నిన్న పున్నమి నాతో మాట్లాడింది

బహుదూరపు బాటసారి గారి కవిత.

.

నిన్న పున్నమి నాతో మాట్లాడింది

వెన్నెల నా చుట్టూ అల్లుకుని ఎన్నో అల్లి బిల్లి ఊసులు చెప్పిందంటే

ఎవ్వరూ నమ్మలేదు సరికదా

పైగా పగలబడి నవ్వుతున్నారు

మా అందరికీ అమవాస నీ ఒక్కడికి పున్నమాఅని

నమ్మలేక నేమాని వారి పంచాంగం తిరగేస్తే కాని తెలియలేదు

ఈ కన్యారాసి చిన్నది

నిన్న రాత్రి ఆరుబయట వరండాలో అలసి

చల్లగాలికోసం ఓ రెండుజాములు కునుకు తీసిందట

వినీలాకాసమంతా పండు వెన్నెల విరబూస్తుంటే నిజంగా పున్నమే అనుకున్నా \

ఇలా అయితే వచ్చే పున్నమి వస్తుందా

నువ్వున్నావని సిగ్గుపడి చల్లగా జారుకుంటుందో....@ బాటసారి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!