Posts

Showing posts from March, 2015

శ్రీ ఆంజనేయ స్తుతి

Image
ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు.! . శ్రీ ఆంజనేయ స్తుతి .  గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్. రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్. అంజనా నందనం వీరం జానకి శోక నాశనం ,  కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్ మనో జవం , మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం ,  వాతాత్మజం వానర యుధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసా నమామి ఆంజనేయ మతిఁపాటలాననం , కాంచనాద్రికమనీయ విగ్రహం ,  పారిజాత తరు మూల వాసినం , భావయామి పవమాన వన్దనం. యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.  బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్. బుధిర్బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం ఆరోగత  అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్  ఇతి ఆంజనేయ స్తుతి

భారత ధాత్రికి వందనం.

Image
బంగరు పూవులు పూచే తల్లికి భారత ధాత్రికి వందనం సింగారములు చెలువము చిలికే శీలవతికి మా వందనం జీవనదులతో సిరులొలికించే చిర యశస్వినికి వందనం పావన ఋక్కులు భవ్య కావ్యములు పలికిన మాతకు వందనం హిమవదాది సుమహీధరాల విలసిల్లిన మాతకు వందనం అమర ఋషీంద్రుల విమల వాక్కులు అలరిన మాతకు వందనం సామగానముల జోలలు పాడుచు సాకెడు తల్లికి వందనం సత సహస్ర నర నారీసంస్తుత చరణ పంకజకు వందనం దివ్య శిల్పులను దివ్య గాయకుల తీర్చిన జననికి వందనం దేశదేశముల కాదర్శమ్ముల తెలిపిన మాతకు వందనం

Ganesh Prayer BySri .K.Sai Prasad..Grand sonof Dr.K V Rao(1920-2002.)

Image

సన్నయి నొక్కులు నొక్కుతో ...అలనాటి సూర్యకాంతం అంటే మందర .!

Image
సన్నయి నొక్కులు నొక్కుతో ...అలనాటి సూర్యకాంతం అంటే మందర .!

సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది?

Image
సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు?   రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే….. అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అన్నారు. అంటే….  అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.   ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నద...

సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట.! . సావిత్రి ని ఆట పట్టించటానికి ఆమెను గిత్త తో పోల్చి ఆడుకున్న హాస్య పు పాట. ఆ పొగరు బోతు పొట్ల గిత్త కన్నూ ,మిన్నూ కాన రానిదట .పట్టుకుంటే మాసి పోయే పారు పళ్ళ గిత్త .అటు సావిత్రికి ఇటు గిత్తకూ సరి పోయే మాటల్ని చక్కగా పొదిగారు కొసరాజు .ఆమె పళ్ళను పార పళ్ళు అంటం ఎద్దేవాచేయటమే .ఎద్దు పళ్ళు కూడా పార పళ్ళు లానే ఉంటాయి . .ఆ గిత్త రూపమే బంగారం అవుతుందట .మీదకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుందిట .వెనక్కి వెళ్తే యెగిరి కాలు ఝాడిస్తుంది .విసురు కొంటు కసరుకొంటు అటూ ఇటూ ఇటూ అటూ గుప్పిళ్ళు పెడుతుంది ,కుప్పిగంతు లేస్తుంది ఆ గిత్తా ,ఆ అమ్మడు సావిత్రి కూడా .ఇద్దరి స్వభావాలు ఒకటే . అంతేనా –అదిలిస్తే రంకె వేసి బెదిరే గిత్త.కదిలిస్తే గంతులేసి కాండ్రు మనే గిత్త .దాని నడుము తీరు చూస్తె నవ్వు పుట్టుకొస్తుంది .మరి దాని నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తుంది .ఇంతకు మించి వన్నె చిన్నెల రాణి ఆటా అది .మంచి బోణీ ఇవ్వాలని కోరుకొంటున్నాడు నాయకుడు నాగేశ్వర రావు ,నమ్మిన బంటు .దాన్ని వదిలి పెడితే ఒట్టు అని ఒట్టెసుకొన్నాడు .ఇక దాని వగలను కట్టి బెట్టి లొంగి పొమ్మని అటు గిత్తనూ ఇటు గిత్త లాంటి అమ్మాయి సావిత్రిని హెచ్చ రించాడు . జాన పద సాహిత్యం లో పండిన కొస రాజు రాఘ వయ్య చౌదరి రాసిన పల్లె పదాలతో ఎద్దుల భాష లో ,పల్లె టూరి వాతావరణం లో ,నాయకా నాయిక ల హృదయావిష్కరణ లో తన పై చేయిని చూపిస్తూ నాయకుడు ఆడిన నాటకం .పరవశం కలిగించే పాట ఘంట సాల అమర గానం తో ఈ గీతానికొక మహర్దశ ప్రాప్తించింది ఆ విరుపులు ,ఓంపులూ సొంపులూ ,పరితాపం ,ఆమె పై ప్రేమ ,ఆమె తనది కావాలన్న ఆరాటం అన్నీ ఇందులో కలిసి పోయి హాయి హాయి అని పించాయి కొంటె పాట అయినా కోటి రాగాలున్న పాటఅయింది .కోణంగి పాటైనది.కాలు ఝాడించటం ,గుప్పిళ్ళు పెట్టటం ,కుప్పి గంతులేయటం ,రంకె వేయటం ,కాండ్రు మానటం ,,బోణీ కొట్టటం వంటి పదాలు పల్లె జీవితానికి వేసిన పందిరి . గిత్తలను గంగి రెడ్డు వాళ్ళు బహు చక్కగా ఆడిస్తారు వాడు చెప్పినట్లు అది అన్ని పనులూ చేస్తుంది .వంగి దణ్ణం పెడుతుంది .తలూపి ఆడిస్తుంది తోక ఝాదిస్తుంది .గిట్టల పై గిత్త డాన్సు కూడా చేస్తుంది.అలా తన వశం కావాలని అన్యాపదేశం ఇందులో ఉంది .అందుకే నాకు ఈ గీతం మకరందమయ్యింది .

