Posts

Showing posts from September, 2019

🚩 వ్యాసుని జన్మ వుత్తాంతము : -

Image
🚩 వ్యాసుని జన్మ వుత్తాంతము : - (ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది) . 🚩మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ డామె కన్నెతనము హతము కాని వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె! భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె (ుండు మధుసూదన్ గారి పద్యం ...వారికి కృతజ్ఞలతో ) . . పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు . ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ననిమాలు ఇలా ఉనాయిట :- దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి , బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి , వదువు కన్య అయి ఉండాలి , వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి , లంక లో పెండ్లి జరగాలి , పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి , ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్

👉🏿 ఓం సహనావవతు

Image
👉🏿 ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః🙏🏿 👉🏿👉🏿 భావం .. మన ఉభయులను భగవానుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు గాక. మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక. మన అధ్యయనము తేజోవంతము అగు గాక. మనఁవిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

🚩 వహీదా రెహమాన్‌. 🌹

Image
🚩 వహీదా రెహమాన్‌. 🌹 "తురక మతంబున బుట్టియు చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ ! తెరపై హిందూ స్త్రీయై, వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్!. ( పద్యం -ఆచార్య ఫణీంద్ర .) 👉🏿👉🏿 వహీదా రెహమాన్‌ తెలుగమ్మాయి అంటారు కానీ ఒరిజినల్‌గా తమిళనాడు ముస్లిము. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలాకాలం గడిపారు. ''రోజులు మారాయి'', ''జయసింహ'' సినిమాల నాటికి ఆయన విజయవాడలో మునిసిపల్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు ప్రాంతాల్లో పెరగడం వలన వహీదాకు తెలుగు బాగా వచ్చు. ''రోజులు మారాయి'' సినిమాలో 'ఏరువాక సాగారోయ్‌' పాటలో నర్తించింది. ఎన్టీయార్‌ ఆమెకు ''జయసింహ''లో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర యిచ్చి నటింపజేశారు. ''మిస్సమ్మ'' సినిమాను హిందీలో తీయడానికి వీలుపడుతుందేమో చూద్దామని హైదరాబాద్‌ వచ్చిన గురుదత్‌ వహీదాను మెచ్చారు. ప్రత్యక్షంగా కలిసి తన సినిమా ''సి ఐ డి''లో హీరోయిన్‌గా వేయడానికి హిందీ రంగానికి ఆహ్వానించారు. ఇది 1955లో జరిగింద

🚩 కవి రామరాజభూషణుడు. 👏🏿

Image
🚩 కవి రామరాజభూషణుడు. 👏🏿 (ఈయనకు భట్టుమూర్తి అనే పేరుకూడా ఉంది.) 👉🏿 ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక..! -- మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్.! (వసుచరిత్రము అనే ప్రభంధం లోనిపద్యం ) - - . ఆ అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా, రంభాస్తంభాలకన్నా అందమైనవి. తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు. దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం ఆ అవకాశమూ లేదు. అమ్మాయి ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి. . రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు), సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్, ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు, ఇలన్ — , ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్త

🚩నర్గిస్ దత్.🌹

Image
🚩నర్గిస్ దత్.🌹 👉🏿జన్మ నామం ఫాతిమా రషీద్ జననం జూన్ 1, 1929 కోల్కతా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా మరణం మే 3, 1981 (వయస్సు 51) బాంబే, మహారాష్ట్ర, భారతదేశం క్రియాశీలక సంవత్సరాలు 1935, 1942 – 1967 భార్య/భర్త సునీల్ దత్ (1958 – 1981) పిల్లలు సంజయ్ దత్ అంజు ప్రియా దత్ ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు: మదర్ ఇండియా (1958) 👉🏿 నర్గిస్ దత్ (ఆంగ్లం :Nargis Dutt) (హిందీ: नर्गिस, ఉర్దూ: نرگس) (జూన్ 11929 – మే 3, 1981), వెండితెర పేరైన నర్గిస్ తోనే ప్రసిద్ధి., [భారతీయ సినిమారంగ నటి. 1940 నుండి 1960 వరకూ ప్రస్థానం. తన విజయవంతమైన కెరీర్ తో విమర్శకులు సైతం అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది. ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా (1957), అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది. 1958 లో నర్గిస్ పెళ్ళి సునీల్ దత్ తో జరిగింది. 1967లో నటించిన రాత్ ఔర్ దిన్లో ఈమెకు జాతీయ ఉత్తమనటి అవార్డు లభించింది. నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్, అలహాబాదుకు చెందిన ముస

🚩 విజయనగర చరిత్ర -పద్మనాభం' యుద్ధం !

