దేవీ భాగవతాంతర్గత.మణిద్వీప వర్ణన !
దేవీ భాగవతాంతర్గత.మణిద్వీప వర్ణన ! 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 - -బ్రహ్మలోకానికి పైనసర్వలోకం విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపమంటారు. అక్కడే శ్రీదేవి తేజరిల్లుతూ ఉంటుంది. సమస్తలోకాలకన్న అధికమైనది కావడం వల్లనే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు. పరాంబికాదేవి దానిని తన సంకల్ప మాత్రంచేత సృష్టించింది. ఈ సృష్టికిపూర్వం మూల ప్రకృతీదేవి ఈ మణిద్వీపాన్ని తనకు ఆవాసస్థానంగా ఏర్పరచుకుంది. మణిద్వీపం కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠంకంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్ఠంగా భాసిల్లుతూ ఉంటుంది. అందుకే దానిని సర్వలోకమంటారు. - సుదీర్ఘమైన ఆ తీరాలలో నయనానందకరమైన రత్నవృక్ష పంక్తులు రాజిల్లుతూ ఉన్నాయి. ఆ ప్రదేశానికి ఆవలిభాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణంకల దృఢమైన లోహమయ ప్రాకారం ఉంది. నానాశస్త్రాస్త్రాలను ధరించి పోరడంలో యుద్ధ విశారదులైన రక్షకభటులు నాలుగు ద్వారాలతో ద్వారపాలకులై కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనుఊ వందలాది భటులుంటారు. అక్కడ శ్రీదేవీభక్తులు గణాలుగానివసిస్తారు. వారు సర్వదా జగదీశ్వరి దివ్య సందర్శనార్థం విచ్చేస్తూంటారు. వారు తమ దివ్య వాహనాలపై వస్తూపోతూంటా...