శ్రీకృష్ణ శతకం🌹 (రోజుకు ఒక పద్యం 021218)

శ్రీకృష్ణ శతకం🌹

(రోజుకు ఒక పద్యం 021218)


🏵️


మగ మీనమువై జలధిని

పగతుని సోమకుని జంపి పద్మ భవునకు

న్నిగమముల దెచ్చి యిచ్చితి

సుగుణాకర మేలు దివ్యసుందర కృష్ణా!

🏵️


భావం: 

మంచి గుణాలకు నెలవైన వాడా, దైవసంబంధమైన 

సౌందర్యం కలవాడా! 

ఓ శ్రీకృష్ణా! వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుడు. వాడిని నువ్వు మగ చేపవై (మీనావతారం) సంహరించి, వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు ఇచ్చావు. ఆహా ఎంత ఆశ్చర్యం.


చెడ్డవారికి ఎప్పటికైనా చావు తప్పదు. 

ఎప్పుడూ ధర్మాన్నే ఆచరించాలని, సత్యాన్నే పలకాలని వేదాలు చెబుతున్నాయి. చెడ్డ లక్షణాలు ఉన్నవారిని రాక్షసులు అంటారు. ఎవరిలో రాక్షస గుణాలు ఉంటాయో వారిని భగవంతుడు శిక్షిస్తాడు

అని కవి ఈ పద్యంలో వివరించాడు.

🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.