Image
🚩 విజయనగర చరిత్ర -పద్మనాభం' యుద్ధం ! 👉🏿👉🏿👉🏿 - ఎక్కడో జరిగిన తళ్ళికోట యుద్ధం గురించి తెలుగువాళ్ళందరికీ తెలుసు. మరి మన గడ్డమీద జరిగిన 'పద్మనాభం' యుద్ధం గురించి తెలుసుకుందాం. మన దేశం లో బ్రిటిష్ పాలన మొదలయ్యే టప్పటికి విజయనగరం గంజాం,విశాఖపట్టణం, శ్రీకాకుళం ప్రాంతాలు 20 మంది జమీందారుల అధీనం లో వుండేవి. వివిధ కారణాలవల్ల ఈ జమీందారులు ఆగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆంగ్లేయులకేమో సాధ్యమైనంత తీరప్రాంతం తమ గుప్పిట్లో వుండాలన్న పట్టుదల.ఆ ప్రయత్నాల్లోనే విజయనగరం జమీన్దారీని ఆక్రమించు కోవాలనుకున్నారు. ఇంతలో విజయనగరం అధిపతి ఆనందగజపతిరాజు మరణించడం తో దానికి అవకాశం వచ్చింది. అప్పటికి ఆయన కొడుకు చిన విజయరామరాజుది చిన్న వయసు. అందుకని ఆనందగాజపతిరాజు సవతి సోదరుడైన సీతారామరాజును దివానుగా నియమించారు. విజయరామరాజు రాజు కాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించారు ,దాంతో సీతారామరాజు ఆంగ్లేయులతో జట్టు కట్టాడు. అవకాశం చూసుకొని ఆంగ్లేయులు తమకు చెల్లించాల్సిన ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ చె

🚩పెద్ద మనుషులు (అపురూప చిత్రాలు)🌹

Image
🚩పెద్ద మనుషులు (అపురూప చిత్రాలు)🌹 👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿 సంఘంలో ‘పెద్దమనుషులు’గా చెలామణి అయ్యేవారు ఇతరత్రా ఎలా ప్రవర్తిస్తారన్నది ప్రాతిపదిక. ఒక ఊళ్ళోని మున్సిపాలిటీ- చైర్మన్, కౌన్సిలర్లు- కౌన్సిలర్లలో దేవాలయం పూజారి, పత్రికా సంపాదకుడు కూడా వుంటాడు. పత్రికా సంపాదకుడు తప్ప తక్కిన వాళ్ళంతా పెద్దమనుషులే. వీళ్లంతా ఆ వూళ్ళోని ఆలయానికి ధర్మకర్తలు కూడా. అలాగే వీళ్ళు అనాథ శరణాలయం కూడా నడుపుతూ వుంటారు. వీళ్ళు ఆ పదవులు నిర్వహిస్తూ స్వార్థానే్న చూసుకుంటూ వుంటారు. ఇలాంటి పెద్ద మనుషులు గుడిలోని లింగానే్న కాకుండా గుడిని కూడా మింగుతారని కథా సూత్రం. చివరికి గుడిలో ఏదో నిధి వుందని ఆ నిధిని అంతా కలిసి సంగ్రహించాలని పన్నాగం పన్ని ‘మరమ్మతుల కోసం గుడిని మూసేస్తున్నాం’ అని ప్రజలకు చెప్పి రాత్రివేళల్లో గర్భగుడిలో తవ్వడం మొదలుపెడతారు. ఆ తవ్వడంలో పునాదులు కదిలి, గుడి కూలిపోతుంది. వాళ్ళంతా మరణిస్తారు. సంఘంలో పెద్దమనుషులనిపించుకున్న వాళ్ళ నిజరూపాలు, చివరికి ప్రజలకు అలా అర్థమవుతాయి. కె.వి.రెడ్డిగారు అంతకుముందు తీసిన నాలుగు చిత్రాల్లో రెండు జీవిత కథలు (పోతన, వేమన), రెండు జానపదాలూ (గుణసుందరి కథ,

►►నటనకే నటన నేర్పించగల ఏకైక నటుడు◄◄

Image
🚩 ►►నటనకే నటన నేర్పించగల ఏకైక నటుడు◄◄ **************************************************** నటనే అయన దగ్గర శిష్యరికం చేసిందేమో అనేంత నటన..!! అయన కంఠం ఆయనకు మాత్రమే దేవుడు ఇచ్చాడేమో అని ఇతరుల అసూయ..!! అయన వేసిన పాత్రలు..నభూతో నభవిష్యత్ అనేంత కీర్తి..!! . ఆ మహాద్భుతమైన నటన తెలుగు చిత్రసీమలో మరెవ్వరికి చేతకాదు ఆ అదృష్టం దక్కలేదు అంటే అతిశయోక్తి లేదేమో..!! అవును అయన పేరు “సామర్ల వెంకట రంగ రావు” మనం ముద్దుగా పిలిచే “SVR”..!! . తెలుగు సినీరంగంలో ముగ్గురు వ్యక్తుల స్థానాన్ని.. వారి నటనని ఎవరూ ఎప్పటికి పేరు పెట్టలేరు..వారి పాత్రలు అజరామరం..!! వారిలో మొదటి వ్యక్తి..SVR గారు..!! రెండవ వ్యక్తి..రావుగోపాల రావు గారు.. మూడవవ్యక్తి..కోటా శ్రీనివాసరావు..!! ముగ్గురూ రంగస్థల నటులే కావడం యాదృశ్చికం..!! . అయన “కనుసైగలు”, “కనుబొమ్మల”తో కూడా.. నవరసాలు పలికించగల ఏకైన నటుడు అని చెప్పగలను..!! . అయన నటన గురించి చెప్పలంటే ఒకటా రెండా ఎన్ని అని చెప్పగలం..?? అసలు నటనకు నిఘంటువు అంటే ఆయనే అని నేను చెపుతాను..!! . ద

🚩 చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి !

Image
🚩 చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి ! (తిరుపతి వెంకట కవులు.) చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ- కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్ పచ్చని కొంప మాపితివి బాపురే? కౌరవనాథ! నీ సగం బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్ ఆ..ఆ..ఆ.. - పద్దెనిమిది రోజుల యుద్ధం తరువాత, దుర్యోధనుడు ద్వైపాయనహ్రదంలో దాగి ఉన్నాడని బోయల ద్వారా తెలుసుకున్న తర్వాత ధర్మరాజు తమ్ములతో, బంధువర్గంతో, శ్రీకృష్ణసమేతంగా వివిధ వాద్యాల ధ్వనులు అన్ని దిక్కులూ వ్యాపిస్తూ వుండగా, ఆ సరోవరాన్ని సమీపించాడు. దుర్యోధనా! నీళ్లలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? అంతమాత్రాన చావు నీకు తప్పుతుందా? లోకంలో ఇట్టి నీచస్థితి నీకు తగునా? శూరుడవేనా? నీ అభిమానం ఎక్కడికి పోయింది? నీ కీర్తిని, గొప్పతనాన్ని వదలి శత్రుసమూహం నవ్వేటట్లు ఈ విధంగా చేయతగునా? రాజు ధర్మం వదిలితే ఇహపరాలుంటాయా? యుద్ధంలో కుమారులు, తమ్ములు భయంకరంగా చనిపోగా, చూచినా, నీ బుద్ధి, నీ శరీరాన్ని కాపాడుకొనటం కొరకు ఎట్లా ఒప్పుకున్నావు? రారాజు, పాండురాజకుమారుల భుజబల విజ్రుంభణానికి తట్ట

🌹🌺 మధుబాల.🌺🌹

Image
🌹🌺 మధుబాల.🌺🌹 🚩 మధుబాల, ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి అనే పేరుతో భారతదేశంలోని న్యూ ఢిల్లీలో 1933 ఫిబ్రవరి 14న ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు, వీరు మొహమ్మద్జాయ్ (బరక్జాయ్‌గా కూడా పిలువబడుతుంది) రాజవంశ శాఖకు చెందిన కాబూల్ యొక్క నవాబి కుటుంబ సభ్యులు, ఈమె తాతలు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుండి భారతదేశానికి బహిష్కరింపబడ్డారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవవారు. మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయినతరువాత , తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. యువ ముంతాజ్ తొమ్మిది సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ముంతాజ్ యొక్క మొదటి చిత్రం బసంత్ (1942) బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది. ఆమె దానిలో ప్రసిద్ధ నటి ముంతాజ్ శాంతి యొక్క కుమార్తెగా నటించారు. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు మరియు సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు. మధుబాల త్వరగానే ఒక విశ్వసనీయమైన వృత్తిపరమైన నటిగా కీర్తిని సంపాదించుకున్నార

🚩మడి కట్టుకోవటం అంటే..!

Image
🚩మడి కట్టుకోవటం అంటే..! 👉🏿మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. 👉🏿అదేమిటో తెలియక అది ఒక చాంధస ఆచారం అని ఆడుపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. 👉🏿కాని అది ఒక ఆరోగ్య వంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమే కాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. 👉🏿నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.👏🏿 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿శుభంభూయాత్!🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

🚩 వాల్మీకి మహర్షిని -

Image
🚩 వాల్మీకి మహర్షిని - "దుర్భరతపోవిభవాధికుడు (అధికతపస్సంపద చేత గొప్పవాడు), గురుపద్యవిద్యకు ఆద్యుడు (పద్యరచనా సంప్రదాయానికి తొలి కవి), అంబురుహ గర్భవిభుడు, (బ్రహ్మతో సమానుడు)" అన్నారు మన మహర్షి ఆదికవి నన్నయగారు.🙏🏿 🚩 వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం. 🚩 మహర్షి వాల్మీకి ఎవరు? వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. మరామరా అని తపస్సుచేసిన వారు కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి నవాడిగా ఆదికవి అయ్యాడు. అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము మరియు పరిచయము తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి, పరాశరుల కుమ

🚩రేవతిని బలరాముల వివాహం .🌹

Image
🚩రేవతిని బలరాముల వివాహం .🌹 (పోతన గారి భగవత కధ .) 💥💥💥💥 క. ఆ వనజగర్భు పంపున రైవతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్ రేవతి యనియెడు కన్యను భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియన్. భావము: పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకొని వచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఈ వృత్తాంతం. 🚩పూర్వ వృత్తాంతం. ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - సూర్యవంశపు రాజు కకుద్ముని (రైవతుడు .)కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరు గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన సుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్ర