🚩 వ్యాసుని జన్మ వుత్తాంతము : -

🚩 వ్యాసుని జన్మ వుత్తాంతము : -


(ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది)

.

🚩మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ


డామె కన్నెతనము హతము కాని


వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!


భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె


(ుండు మధుసూదన్ గారి పద్యం ...వారికి కృతజ్ఞలతో )

.

.

పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు .


ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల


మహిమాన్వితుడు .


ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా


" మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ


సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల


నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ననిమాలు


ఇలా ఉనాయిట :-


దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి ,


బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి ,


వదువు కన్య అయి ఉండాలి ,


వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి ,


లంక లో పెండ్లి జరగాలి ,


పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి ,


ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి ,


బ్రహ్మసమానుడై ఉంటాడని- అలోచిస్తూ


నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ...


తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి


చుట్టు చూడగా ......అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి


మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న


జన్మరహస్యాన్ని వివరిస్తాడు . అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా


చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి


ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. .


చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం


వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు.


అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది.


అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో


పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు.


పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే ,


అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు.


నదిలో లంక ఉండనే ఉన్నది ,


బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా ... తన శక్తి స్వరూపాలతో పుట్టె


బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా


చెప్పడం తో , నారదముని సహయము తో వివాహం జరిపించి


ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు .


ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు.


ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి


తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే


ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.


(వడ్డాది వారి చిత్రం .)


👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!