Image

ఉగాది శుభాకాంక్షలు...

Image
  చిగురాకుల చిరు తొరణాలు, చిరుమావిళ్ళ నిండు కావడులు చీనాంబారాల అలంకరణల శోభిల్లుతున్న సిరుల ప్రసాదించు సురులు చిలకపచ్చ పావడాల పడచులు, చిందులతొ హోరెత్తించు చిన్నారులు చిగురులు తొడిగి పచ్చదనాన పరవసించి మురిపించు ప్రకృతి సొగసులు చేత వాద్యాలు పట్టి యజమానుల మెప్పుగొరవచ్చు గీతగాళ్ళు చిత్రాలంకరణల శోభతొ పురప్రజల దీవించవచ్చు గరగలు షడ్రుచుల సంగమముగ చేయు పత్యేక పచ్చడి నిండిన పాత్రలు అవి వడ్డిస్తూ సకలైశ్వర్యాలు కలుగు జీవితం పొందమని ఆశీర్వదించు మాతృమూర్తులు పంచాంగాలు చెతబట్టి వివరించ వచ్చు విపృలు, శ్రధ్ధగా విను పురప్రజలు లోకకళ్యాణార్ధం సత్ ప్రవచనములు వల్లించు విఙులు, పురోభివృధ్ధికై యోచించు పాలకులు పట్టువస్త్రల ధరించి పిల్లలను ఆశీర్వదించు పెద్దలు, వారి నుండి కానుకలు పొంది మురుయు పసివాళు కొరమీసల రొశాలు చాటుతూ తిరుగు కుర్రవాళ్ళు, కొత్త వస్త్రాలు సొగసుల మురుయు బంధుమితృలు అత్తవారింట అందాలు అలంకరించు కొత్తకోడళ్ళు, బావల ఆటపట్టించు ప్రయత్నాల మునుగు మరదళ్ళు యెన్నొ, యెన్నెన్నొ మధుర స్మృఉతులు మహదానందకారకాలు... మన్మద ఉగాది పండుగ తెలియపరచు నూతనవత్సర ఆనందభరితమవ్వాలని ఆకాం...

రావణ సంహారము:

Image
రావణ సంహారము: అనఘుం డుజ్జ్వల చాప దండమున బ్రహ్మాస్త్రంబు సంధించి యొ య్యనఁ గర్ణాంతముగాఁ గడున్ దివిచి ప్రత్యాలీఢ పాదస్థుడై దనుజాధీశ్వరు బాహుమధ్యము వడిం దాకంగ లక్ష్యంబుగాఁ గొని బిట్టేసె నదల్చి తీవ్రతరమౌ కోపంబు దీపింపగన్. (అనఘుండు = అఘములేనివాడు, పుణ్యాత్ముడైన శ్రీరాముడు; ఉజ్జ్వల చాప దండము = ప్రకాశిస్తున్న ధనుస్సు; కర్ణాంతముగా కడున్ దివిచి = చెవులవరకు వింటినారిసి సారించి; ప్రత్యాలీఢ పాదస్థుడై = శరసంధానము చేయునప్పటి భంగిమ; దనుజాధీశ్వరు = రాక్షసేశ్వరుడైన రావణుని; బాహుమధ్యము = రెండుచేతుల మధ్యన గల నాభిప్రదేశము; వడిన్ = వేగముగా; లక్ష్యంబుగా గొని = గురిచూసి; బిట్టేసె = బాణముతో కొట్టెను; తీవ్రతరమౌ = తీక్షణమైన; దీపింపగన్ = ప్రజ్వలిస్తుండగా) భావము: రాఘవుడు తీవ్రమైన ఆగ్రహం ప్రజ్వలిస్తుండగా, ప్రకాశించే తన కోదండమునందు బ్రహ్మాస్త్రమును ఎక్కుపెట్టి, ప్రత్యాలీఢభంగిమలో నిలబడి, ఆకర్ణాంతము నారి సారించి, దశకంఠుని నాభిప్రదేశమునకు గురిచూసి, వేగముగా వెళ్ళి తాకేటట్లుగా బాణమును వదలినాడు. ఆ వ్రేటు వడిగ నాటిన రావణు డతివివశు డగుచు వ్రాలె ధరిత్రిన్; దేవతతి పొగడి యప్పుడు పూవులవర్షంబు గురిసె భూవర...

గిలిగింత.!

Image
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది. . ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది . పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా....తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా.!

