కోయకుండా మా బ్రతుకులను నిరర్థకం చేయవద్దని నిష్ఠురమాడినట్టు (జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అభిమాని వీరు, మాటమాటకు వారి ని తలచుకుంటూనే పద్యపఠన గావించినారు గాని ఇది నా వాదన అంటూ ) వ్రాసినారు. "హరి చరణాలనో , తరుణుల శిరో భూషణాలుగా కాక తొడిమనుంచి సోలి, రాలి మాతృగర్భంలో మేము సమాధికావలెనా? మీ కవితాసౌరభాలు రసజ్ఞులను అలరించాలని మీరు కోరినట్టే మా పరిమళాలు జగత్తును అలరించాలని మేము కోరరాదా? నానాగుణవర్ణాదులలో కదంబమాలగా మేము అందగించినట్టు నానాగుణవర్ణాదులున్న మానవజాతి ఐకమత్యమనే సూత్రంలో అందం చేకూర్చాలని మా మౌనసందేశం కోసి మాలగా కడితేనే కదా! గుచ్చినా, సూదులు గుచ్చినా మా ముక్తి కొరకే అయితే తప్పేముంది.మీ వైద్యులు శస్త్రచికిత్సలో మిమ్మల్ని బా...

'సంజీవి పర్వతం'

Image
మనమంతా 'సంజీవి పర్వతం' అని వాడే సంస్కృత నామానికి అన్నమయ్య గారు "మందుల కొండ" అనే అందమైన తెలుగు రూపాన్నిచ్చారు. ఇలాంటివి తెలిసినవారు ఇక్కడ ఉంచితే అందరికీ తెలుస్తాయి కదా!

మన మన్యం....

Image
మన మన్యం....

ఆ పెద్ద డాక్టరుగారి పేరే సూర్యభగవానుడు.

Image
మనందరం అజ్ఞానమనే పెద్ద జబ్బుతో బాధపడుతున్నాం. దానికి చికిత్స కావాలి.  ఆ చికిత్స ఇచ్చే శాస్త్రం కూడా భారతదేశంలోనే లభిస్తున్నది. అదిగానీ లభించిందా పెద్ద జబ్బు పోతుందిట.  ఏం జబ్బు అంటే పుట్టడం, చావడం అనే సంసారపు జబ్బు పోతుంది. అది జబ్బు అనే మనకు అనిపించడం లేదు. అదే అసలైన జబ్బు అని ఆరోగ్యం బాగుపడే యోగం వున్నవాడు మాత్రమే పోల్చుకోగలడు. వాడు మాత్రమే చికిత్సా పద్ధతి చూస్తాడు. అందుకు పెద్ద జబ్బు ఏదంటే సంసారం పెద్దజబ్బు. దీనికో పేరుంది భవరోగం. భవరోగం అంటే పుట్టడం, చావడం ఒక జబ్బుట. చావడంతో పోదుట. తర్వాత మరొకటి మొదలవుతుంది.  "చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిం" - అదో పెద్ద జబ్బు. కనుక జబ్బులు మళ్ళీ ఇప్పుడు మూడు రకాలైపోయాయి. మానసిక జబ్బులు, శారీరక జబ్బులు, అజ్ఞానపు జబ్బులు. ఈ మూడు జబ్బులూ పోగొట్టుకోవడానికి  ఎవడైనా ఒక్క డాక్టర్ వుంటే చెప్పండి! ఆ పెద్ద డాక్టరుగారి పేరే సూర్యభగవానుడు. Bramhasri Samavedam Shanmukha Sarma

స్వభాష- శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు.

Image
స్వభాష- శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి  జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. --  మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా?  కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ...  అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే.  ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా?  ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. ..  తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము.

విరటుని వాత్సల్యం.

