చిలిపి ప్రశ్నలు.!

చిలిపి ప్రశ్నలు.!

.

 కాకి కావు కావుమని ఎందుకు అరుస్తుంది?

(నోరుంది కాబట్టి!)

 పోపుల డబ్బాను తేలిగ్గా ఉంచాలంటే అందులో ఏం పెట్టాలి?

(చిల్లుల) 

నీరు ఎప్పుడు తాగగలం?(

ద్రవరూపంలో ఉన్నప్పుడు!)

 బోరింగు ఎంత కొట్టినా బిందె నిండలేదు ఎందుకని?

(బిందె తిరగేసి పెట్టారు కాబట్టి)

 ఎదుటి వారు మన మాటలను ఆత్రుతగా వినాలంటే ఏమి చేయాలి?

(మాట్లాడాలి!) 

ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? 

(తేనెటీగ అవుతుంది) 

మిరపకాయ కొరికితే ఏమవుతుంది?

(ముక్కలవుతుంది) 

సూర్యాస్తమయం స్పష్టముగా ఏ కాలంలో కనిపిస్తుంది?

(సాయంకాలం) 

నిఘంటువులో తప్పుగా ఉండే పదం? 

(తప్పు అనే పదమే) 

ఒంటినిండా రంధ్రాలున్నా నీటిని నింపుకోగలదు, ఏమిటది?

 (స్పాంజి)

 సూది, దారం అవసరం లేకుండానే ఎవరు కుట్టగలరు?

(దోమలు, చీమలు)

 తిరగలేని మర?(పడమర) 

మిట్ట మధ్యాహ్నం అయ్యిందంటే చిన్నముల్లు, పెద్దముల్లు ఎక్కడుంటాయి?

(గడియారంలో) 

అన్నమాటకు వ్యతిరేకం?

(తమ్ముని మాట!)

 HOTEL లో టీ ఎక్కడ ఉంటుంది?

(O,E ల మధ్య)

 పున్నమి నాడు చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తాడు?

(మనం చూస్తాం కాబట్టి)

 జనాలు గుడికెందుకు వెళతారు?

(అవి మన దగ్గరకు రావు కాబట్టి) 

ఒక వ్యక్తి విమానంలో నుంచి ప్యారాచుట్ లేకుండా కిందికి దూకినా ఏమి కాలేదు. ఎలా?(విమానం ల్యాండై ఉంది కాబట్టి) 

వాటర్ లో ఐస్ వేస్తే ఏమవుతుంది?

(ఐస్ వాటర్ అవుతుంది) 

మీ ఒక చేతిలో యాభై మామిడి పండ్లు, మరో చేతిలో యాభై అరటి పండ్లు ఉన్నప్పుడు మీకు ఏమున్నట్టు?

(రెండు పెద్ద చేతులున్నట్టు!) 

దేవుడు లేని మతం ఏది?

(కమతం)

 రాజులు నివసించని కోట ఏది?

(తులసి కోట)

 నోరు లేకపోయినా కరిచేవి, ఏవి?

(చెప్పులు)

 చేయడానికి ఇష్టపడని ధర్మం?

(కాల ధర్మం)

 ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?

(విసన కర్ర)

 ఒక్క డ్రైవర్ తో నడిచే రెండు బస్సులు? 

(డబల్ డక్కర్ బస్సు) 

ఆలోచన లేకుండా చేసే పని ఏది?

 (ఊపిరి పీల్చుకోవడం) 

నిండు నూరేళ్ళు ఎవరు బ్రతుకుతారు? 

(ఆయుష్షు ఉన్నవాళ్ళు) 

గడియారంలో పదమూడు గంటలు కొడితే అది ఏ సమయం? 

(రిపేరు సమయం) 

భారతీయులు శ్రీలంక వాళ్ళకన్నా ఎక్కువ అన్నం తింటారెందుకు? 

(మన జనాభా ఎక్కువ కాబట్టి) 

తిరుపతి లో ఎవరు గుండు కొట్టించుకుంటారు?

 (జుట్టు ఉన్నవాళ్ళు) 

మనకు కలలు ఎందుకు వస్తాయి?

 (కంటాం కాబట్టి) 

భరత్, పాకిస్తాన్ ల మధ్య ఏముంది?

 ('కామా' ఉంది) 

అప్పుడప్పుడు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? 

(నవ్వలేవు కాబట్టి)

 తినగలిగే నగ ?-----------> శనగ 

తినలేని ఫలం ------------------>కర్మ ఫలం 

మానవత్వం ఎక్కడుంటుంది?------------------->తెలుగులో 

ఏనుగులు ఆహారాన్ని ఏ సమయంలో తింటాయి?--------->ఆకలైన సమయంలో 

చప్పట్లకు వ్యతిరేఖం ఏది?---------------------------------->పుల్లట్లు 

ఇస్తానంటే వద్దనని బలి?------------------------------------>అంబలి

 మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి?----------->పెన్నుతో

 అల్లరి నరేష్ కారు నడపాలంటే ముందు ఏమి చేస్తాడు?------->కారు తలుపు తీస్తాడు

. గోడ మీద నుంచి టీవిలో సినిమా చూస్తున్న బల్లిపిల్లని తల్లి ఏమని వారిస్తుంది?

------->సినిమా బాగున్నా చప్పట్లు కొట్టద్దని 

గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు ?--------------------->నుదుటికి

 రెండు మామిడి పళ్ళను ముగ్గురు పంచుకోవచ్చు ఎలాగా ?-------------->రసం తీసి 

ఈ ప్రపంచంలోనే ఉండదు.అయిన మనం వాడతాం.ఏమిటది ?----------->గాడిద గుడ్డు 

డ్రైవర్ లేని బస్ ------------------------------------------------------->సిలబస్

 చలి కాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?-------------------------->కప్పు ఖాళీ అవుతుంది.

 ఒకే గొడుగు కింద నలుగురు వెళ్ళినా, తడవలేదు. ఎందుకు? ----------> వర్షం పడటం లేదు కాబట్టి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!