లటుకు...చిటుకు.!

Image
లటుకు...చిటుకు.! . పెళ్ళి చేసి చూడు - ఇల్లు మారి చూడు ."అద్దె పది వేలు".. "అద్భుతం సార్.." "మెయింటెనన్స్ పదమూడు వేలు" నేను ఆయన అసిస్టెంటు వైపు తిరిగి.."ఇదిగో..సార్ మీకేదో చెబుతున్నారు" అన్నాను "నేను చెబుతున్నది నీకే. మెయింటెనన్స్ పదమూడు వేలు." "అంటే మొత్తం ఇరవైమూడు వేలా? అసలు అంత మెయింటెనన్స్ ఎందుకు సార్? రోజూ పరిచారికలు వచ్చి నాకు గులాబి రేకులతో స్నానాలు చేయిస్తారా ఏంటి? మీరు 'ధిక్ ' అన్నా సరే..నేను అంత మెయింటెనన్స్ కట్టను.." అన్నాను "అద్దెకు ఉన్న వారి కోసం ఎన్ని సదుపాయాలు ఏర్పాటు చేసామో తెలుసా?" అని.. "కింద జిం ఉంది" అన్నాడు "అలవాటు లేదు" "విమానం పార్కింగ్ ఉంది" "అవసరం లేదు" "పిల్లలను ఆడించటానికి డేకేర్ సెంటర్ ఉంది.." "నాకు పెళ్ళే కాలీదు.."  "వెరీ గూడ్. ఇక్కడ మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది.." తిరుపతి గంగమ్మ జాతర లో నేర్చుకున్న బూతులన్నీ తిట్టి, అక్కడి నుంచి బయటికొచ్చేసాను.. >>>>>>>...

బుడుగా?

Image
బుడుగా? .. నేను చదివాను. ఓహ్.. హీ ఈజ్ మై ఆల్-టైమ్ ఫేవరెట్. ఐ లవ్ హిమ్!” – సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వదులుకోలేదు. లవ్ – ఎంత తేలిగ్గా పలికేస్తుంది ఆ పదం.  ఎంత అందంగా ధ్వనిస్తుంది. ఎంత బాగా అనిపిస్తుంది. గాల్లో తేలినట్టూ, ఈల వేసినట్టూ. ఏం హాయిలే హలా! x

ఆరుద్ర ఉవాచ,,!

Image
ఆరుద్ర ఉవాచ,,! , అట్టేకాలం నిలిచేది కాదు ఆంధ్రులలో ఐకమత్యం ఇట్టే ఋజువు చేయవచ్చునంటారు ఇందులో సత్యం ఇద్దరు తెలుగువాళ్ళున్నచోట మూడు సంఘాలు విడివిడిగా ఉండాలి వాళ్ళవాళ్ళ రంగాలు ఒకటి సాగుతూ ఉంటే సవ్యంగా ఇంకోటి పుట్టుకు రావాలి నవ్యంగా అధికస్య అధికం ఫలం అందరూ ఎక్కొచ్చు అందలం x

ఒక మనసు ఉన్న కధ.!

Image
ఒక మనసు ఉన్న కధ.! . “ఓ అందమైన భార్యా భర్త ఉంటారు. ఇక్కడ అందం అంటే రూపు రేఖల్ని గురించి కాదు. మనస్సు గురించి.............. మనస్సుల్లో కల్మషం లేనంతవరకూ  ఏ బంధమైనా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ జంటలో భర్తకి ఓ వాచ్ ఉంటుంది.  వాచ్ బావుటుంది కానీ దాని స్ట్రిప్ అంతగా బాగోదు. అతనికెలాగైనా స్ట్రిప్ ని గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని ఆమె అనుకుంటూ ఉంటుంది.  ఐతే ఆమె దగ్గర డబ్బులుండవు. అందమైన కురులు మాత్రమే ఉంటాయి. ఆమె భర్తకి ఆమె కురులంటే భలే ఇష్టం. ఆ కురులకి ఇంకా అందం తెచ్చేట్టు ఉందనిపించేలా ఓ క్లిప్ కనిపిస్తుంది. అతనిదగ్గరా డబ్బులుండవు.  దాంతో చేతికున్న వాచీ అమ్మేసి ఆ క్లిప్పు, ఇంకొన్ని సామాన్లు ఆమెకోసం కొనుక్కుని ఆమెదగ్గరికి వెళ్తాడు. ఓయ్ .. నీకో గిఫ్ట్ తెచ్చానంటాడతను .  నేనూ మీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను అంటుందామె. ఇద్దరూ ఒకేసారి గిఫ్ట్ లు చేతులు మార్చుకుంటారు. ఆమె కురులకోసం అతను వాచీ అమ్మేస్తే, ఆమె అతని వాచీకోసం  ఆమె కురుల్ని అమ్మేసి స్ట్రిప్ కొంటుంది. చివరకి ఇద్దరికీ ఇష్టమైనవి ”

“ రాముడెవ్వానితో రావణు మర్దించె?

