చాయాదేవి శాపం !
చాయాదేవి శాపం ! శ్రీమతి శారద పోలంరాజు గారికి కృతజ్ఞలతో.) . విశ్వకర్మ కూతురు సంజనకు (సంఙ్ఞ) సూర్యునితో వివాహం జరుగుతుంది. ఆమెకు మొదట మనువు, తరువాత యమ యమున అనే కవలలు జన్మిస్తారు. ఆమె సూర్యుని కాంతి వేడిమి భరించ లేకపోతుంది. ఆమె శరీరము కూడా మసిబారినట్టు అయిపోయి సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఉండే చీకటి రంగులోకి మారిపోవడం చేత దేవతలు ఆమెను సంధ్య అని అన్నారు. బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణాల ప్రకారం......... సంధ్యకు వైవశ్వంతమనువు తరువాత యమున యముడు కవలలుగా జన్మిస్తారు. ఏ విధంగానైనా ఆ వేడిమిని తప్పించుకోవాలనుకున్న సంధ్య తన అంశతో ఛాయ అన్న మరో రూపం సృష్టించి తాను తిరిగి వచ్చే వరకు తన బిడ్డలను చూసుకుంటూ సూర్యుడిని ఏ మాత్రమూ వదలకుండా వెన్నంటి తిరగమని ఆఙ్ఞాపించి తన ముగ్గురు పిల్లలను ఆమెకు అప్పగించి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. ఛాయకు ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. మొదటివాడు శ్రుతశ్రవుడు అతను సావర్ణి మనువుగాను, రెండవవాడు శ్రుతకర్మ శనిగ్రహంగానూ ప్రఖ్యాతి చెందుతారు. సంధ్యముగ్గురు పిల్లలని సరిగ్గా చూడక ఛాయ సవతి బుద్ది చూపించుకుంటుంది. పెద్దవాడైన మనువు పట్టించుకోడు కాని యముడు కోపం తో ఆమె...