Image
విరటుని వాత్సల్యం........కామేశ్వర రావు భైరవభట్ల గారు. ."ఆడపిల్ల తండ్రులకు మాత్రమే యిలాంటి ఆనందం దక్కేది. లోకాలకు ఏలికైనా కలగని ఆనందమది!" . తిగిచి కవుంగిలించి జగతీవిభు డక్కమలాయతాక్షి నె మ్మొగము మొగంబునం గదియ మోపు; గరాంగుళులన్ గపోల మిం పుగ బుడుకుం; బొరింబొరి నపూర్వ విలోకన మాచరించు గ ప్పగు మృదుమౌళి నుజ్జ్వలనఖాంకురచేష్ట యొనర్చు నర్మిలిన్. . తిగిచి - దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా కౌగిలించుకొని, అందమైన ఆ మొహానికి తన మొహం దగ్గర జేసి, చేతివేళ్ళతో బుగ్గలు పుణికి, మాటిమాటికీ తన కూతురిని అపురూపంగా చూస్తూ, ఆ అమ్మాయి నల్లని లేలేత ముంగురులను ప్రేమతో సవరించాడట. .తిక్కన గారు వర్ణించిన పితృవాత్సల్యానికి నేను కూడా ముగ్ధుడ నయ్యాను. పిల్లలు అతి త్వరగా పెద్దయిపోతారు.తర్వాత ముద్దు చేస్తామన్నా దగ్గఱికి రారు. ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి. .

గోపికా వస్త్రాపహరణము

Image
భాగవతము -- పోతన - గోపికా వస్త్రాపహరణము ఇంతుల్ తోయము లాడుచుండ మగవారేతెంతురే వచ్చిరా ఇంతల్ సేయుదురే కృపారహితు లై యేలోకమం దైన నీ వింతల్ నీతల బుట్టె గాక మరి యేవీ కృష్ణ యో చెల్లా నీ చెంతన్ దాసుల మై చరించెదము మాచేలంబు లిప్పింపవే ! ఒయీ కొంటేవాడా ! ఆడువారు నదీ స్నానము చేయుచుండగా మగవారు వత్తురా ? ఇంత అల్లరి చేయుదురా ? ఈ వింత ఆలోచన నికే గలిగినది కృష్ణా ! నీకు దాసులమై ఉందుము మా వలువలు మా కిమ్ము. వచ్చెదము నీవు పిలిచిన నిచ్చెద మేమైనగాని యెటు చొరమనినన్ జోచ్చేదము నేడు వస్త్రము  లిచ్చి మముం గరుణతోడ నేలుము కృష్ణా ! కృష్ణా నీవు రమ్మనిన వచ్చెదము. నివదిగినది ఇచ్చెదము. అక్కడికిపోమ్మనిన అక్కడికి పోయెదము. మా వస్త్రములు మాకిచ్చి కరుణించ వయ్యా ! నగ్నముగా నదీ స్నానము దోషమని, వ్రతభంగమగునని, అందుకు పరిహారముగా ఆ కన్యలందరూ బయటకు వచ్చి తనకు మ్రొక్క మనెను.

అన్నమయ్య...

Image
అన్నమయ్య... నాటికి నాడుకొత్త నేటికి నేడు గొత్త నాటకపు దైవమవు నమో నమో సిరుల రుక్మాంగదు చేతి కత్తిధారఁ దొల్లి వరుస ధర్మాంగదుపై వనమాలాయ హరి నీకృప కలిమినట్లనే అరులచే కరిఖడ్గధార నాకు కలువదండాయ మునుప హరిశ్చంద్ర మొనకత్తిధారఁ దొల్లి పొనిగి చంద్రమతికిఁ బూవుదండాయ వనజాక్ష నీకృపను వరశత్రులెత్తినట్టి -  ఘన కడ్గధార నాకుఁ గస్తూరివాటాయ చలపట్టి కరిరాజు శరణంటే విచ్చేసి కలుషముఁ బెడఁబాపి కాచినట్టు అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియుఁ బాపి యిల నన్నుఁ గాచినది యెన్నఁ గతలాయ

కృష్ణుడు రోహిణిలో పుట్టాడు...