Image
ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ. ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు? వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు. . పర వాసు దేవుని పట్నమేది ?  రాజమన్నారుచే రంజిల్లు శరమేది ?  వెలయ నిమ్మ పండు విత్తునేది?  అల రంభ కొప్పులో అలరు పూదండేది?  సభవారి నవ్వించు జాణ యెవడు?  సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది?  శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు?  అన్నిటను జూడ ఐదేసి యక్షరములు  ఈవ లావాల జూచిన నేక విధము  చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి”  లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !” . పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు.  తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్)  మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని,  నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన. ఇక జవాబుల సూచికలు- ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి, ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ). 1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు? 2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి? ...

మనసు లోతుల్లో ఏదో బాధ..

Image
మనసు లోతుల్లో ఏదో బాధ..(అప్పు గారి కవిత.)! మనసు లోతుల్లో ఏదో బాధ  దేని కోసమో వెతుకులాట  ఎవరి కోసమో ప్రాకులాట  కళ్ళ వెంట నీరు నదిలా ప్రవహిస్తుంది  గుండెలోని బాధ చెరువులా ముంచేస్తుంది  ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఇంకేదో దూరమవుతున్నట్టు చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరితనం కమ్ముకుంటుంది నా ఆలోచనలలో నాకంటూ తావు లేకుండా వేరే ప్రపంచంలో విహరిస్తున్నాయి ఎవరికోసం ఈ ఆరాటం  దేనికోసం నామనసు చేస్తున్న ఈ పోరాటం కళ్ళల్లో నీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది గుండెల్లో బాధ గునపమై గుచ్చుకుంటుంది ఎన్నటికి ఆగేను ఆ కన్నీరు ఎప్పటికి తీరేను ఈ హౄదయ పోరు

మాతృదేవోభవ".!

Image
మాతృదేవోభవ".! , మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు . "అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే" . మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం. సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలన...

తప్పనిసరియై కూలికి చిప్పలుగొని పోయినారు స్త్రీలున్ గూడన్.

Image
కం. అప్పుల పాలై పౌరులు తిప్పలు పడినారు, తగిన తిండియు లేమిన్ తప్పనిసరియై కూలికి చిప్పలుగొని పోయినారు స్త్రీలున్ గూడన్. (భీమ శంకరం గారి పద్యం.)

కాకికి కాకీక కాక కాకికి కోక కైకు?

Image
కాకిగోల.! నేను చదువుకునే రోజుల్లో మా తెలుగు మాష్టారు 'కాకి - కోకిల' ల మధ్య కనిపించే సారూప్య, వ్యత్యాసాలని వివరిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పేవారు: కాకః కృష్ణః పికః కృష్ణః  కో బేదః పిక కాకయో:  వసంత కాలే సంప్రాప్తే  కాకః కాకః పికః పికః దీని అర్థం ఏంటంటే : కాకి నల్లగా ఉంటుంది . కోకిల కూడా నల్లగా ఉంటుంది . కానీ వసంత కాలంలో కాకి గొంతు లోని కాఠిన్యం, కోకిల గొంతులోని మాధర్యం సులువుగా గుర్తించ వచ్చు . ఆ రోజుల్లోనే మా స్నేహితులు ఈ క్రింది వాక్యానికి అర్థం చెప్పమనేవారు: కాకికికాకీకకాకకాకికికోకేల ? పై వాక్యాన్ని అర్థవంతంగా విడగొడితే ఈ విధంగా వ్రాయ వచ్చు: కాకికి కాకీక కాక కాకికి కోకేల ? అంటే దీని అర్థం: కాకికి దాని తాలూకు ఈకలే చీరగా (కోక) ఉపయోగ పడినప్పుడు, ఆ కాకికి వేరే చీర (కోక) అవసరం ఏముంది? నేను హైదరాబాదీయుడిని కాబట్టి పై వాక్యానికి కాస్త ఉర్దూ మిలాయించి ఇలా రాసాను: కాకికి కాకీక కాక కాకికి కోక కైకు? 'కైకు' అంటే అర్థం చెప్పక్కర లేదనుకుంటా. ఎలా ఉంది? పోతే, (ఎవరూ అని అడక్కండి) మన పట్టణ వాసులకి కాకుల కలకలారావాల తోటే తెల్లారుతుందని నా అభిప్రాయం . ఎందుకంట...

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.!

Image
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు:-- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.! . ఎప్పుడూ తిట్టే మిత్రుని పాత్రను అడ్డుపెట్టి తన విమర్శకులకు సమాధానం ఇలా ఇస్తారు విశ్వనాథ గారు. నీవు నన్ను తిడుతున్నావంటే అర్థమేమిటంటే నన్ను చదువు తున్నావన్న మాట!  చదవక తప్పదన్న మాట. నీకు తెలియకుండానే నన్ను మెచ్చుకుంటున్నావన్న మాట. అసలు తిట్టడానికీ, మెచ్చుకోవడానికీ పెద్ద భేదం లేదు. రెండూ ఒకటేననుకో.  రూపాయి ఉందనుకో. అక్షరాలవైపు ఒకటీ. బొమ్మ వైపు ఒకటీ. ఎటు తిప్పినా రూపాయే. కొండరేం చేస్తారంటే అర్థరాత్రి వేళ వస్తారు. తలుపు తట్టుతారు. ఎవరు వారు అంటే నేను అంటారు. ఏమి నేను, శ్రాద్ధం నేను . , నేను విష్ణుశర్మని కాదని అర్జీ పెట్టుకున్న వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులు గారు గనుక ఒప్పుకుంటే పంచతంత్రం రాసింది ఈయనేనని ఒప్పుకుంటాము అన్నారు. "'నేను రాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవడమేమిటి? మీలో ప్రతివాడూ ఎవడో ఒకడై ఉంటాడు కదా! వాడు వాడేనని ఇంకొకడు చెప్తే గానీ కాడా ఏమిటి?"'  . "ఎవ్వడూ ఎరగని వాడొకడుంటాడు, వాడి గతి ఏం కావాలి?" .  "వాడి గతి అంతే" .

