🚩 కవి రామరాజభూషణుడు. 👏🏿

🚩 కవి రామరాజభూషణుడు. 👏🏿


(ఈయనకు భట్టుమూర్తి అనే పేరుకూడా ఉంది.)


👉🏿 ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక..!

--


మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా


రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు


న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో


ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్.!


(వసుచరిత్రము అనే ప్రభంధం లోనిపద్యం )

-


-

.

ఆ అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా,


రంభాస్తంభాలకన్నా అందమైనవి.


తలక్రిందులుగా తపస్సు చేసినా

ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు.


దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని


కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం


ఆ అవకాశమూ లేదు. అమ్మాయి


ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి.

.

రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు),


సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ


అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్,


ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు,


ఇలన్ —

,

ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్తంలో వ్రాయడం బాగున్నది.


(👉🏿వడ్డాది వారి చిత్రం.)


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!