Image
కృష్ణుడు రోహిణిలో పుట్టాడు కాబట్టి అప్పటినుంచి మేనమామకి గండమ్ అని వచ్చిందంటారు.  రోహిణిలో పుట్టినందుకు కృష్ణుడు కంసుని చంపలేదు. దాడి దుశ్చర్యలని దునుముటకే చంపాడు.  జ్యోతిశ్శాస్త్రమ్ గొప్పదనాన్ని ఇలాంటి తెలివితక్కువ ఓవర్ లోడ్స్ తో కించపరచకూడదు. దానివల్ల జాతి గొప్ప శాస్త్ర విజ్ఞానాన్ని కోల్పోయే అవకాశాలు మెండు.  పైగా దానికి నాస్తిక గోల తోడై మరింత చికాకు.. మా ఆవిడది ఆశ్లేష. మాకు పెళ్ళై 34 ఏళ్ళు నిండబోతున్నాయి. మా అమ్మ ఇంకా నిక్షేపంగా వున్నారు.. పోలేదు. ఆవిడ వేరే ఎక్కడైనా వున్నారేమో అనే పాయింటు లాగేవారికి తెలియజేయునదేమనగా మేమంతా ఒకే గూటి పక్షులం. అదండి. సంగతి. అన్నట్లు మా బాబాయి ఒకాయన మఖ. ఆయన పెళ్ళి నా కళ్ళ ముందే జరిగింది. అంటే నేను చిన్నపిల్లవాడిననుకోండి. వాళ్ళ మామగారు (అంటే మా అమ్మని గన్న తండ్రి) నిక్షేపంలా ఓ ఎనభై పైచిలుకు బ్రతికేసి మరీ బాల్చీ తన్నారు. రోగాలు నిల్. ఈ విశాఖ కాండిడేట్ నాకు మా కుటుంబం ఎగ్జామ్పుల్ దొరకలేదు.... అదీ విషయం. ఈ కధలోని నీతిః మన నూకలు మన రేషన్ కి వేరేవారితో సంబంధంలేదు. ఎవడి సంచి(తమ్) వాడిదే

నన్నయ్యగారి గడుసుదనం..

Image
నన్నయ్యగారి గడుసుదనం.. సుతుల విద్యాప్రవీణత జూచు వేడ్క నెంతయును సంతసంబున గుంతిదేవి రాజు సన్నిధి, గాంధారరాజపుత్రి కెలన నుండె, నున్మీలితనలిననేత్ర ఇదీ పద్యం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? తన కొడుకుల విద్యాప్రావీణ్యాన్ని చూడాలన్న కోరికతో, చాలా సంతోషంగా, ధృతరాష్ట్రుని సన్నిధిలో గాంధారీదేవి పక్కనే కుంతి కూర్చుని ఉంది. ఇంతే దీని అర్థం!  "కెలన నుండె" అన్న దగ్గర యీ అర్థం పూర్తయిపోయింది. కానీ పద్యం పూర్తి కాలేదు! చివరన "ఉన్మీలితనలిననేత్ర" అని ఒక పదాన్ని వేసారు నన్నయ్యగారు. "లోనారసి" చూడలేని విమర్శకులు, "ఆఁ, ఇది వట్టి పాదపూరణ కోసం వేసిన పదం" అని తోసిపారేస్తారు. కాని అసలు మందుగుండంతా యీ ఒక్క పదంలోనే ఉంది! "ఉన్మీలిత-నలిన-నేత్ర" అంటే "బాగా విచ్చుకున్న తామరపూవుల్లాంటి కళ్ళు ఉన్నది" అని అర్థం. కుంతీదేవికి నన్నయ్యగారు వేసిన విశేషణం ఇది.  బాగానే ఉంది కాని యిందులో గడుసుదనం ఏముంది, అనుకుంటున్నారా? పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. ఈ పద్యంలో ఎవరెవరున్నారు? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. ధృతరాష్ట్రుడేమో పుట్టుగుడ్డి. గాంధారి కళ్ళకు గం...

అమ్మభాషలోనే అసలు ఏడుపు

Image
అమ్మభాషలోనే అసలు ఏడుపు బిడ్డపుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. తల్లి కడుపులో ఉన్నంత కాలం తల్లి మాట్లాడుతుండగా వింటూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరించే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు.  భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదనం మాతృభాషలోనే ఉంటుందని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొందుతుందని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే మన నమ్మక౦  వమ్ము అయ్యి౦ది.             ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంఛి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారనేది ఈ తాజా పరిశోధనా సారాంశం. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడి౦చే ప్రయత్నం(ability to actively produce language) అనేది పుట్టిన క్షణ౦ను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్థ౦ అవుతో౦ది. తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ “యాస” అనే మాటని “భాషలోని లయ(rhythm)” అనే అర్థ౦లో వాడటం జరిగి౦ది. తమిళ౦,ఆ౦గ్ల౦, త...

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?

