Skip to main content
భాగవతము - రుక్మిణీ కల్యాణము.!
భాగవతము - రుక్మిణీ కల్యాణము.!
.
శా. కల్యాణాత్మక మైన విష్ణుకథ లాకర్ణింపుచున్ ముక్త వై
కల్యుం డెవ్వఁడు తృప్తు డౌ, నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా
కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే రుక్మిణీ
కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్. !
.
క. భూషణములు సెవులకు బుధ
తోషణము లనేక జన్మ దురితౌఘ విని
శ్శోషణములు మంగళతర
ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్. !
.
(బొమ్మెర పోతనామాత్యుడు.)
Comments
Post a Comment