వావ్.. బుడుగు!”

Image
వావ్.. బుడుగు!” . పరీక్షలకు కావాల్సిన పుస్తకాలేవో దొరక్క, ఎండలో మాడు పేలిపోతుంటే,  నీడకని ఓ కొట్టు దగ్గర ఆగాం. ఇంకా వేడిగాల్పు కొడుతూనే ఉంది.  అందుకని పుస్తకాలను చూసే వంకతో కొట్లోకి దూరాం. కొనే ఉద్దేశ్యం లేదు కాబట్టి , పైపైన పెట్టిన పుస్తకాలే పుణుక్కుంటున్నాను. లోపలికెళ్ళిన నా స్నేహితురాలు, “యు రిమెంబర్ హిమ్?” అనడిగింది. “హు?” అంటూ చూశాను చేతిలో పుస్తకం. . “వావ్.. బుడుగు!” ఆనందాశ్చర్యాలకు చోటు చాలక, కళ్ళు పెద్దవయ్యాయి. ఇంటికొచ్చాను. “చూడు, మన ఇంటికి ఎవరు వచ్చారో?!” అని అమ్మకి చూపించాను. . “నా బంగారు తండ్రే!” అని వాణ్ణి దగ్గరకు తీసుకొని, “ఏ తల్లి కన్న బిడ్డో..” అననబోయి నాలుక్కర్చుకొని నవ్వింది. “వాళ్ళ అమ్మ పేరు రాధ. వాణ్ణీ దేవుడు తీసుకొచ్చి వాళ్ళింట్లో పడేసాడట. నాకన్నీ బస్సులోనే చెప్పేసాడు తెల్సా.. ” – నాతో ఇదో సమస్య, నాకే కొంచెం తెల్సినా లొడలొడా వాగేస్తాను. “వెళ్ళి కాళ్ళు కడుక్కురా.. టిఫిన్ పెడతాను.” “నో.. ఇది చదవటం అయితే గానీ, ఏం తినను.” చదవటం అయింది. పుస్తకం ఎక్కడ పెట్టానో.. .“నీ పుస్తకాలన్నీ అటూ ఇటూ పడేస్తావేం?! చూడు, నేనే సర్దాలా అన్...

కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు.!

Image
.వీడి పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. కావాలిస్తే తెలుగొచ్చిన తెలుగువాణ్ణి అడుగు.! . మాది అమ్మాయిల బడి. నలుగురు వాచ్‍మెన్లు, ఇద్దరు మాష్టర్లూ, ఒక కాంటీన్ వాడు తప్పించి మగపురుగు కూడా కనిపించదు. నేను ఏడో తరగతిలో ఉండగా, ఎలా వచ్చాడో మరి ఒక పిల్లాడు, మా తెలుగు టీచర్ వేలు పట్టుకొని దర్జాగా వచ్చేశాడు. “ఎవరు?”, “ఎవరు?” అన్న గుసగుసల మధ్యలోనే కబుర్లు చెప్పటం మొదలెట్టాడు. “సరసం అంటే నాకు తెలీదనుకో.” అన్నాడు అమాయకంగా. “మనకూ తెలీదుగా!” అన్నారు టీచరు లౌక్యంగా “మాకు తెల్సుగా” అనుకున్నాం కొంటెగా. నవ్వుకున్నాం ముసిముసిగా. పరీక్షలవ్వగానే, అందరికీ బై-బైలు చెప్తూ, బుడుక్కి కూడా చెప్పేయటం అయిపోయింది. ***************

ముళ్ళపూడి వారి సందేహాలు.!

Image
ముళ్ళపూడి వారి సందేహాలు.! . “అరే, నేనెలా మిస్సయాను.”  . ఆడ అప్పారావు లా…. (అప్పీరావు అనాలా?)

"అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే"

Image
సరదాగా కాసేపు.!..... "అయ్యో చేతిలో మైకూ పోయెనో, అయ్యో హాలు ఖాలీ ఆయెనే" . ప్రాంతీయ తెలుగు సాంస్కృతిక సంఘం వారు, పాత సినీపాటల తో ఒక  కార్యక్రమం ఏర్పాటుచేస్తున్నారని తెలుసుకొని దాని గురించి ఆలోచిస్తుంటే,  జ్ఞాపకాల రైలు కదిలింది, రీలు తిరిగింది! "రాజశేఖరా నీ పై మోజు తీర లేదురా, రాజసాన ఏలరా" పాడుతున్నారు  ఒక్కరు. ఆ పాట అయిపోయిందో లేదో కాని, దాన్ని అయిపోనిచ్చేలాగా ఇంకొకరు  అందుకున్నారు "వస్తాడు మా బాబు ఈ రోజు, రానె వస్తాడు నెలరాజు ఈ సారి"  అని పెద్దగా పాడడం వినిపించింది. ఇంకొకాయిన మైకును ఆవేశంగా లాగేసుకొని మొదలుపెట్టాడు "రాయినైనా కాకపోతిని అవ్వారి తలలను తాకగా కోతినైనా కాకపోతిని తోకతో వూరేగగా" మీకసలు సరిగ్గా పాటలు గుర్తుకు రావడంలేదు, నేను పాడతానని ఒకామె  అందుకున్నారు "పాడనా తెలుగు పాట, పరవశమై పరేషాన్ చేయంగ  పాడానా" అంటూ. ఏమిటండీ ఇది, ఇట్లా చెత్తగా పాడుతున్నారు. ఒక్క భక్తి పాటైనా  పాడుకుందాం అని ఒకాయన మొదలుపెట్టాడు "ఎంత మధురం నీ నామం,  ఎంత దివ్యం నీ రూపం, శ్రీనివాసా, వేంకటేశా" అని  బావురుమన్...

రమణ తన రచనాస్త్రాలు .!

Image
రమణ తన రచనాస్త్రాలు .! , కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి, తన స్వార్థం కోసం ఇంకోళ్లను బలి చేయడానికి వెనుకాడని సుబ్బారావు మామగారు (జనతా ఎక్స్‌ప్రెస్‌),  . డొక్కుదైనా సరే ఓ కారు కొనేస్తే గొప్పవాళ్లయిపోతామనుకునే సుందరమ్మ (జనతా ఎక్స్‌ప్రెస్‌), . ఇంట్లో పెళ్లాం పిల్లలు పస్తులున్నారని తెలిసినా చేతిలో ఉన్న ఒక్క రూపాయి హోటల్లో తిండికి ఖర్చు పెట్టేసిన చిరుద్యోగి (మహరాజూ యువరాజూ), .  తిండికి లేకపోయినా సిగరెట్టు కోసం తపించే నిరుద్యోగి (మహరాజూ యువరాజూ) . మామయ్య వాచీ తాకట్టు పెట్టేసి పేకాడేసిన గురునాధం (ఈశ్వరేచ్ఛ) . , సినిమా లోకంలోనే నివసిస్తూ ఇహలోకంలో విఫలమయ్యే యువకుడు (సెరిబ్రల్‌ సినేమియా); . తమ్ముడి కోసం వెతుకుతూ, సినిమా చూడ్డానికి వెళ్లిపోయిన ఎస్కేపిస్టు పగటికలల కుర్రాడు (ఛాయలు)  . వీళ్లందరినీ కాగితాలపై కెక్కించి వాళ్లను వెక్కిరించిన రమణ లక్ష్యం ఏమిటి?  ఆయన నిష్క్రియాత్వాన్ని (ఏమి చెయ్యకుండా చూస్తో ఉరుకొనే తత్వం.)నిరసించాడు . x

రాధమ్మ బాకీ' !

Image
రాధమ్మ బాకీ' ! (రాధా గోపాలం) కథలో అదర్‌సైడ్‌ ఆఫ్‌ ది కాయిన్‌ చూపాడు రమణ గారు.. సాధారణంగా తామే స్త్రీల కోసం ఊహూ తపించి పోయి, ప్రేమించి పెళ్లాడి వాళ్లని  ఉద్ధరించామని అనుకునే పురుషులకు కనువిప్పు కలిగేట్లా, స్త్రీలు కూడా తాము వలచిన వారి కోసంఎలా తపన పడతారో,  ఎన్ని కష్టాలు పడతారో, అయినా పెదవి విప్పి ఎందుకు చెప్పరో రాధా గోపాలం కథలో చక్కగా వర్ణించారు.

చిలిపి ప్రశ్నలు.!

Image
చిలిపి ప్రశ్నలు.! .  కాకి కావు కావుమని ఎందుకు అరుస్తుంది? (నోరుంది కాబట్టి!)  పోపుల డబ్బాను తేలిగ్గా ఉంచాలంటే అందులో ఏం పెట్టాలి? (చిల్లుల)  నీరు ఎప్పుడు తాగగలం?( ద్రవరూపంలో ఉన్నప్పుడు!)  బోరింగు ఎంత కొట్టినా బిందె నిండలేదు ఎందుకని? (బిందె తిరగేసి పెట్టారు కాబట్టి)  ఎదుటి వారు మన మాటలను ఆత్రుతగా వినాలంటే ఏమి చేయాలి? (మాట్లాడాలి!)  ఈగ తేనెలో పడితే ఏమవుతుంది?  (తేనెటీగ అవుతుంది)  మిరపకాయ కొరికితే ఏమవుతుంది? (ముక్కలవుతుంది)  సూర్యాస్తమయం స్పష్టముగా ఏ కాలంలో కనిపిస్తుంది? (సాయంకాలం)  నిఘంటువులో తప్పుగా ఉండే పదం?  (తప్పు అనే పదమే)  ఒంటినిండా రంధ్రాలున్నా నీటిని నింపుకోగలదు, ఏమిటది?  (స్పాంజి)  సూది, దారం అవసరం లేకుండానే ఎవరు కుట్టగలరు? (దోమలు, చీమలు)  తిరగలేని మర?(పడమర)  మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్నముల్లు, పెద్దముల్లు ఎక్కడుంటాయి? (గడియారంలో)  అన్నమాటకు వ్యతిరేకం? (తమ్ముని మాట!)  HOTEL లో టీ ఎక్కడ ఉంటుంది? (O,E ల మధ్య)  పున్నమి న...

