Skip to main content
స్వర్ణరేఖ!
స్వర్ణరేఖ!
(మల్లాప్రగడ రామకృష్ణారావు గారి కవిత.)
.
ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం
అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మేరుపందం
చెమ్పల మీద కెంపు రంగొచ్చి ముద్ద మందారం
సిరోజాలలోఉన్న మల్లెపూల సౌరభానికి
ఆహ్లాదం
.
. కంటికింపుగా కనువిందు చేసిన వేళ
తరలి వచ్చి తపము పండించిన వేళ
కమ్ముకున్న మబ్బు తెర తొలగించిన వేళ
తరుణి దయతో కరుణించి తరించిన వేళ
.
నును సిగ్గు దొమ్తరుల దొరసానివి నీవు
ఓరకంట చూపుతో మనసు దోచినావు
అభ్యంతరాల ముసుగులో దాగివున్నావు
తనివి తీరగ చూసిన మరవ లేకున్నాను
.
. లేత రెమ్మల మాటున మొగ్గావు నీవు
కళ్ళు తెరచి చూసి పరిమలిస్తున్నావు
రెమ్మ నుండి వీడి ఎరుగనిదేశం చేరావు
నాకొరకు విరహముతొ విధిగా ఉన్నావు
.
నాకళ్ళను చూస్తె నీ వంటికి చలువపూత చల్లదనం
నా మేనును చూస్తె చందన సుగంధ పరిమళం
నా వయస్సు చూస్తె నీకు మరువలేని సుఘమ్ధం
నా రూపు దివ్యలోక సుఖాలనమిమ్చే యవ్వనఘమ్ధం
.
సాహిత్య రత్న రాశిని తెచ్చిన మల్లికవు
జన్మసమ్స్కారముతొ ఓర్పుగల దానవు
మాటలలోను, నడకలలోను స్వర్ణరేఖవు
నవరత్నాల మేళవింపు కాంతి గలదానావు
Comments
Post a Comment