Image
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు -- దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షము నుండి నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు? కలవిహంగమ పక్షముల దేలియాడి తారకా మణులలో తారనై మెరసి మాయ మయ్యెదను నా మధురగానమున! నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? మొయిలు దోనెలలోన పయనం బొనర్చి మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి పొడుచు చిన్కునై పడిపోదు నిలకు నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాల నాడి దిగిరాను దిగిరాను దివినుండి భువికి నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? శీకరంబులతోడ చిరుమీలతోడ నవమౌక్తికములతో నాట్యమ్ము లాడి జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? పరువెత్తి పరువెత్తి పవనునితోడ తరుశాఖ దూరి పత్రములను జేరి ప్రణయ రహస్యాలు పల్కుచు నుందు; నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? అలరుపడంతి జక్కిలిగింత వెట్టి విరిచేడె పులకింప సరసను బాడి మరియొక్క ననతోడ మంతనం బాడి వేరొక్క సుమకాంత వ్రీడ బో గొట్టి క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు పూవు పూవునకును పోవుచునుందు; నవ్విపోదురు గాక నా క...

నా పేరు బుడుగు

Image
నమస్తే, నా పేరు బుడుగు. నేను మా నాన్నకు పిడుగు. తనేమో నాకు గొడుగు. కావాలంటే మా బాబాయిని అడుగు. హదేంటి, బుడుగు మళ్ళీ వచ్చేశాడు అని హాశ్చర్య పోయారా? హాశ్చర్యమెందుకు, నేనెక్కడికన్నా వెళ్తే కద? నేను, రాధ, గోపాళం, బాబాయి, సుబ్బలష్మి, బామ్మ, సీ గానా పెసూనాంబ, మా వీధి చివర జెట్కా వాడు, ఎక్కడికీ పోమట. ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లోనే ఉండి పోతామట. ఇలా అని ఈ మధ్య చాలా మంది చెప్పారు. చాలా మంది అంటే ఫది మంది కంటే ఎక్కువ మంది లే. ఆ సంగతి నాకెలా తెలుసు అంటారా? ఇదిగో, మొన్నే బిళ్ళలు కొనుక్కుని వస్తూంటే, మా ఊరి స్కూలు ముందు ఒక పెద్ద సబ జరుగుతూంది. సబ అంటే బోలెడు చాల మంది కలవడం. అందులొ కుంచెం మంది స్టేజు ఎక్కి మాట్లాడుతారు. ఎక్కువ మంది కింద నిల్చోనో, కూర్చోనో వింటారు. ఒక్కో సారి ఈ వినాల్సిన జనం గాఠిగా అరిచేస్తూంటారు. దీన్నే నినాదాలు చేయడం అంటారు. అంటే నాకు తెలీదు. నేను ఎప్పుడన్నా నినాదాలు చేస్తే మాత్రం గోపాళం ఖోప్పడేస్తాడు, “ఒరేయి బుడుగు అలా అరవద్దన్నానా, వెధవ కానా,” అని. నన్ను చూడగానే స్టేజ్ మీద నుంచి ఒక నలుగురు దూకి వచ్చేశారు. బిళ్ళలు లాక్కోవడానికేమో అనుకుని పక్క సందులోంచి పారిపోదామన...

పాకీపిల్ల....

Image
పాకీపిల్లవటంచు నిన్ను నిరసింపo జూతురమ్మా;స్వయం పాక స్వాములు కొంతమంది, ఇది యే పాపంబో;మూన్నాళ్ళల్లో నే కన్నుల్ తలకెక్కి వెనక గన రీ నిర్భాగ్య దామోదరుల్ పాకీ దే గద మాకు మా జనని బాల్యమ్మందు సంజీవనీ; ''పాకీ దానిగ'' నాడి పోసుకొను ఈ పాపిష్టి లోకమ్ము నీ ''బాకీ '' తీర్చుకోనగలేదు జగదంబా;జన్మ జన్మాలకున్ (కరుణశ్రీ గారి రచన నుండి.)

అరుదైన పద్యాలు (అంతర్జాల సేకరణ)

Image
అరుదైన పద్యాలు (అంతర్జాల సేకరణ) ఒకతెకు జగములు వణకున్; అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్; ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా; పట్టపగలె చుక్కలు రాలున్ భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా ప్రమాదకరమని లేదా చాలా శక్తివంతురాలని భావము. కవితా కన్య రసజ్ఞత కవి కన్నా రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు; నవ కోమలాంగి సురతము భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును? భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది. పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం; అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా వస్తుంది. నక్కలు బొక్కలు వెదకున్; నక్కరతో యూర పంది యగడిత వెదకున్...