నిజమే ... చరిత్ర రాసే పుటలు ని చింపలేం, మార్చలేం .

Lakshminarayana Murthy Ganti..

నిజమే ... చరిత్ర రాసే పుటలు ని చింపలేం, మార్చలేం ..

చరిత్ర ని అంగీకరించాలి ..

ఏదో తెలియని బాధ.మనం మొదటినుంచి హైదరాబాదు మనరాజధాని.మన ఊరు అని అక్కడే మప్పైఏళ్ళు వున్నాం.మొదటినుండి తెలంగాణవారు వారి తెలగాణ పరిధిని దాటెరుగురు.ప్రభుత్వోద్యోగులు కూడా Transfer లో వెళ్లవలసి వస్తే వారు తెలంగాణ దాటివెళ్ళలేదు.మన ప్రబుద్దులుమాత్రం ఆంధ్రోళ్లని తెలంగాణకు Transfer చేసి వారికి సేవలందిస్తే ఇప్పుడు మీరేం చేసారని చాలా మంది అడుగుతున్నారు.ఇది తాతక్కాలికమైన రాజధాని అని ఎన్నడూ మనప్రజలకు చెప్పలేదు ఆంధ్రనాయకులు.తూర్పగోదావరి నుండి వెళ్ళినవారు అక్కడే యుండి కులసంఘాలనుకూడా ఏర్పరచుకొన్నారు. పెట్టుబడులకు ఇది స్థలంకాదని కూడా చెప్పలేదు.సాతవాహనులకాలంనుండి విశాల భారతభూమిని ఏలిన ఎన్నో ఆంధ్రరాజవంశాలు ఏదో ఒక పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఏలేయి.అప్పటినుండి మొన్నటి మద్రాసు ప్రెసిడెన్సీవరకు ఎన్నోభాషలవారు,జాతులవారు ఐకమత్యంతో జీవించేరు.భాషా ప్రయుక్తరాష్ట్రాలవలన ఏర్పడిన రాష్ట్రాలు భాషతో ప్రజలను ఏకతాటిమీదకి తీసుకువస్తే మళ్ళా వాళ్లు విడిపోవడం ఎప్పటికప్పుడు రాజధానిని వెతుక్కోవడం నాకు చాలా భాధగాయుంది.ఈ విషయంలో 1941లోశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారికి మద్రాసులోజరిగిన సన్మానాకి ప్రత్యేక సంచిక వేసేరు.అందులో అనిశెట్టిగారు వేసిన కార్టూను మన దుస్థితిని ఆనాడే చూపించాడాయన.ఇదిగో చూడండడి..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!