బాపు గారి బొమ్మ మనసు.! .

Image
బాపు గారి బొమ్మ మనసు.! . కళ్లలోనే వుండిపోయాడు కానీ గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.!

ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన.....(

Image
ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన.... . . ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు. . శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై క...

పాండురంగ మాహాత్మ్యము!..... ....తెనాలి రామకృష్ణకవీంద్రుడు .!

Image
పాండురంగ మాహాత్మ్యము!..... ....తెనాలి రామకృష్ణకవీంద్రుడు .! . ఈ చిగురాకు నీప్రసవ మీపువుఁ దేనియ యెంత యొప్పెడిన్ జూచితిరే యటంచుఁ దనచుట్టు శుకాదులుఁ గొల్వగాఁ గప ర్థాంచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖ వే దాచల మంత్రికీర్తి కలశాబ్ధిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్. . శివుడు తన కృతిభర్తను పాలించు గాక యన్న యాశీర్వచనము. శివుడు కల్పవృక్షము. శుకమహర్షి మొదలైనవారీ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు. శివుని జుత్తు – జడముడి – చివురాకు. చంద్రుడు పువ్వు. గంగ తేనియ. . ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యానల ప్రౌఢి నీ కెదురేరీ? సరసార్థ బోధఘటనాహేల పరిష్కార శా రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా! . తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణ సముద్రము, ఉత్తరాన హిమాలయ పర్వతం – ఈ నాలుగు ఎల్లల మధ్య గల యావద్భారతదేశంలో మహాంధ్ర కవితా విద్యలో, ఓ రామకృష్ణకవీంద్రా, నీ అంతటి మహాకవి వేరొకరు ఎవరు? ఎవరూ లేరు. సరసమైన అర్థబోధ ఘటించెడి ఒయ్యారపు నగలు గల సరస్వతీ దేవి నీ రూపము! అని విరూరి వేదాద్రి మంత్రి అన్నాడని పాండురంగమాహత్మ్యము అవతారికలో రా...

ఇది ఎక్కడి పోయకాలమో .....

Image
ఇది ఎక్కడి పోయకాలమో ..... మనం కష్టాలు లో ఉంటేనే దేవుడు గుర్తు వస్తాడు. . సా గినంత కాలం మనకంటే అధికులు ఎవరు కనపడరు.!
Image
అరగుండు + అరగుండు = ఎంత?...”గుండు ! ..... (కథ- శ్రీ చంద్రశేఖర్ ఇండ్ల) . “మీరెన్ని చెప్పినా నేనొప్పుకొనేదేలేదు” అని ఖచ్చితంగా చెప్పింది వెంకటమ్మ గుడ్డలమూటమీద బాసిపట్లేసుకొని కూర్చుంటూ. . “నీకే అంతుంటే నీ మొగుడ్ని అందునా మొగోడ్ని నాకెంతుండాలి, నేను మాత్రం ఎందుకొప్పుకుంటాను” ఎదురు ప్రశ్నించాడు యాకోబు కండవని తలకు చుట్టుకుంటూ. . కథ మళ్ళీ మొదటికొచ్చేసరికి కందులూరు గ్రామస్థులందరికి విసుగొచ్చి లేచి ఇంటికి వెళ్ళాలనిపించింది. చూస్తే కరెంట్ లేదు టీవీలు కూడా రావు, ఇంటి దగ్గర పనులేమి లేవనే విషయం గుర్తుకొచ్చి ఊరికే వచ్చే ఆనందాన్ని ఎందుక్కాదనాలని అక్కడే కూర్చుండి పోయారు. . “ఒరేయ్ వెంకటేసు నువ్వే చెప్పరా మీయమ్మ మాట వింటావా ? మీ నాన్న మాట వింటావా?” అన్నాడు అంత అందమైన తగాదా లో నిశ్శబ్దాన్ని భరించలేక తంబారంబావ ( తంబారం అనే వూరి నుంచి కందులూరు కొచ్చిన మొట్ట మొదటి అల్లుడు కాబట్టి అందరు అతన్ని బావ అనే అంటారు). . తను నమ్మేవన్ని నగ్న సత్యాలే అని నమ్మే ఆదాము, నత్తేసేబు, కత్తేసు, చిన్న నవాకు, పెద్ద నవాకు, పేతురు, దేవనందం, కొండయ్య, గోవిందమ్మ, జానూ, ఉలిపిరి నాగేంద్రం మరియు ఆమె ఏడేళ...

ఏం తేడా పడింది?

