మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే...

                         మానస సంచరరే బ్రహ్మణిమానస సంచరరే...

శుభోదయం !
.
మానస సంచరరే బ్రహ్మణి
మానస సంచరరే...
1. మదశిఖి పింఛాలంకృత చికురే
మహనీయ కపోల విజిత ముకురే
2. శ్రీ రమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే
3. పరమహంస ముఖ చంద్ర చకోరే
పరిపూరిత మురళీ రవ ధారే..
భావము:
ఓ మనసా! బ్రహ్మములో చరిచుము.
1. ఎవని కేశములు నెమలి పించముతో అలంకరించబడి ఉన్నవో, ఎవని అందమైన చేక్కిళ్ళు దర్పణ సౌందర్యమును మించి యున్నవో అట్టి బ్రహ్మములో రమించుము.
2. లక్ష్మీదేవి యొక్క కుచదుర్గముల యందు విహరించువాడును, సేవకులైన భక్తులకు కల్పవృక్షము వంటివాడును అగు బ్రహ్మములో చరించుము.
3. చంద్రకిరణములతో తృప్తిచెందు చకోరమువలె పరమహంసల మొగముల యందు వెలుగు దివ్యప్రకాశములో రమించువాడును, వేణువు ద్వారా సదా మధురనాదమును పలికించువాడును అగు బ్రహ్మములో రమించుము.

(సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన.. )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!