వంట చేసే మహిళలకు చిట్కాలు..

శుభరాత్రి.🌹

🌺


వంట చేసే మహిళలకు చిట్కాలు..


వంట గది..మహిళలు ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయిస్తుంటారు. ఉదయం..మధ్యాహ్నం..రాత్రి సమయాల్లో ఇంటి వారికి కావాల్సిన వంటకాలు మహిళలు చేస్తుంటారు. వంట చేసే సమయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు. వంట గది శుభ్రంగా ఉంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వంటగది..వంటల్లో నెలకొనే సమస్యల పరిష్కారానికి కొన్ని చిట్కాలు...


వంటగదిలో బొద్దింకలు..చీమలు ఎక్కువగా తిరుగుతూ ఇబ్బందులు పెడుతుంటాయి. బిర్యానీ ఆకును పొడి చేసి బొద్దింకలు తిరిగే చోట చల్లి చూడండి.

ఒక దోసకాయను ముక్కలుగా తిరిగి చీమలు తిరిగే చోట పెట్టి చూడండి.

వంట చేసే సమయాల్లో చేతులు మరకలవుతుంటాయి. మరకలు కాకుండా ఉండాలంటే ఆలుగడ్డ ముక్కలతో రుద్దాలి.

చెక్కతో చేసిన వంట సామాగ్రీ వాసన వస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే వెనిగర్ కలిపిన నీటిలో వాటిని ఉంచాలి.

చపాతిలు మృదువుగా రావాలంటే పిండి కలిపే సమయంలో ఉడికిన బంగాళ దుంప కలపండి.

చపాతి పిండిలో పాలు లేదా గోరువెచ్చని నీళ్లు కలిపి ఓ అరగంట..గంట పాటు నాననబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.

కూరల్లో మసాలా ఎక్కువైతే రెండు లేదా మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.

పచ్చి బటానీలు రంగు మారకుండా ఉండాలంటే వాటిని ఉడికించే సమయంలో చిటికెడు పంచదార వేయాలి.

కూరలో ఉప్పు ఎక్కువయిందనుకోండి అందులో కొద్దిగా బియ్యం పిండి కలపాలి.

దోశల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండి కలిపి వేసుకుంటే దోశలు రుచిగా వస్తాయి.

రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.

పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది.

పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!