ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.)
ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.) 🏵️ 👉చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ ! చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ ! - భావము హిరణ్య కశ్యపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని గురువుల దగ్గరికి పంపిస్తూ అంటున్నాడు- “బాబూ! చదవనివాడికి విషయాలే తెలీదు. మరి చదివితే ఏమవుతుంది? మంచి-చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. నిన్ను నేను మంచి గురువుల దగ్గర ఉంచి చదివిస్తాను నాయనా, చక్కగా చదువుకో!” అని. 🏵️🏵️🏵️🏵️ 👉చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !! - భావము: “నాన్నగారు! నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి, అన్ని చదువులలోని సారమూ, రహస్యమూ సంపూర్ణంగా గ్రహించాను. మరల చదువు చెప్పటానికి చండామార్కులు ప్రహ్లాదుని తీసుకెళ్ళారు. ఇప్పుడు మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అని చూపటానికి ఆ రాక్షస...