Image
ఏం తేడా పడింది? . స్వతంత్రం వచ్చిందని తెలిసి ఆబాలగోపాలం తెగ సంబరపడిపోయారు. ‘‘ఇన్నాల్టికి కష్టం ఫలించింది’’ అనుకున్నది బామ్మ. . ఆ మర్నాడు గారెలకి పప్పు నానపోయాల్సి వచ్చింది. ఎటూ స్వతంత్రం వచ్చింది కదా, రాత్రే దేనికి పొద్దున్నే నానపోయచ్చులే అంది బామ్మ. అమ్మకేమీ అర్థం కాలేదు. పొద్దున్నే నానపోస్తే అవి సమయానికి నానలేదు. మరి స్వతంత్రం వచ్చిందన్నారు - ఏమి తేడా పడిందని దీర్ఘాలు తీసింది బామ్మ. . . మూడు వాయలు పప్పు రుబ్బడానికి మూడు గంటలూ పట్టింది. ‘‘స్వతంత్రం వచ్చిందన్నారు కదే’’ అన్ని కళ్లతోనే అడిగింది - ఒక చెయ్యి పొత్రం మీద ఉంచి మరో చేత్తో ఎత్తిపొడుపు ముద్ర పట్టి. అమ్మకేం అర్థం కాలేదు. . ‘‘అమ్మాయ్! నూనె కూడా ముందుకులాగే లాగాయి. ఏమీ తగ్గలేదు. తేడా ఏమిటో...’’ బామ్మ సమస్య ఏమిటో అర్థం అయింది గాని అమ్మకి ఎలా సర్దిచెప్పాలో అర్థం కావడం లేదు. సాయంత్రానికి గారెల బుట్ట ఖాళీ అయింది. మునుపు మూడు రోజులు బుట్ట కళకళలాడుతూ ఉండేది. ఇదేవిటో బుట్టెడు గారెలూ మరు పూటకే మాయం అయినాయంటూ బామ్మ బుగ్గలు నొక్కుకుంటుంటే- ‘‘స్వతంత్రం వచ్చింది కదోచ్’’ అంటూ పిల్లలు అడుగూ బొడుగూ కూడా ఖాళీ చేసి పారిపోయార...

ఆశ.

Image
ఆశ.  . ( మేఘ...కవిత.) ఆకాశమనే ఓ పర్ణశాలను రంగులన్నీ అద్ది ప్రపంచమనే వసుదైక కుటుంబానికి పంచరంగుల అందాలను తోడుగా పంపి చుట్టూరా ఆనందాలు నింపినా అన్నీ ఉన్న మనసుకు తెలీలేని వెలితి జీవితమనే పుస్తకానికి నేనున్నాను అంటూ విడని నీడల్లే వెంటాడే అసంతృప్తి! ఎంతున్నా ఎంతేత్తున్నా కడుపులోకి వెళ్ళేవి నాలుగు వెళ్ళేలని కంటి నిండా కునుకే అని తెలిసి కూడా పడి పడి లేచి పడి వడి వడిగా లేస్తూ పడుతూ ఆపని అంతులేని ఆరాటం వేదనే వెంటాడినా వేరువని జీవితాన్ని ఒకటి చూడాలని నాకుంది కోరికే ఉవ్వెత్తుగా ఎగసినా బోసి నవ్వుల చిన్ని పాపాయి నవ్వుల సంతృప్తి మనసులో నింపుకొని సాగిపోవాలని కోరికుంది స్వార్ధ చింతన, సంకుచితం,ఆవేదన, ఆక్రోశం మనషుల్లో లేకుండా ఉండే ఒక్కనాటి ఆనందం రుచి చూడాలని ఆశైతే నాకుంది x

మనసు లో మాట.!మనసు లో మాట.!

Image
మనసు లో మాట.! . ఈ ప్రపంచంలో ABSOLUTE అన్నది ఏది లేదు.  . ప్రతిదీ RELATIVE కొలమానంలో నిర్దేశింపబడినదే. . నిన్న సరి అనుకున్నది నేడు సరికాకపోవచ్చు. . ఈరోజు ఇక్కడ సరి అనుకున్నది వేరేచోట అది సరి కాదేమో.  . ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతం
Image
మనసు న మనసే ..తోడు ఉండిన .. భాగ్యం మన మహా నటి.! x

అన్నమయ్య జోల పాట.!

Image
అన్నమయ్య జోల పాట.! . జోఅచ్యుతానంద జోజో (రాగం: నవరోజు) (తాళం: ఖండచాపు) జోఅచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద నందు నింటను జేరి నయము మీఱంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ నందముగ వారిండ్ల నాడుచుండంగ మందలకు దొంగ మా ముద్దురంగ పాలవారాశిలో పవళించినావు బాలుగా మునుల కభయమిచ్చినావు మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడై యుండి గోపాలుడైనావు అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే పట్టి కోడలు మూతిపై రాసినాడే అట్టె తినెనని యత్త యడగ విన్నాడే గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి కొల్లలుగా త్రావి కుండలను నేయి చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ చిల్లతనములు సేయ జెల్లునటవోయి రేపల్లె సతులెల్ల గోపంబుతోను గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను మాపుగానే వచ్చి మా మానములను నీపాపడే చెఱిచె నేమందుమమ్మ ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి జగడములు కలిపించి సతిపతులబట్టి పగలు నలుజాములును బాలుడై నట్టి మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార గోవర్ధనం...