నవ్వినా, ఏడిచినా ...,

నవ్వినా, ఏడిచినా ...,

నవ్వినా, ఏడిచినా ...,

ఎందుకో ఎంత తోడుకున్నా

మెత్తగా ఇంకా ఎక్కడో

అలికిడి చేస్తూ మెదడుపొరల్లో

అచ్చుపడిన తలపుల తడి,

ఎందుకు తనకి తోడుకావాలా?

కాదు కదా, కాకూడదూ కదా?

ముఖాన్ని దాచుకొనేన్దుకు ,

అమ్మ చీరకుచ్చిళ్ళే కావాలా?

నేనున్నాను అనే విశాలమైన ఎడదని

ఏమి మింగేసిందీ?

నీ అహంకారామా? ఇంకొకరి మమకారమా?

ఆగు..... ఈ చీకటి బాగుంది,

ఎప్పటికీ నీకు ఏ బాదా రానివ్వదు .

మెలితిప్పే నీ వేదనా గాయాలనూ,

మంటపెట్టే నీ గుండె చిచ్చునూ,

నివురుకప్పిమరీ దాచేస్తుంది .

ఒక్క సారి చీకటిని ప్రేమించి చూడు ,

అక్కడ నీ కళ్లకు, కలలకూ అందని

కోటి భావాలను రచించుకుంటావ్ ,

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!