🙏శ్రీచందాల కేశవదాసు గారు .🙏

🌹మన సాహితీ ప్రముఖులు (11)🌹


🙏శ్రీచందాల కేశవదాసు గారు .🙏


👉 మీరజాలగలడా నాయానతి వ్రతవిధాన మహిమన్..


తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని.

నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన 

భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు

అనే పాటను రాసినది 

ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు 

ఈయన పాటలు రాశాడు.


కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 

1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించాడు.అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. 

ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.

930-33ల మధ్య కేశవదాసు వ్రాసిన జాతీయ గీతాలను ప్రముఖ సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశాడు. ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలుగా కూడా తీసారు. తన కళా ప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాలకోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు.


కేశవదాసు 1956, మే 14న పరమపదించాడు.


🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!