►►నటనకే నటన నేర్పించగల ఏకైక నటుడు◄◄

🚩


►►నటనకే నటన నేర్పించగల ఏకైక నటుడు◄◄


****************************************************


నటనే అయన దగ్గర శిష్యరికం చేసిందేమో అనేంత నటన..!!


అయన కంఠం ఆయనకు మాత్రమే దేవుడు ఇచ్చాడేమో అని ఇతరుల అసూయ..!!


అయన వేసిన పాత్రలు..నభూతో నభవిష్యత్ అనేంత కీర్తి..!!


.


ఆ మహాద్భుతమైన నటన తెలుగు చిత్రసీమలో


మరెవ్వరికి చేతకాదు ఆ అదృష్టం దక్కలేదు అంటే అతిశయోక్తి లేదేమో..!!


అవును అయన పేరు “సామర్ల వెంకట రంగ రావు” మనం ముద్దుగా పిలిచే “SVR”..!!


.


తెలుగు సినీరంగంలో ముగ్గురు వ్యక్తుల స్థానాన్ని..


వారి నటనని ఎవరూ ఎప్పటికి పేరు పెట్టలేరు..వారి పాత్రలు అజరామరం..!!


వారిలో


మొదటి వ్యక్తి..SVR గారు..!!


రెండవ వ్యక్తి..రావుగోపాల రావు గారు..


మూడవవ్యక్తి..కోటా శ్రీనివాసరావు..!!


ముగ్గురూ రంగస్థల నటులే కావడం యాదృశ్చికం..!!


.


అయన “కనుసైగలు”, “కనుబొమ్మల”తో కూడా..


నవరసాలు పలికించగల ఏకైన నటుడు అని చెప్పగలను..!!


.


అయన నటన గురించి చెప్పలంటే ఒకటా రెండా ఎన్ని అని చెప్పగలం..??


అసలు నటనకు నిఘంటువు అంటే ఆయనే అని నేను చెపుతాను..!!


.


దక్షయజ్ఞంలో “దక్షుడు” చేసిన పాత్ర అయినా..


పాండవ వనవాసంలో “దుర్యోధనుడు” చేసిన పాత్ర అయినా..


మాయాబజార్ లో “ఘటోత్కచుడు” గా చేసిన పాత్ర అయినా..


భక్తప్రహ్లాద లో “హిరణ్యకశిపుడు” గా చేసిన పాత్ర అయినా..


నర్తనశాల లో “కీచకుడు” గా చేసిన పాత్ర అయినా..


తాతామనవడు లో నిర్భాగ్య తండ్రిగా..


గుండమ్మ కథలో NTR ANR కి తండ్రిగా..


ఇలాంటివి కొన్ని అయన నటనకి చిన్న ఉదాహరణలు మాత్రమే..!!


.


జానపద..


సాంఘీక..


పౌరాణిక..


ఇలా ఏ కాలం నాటి పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండి..!!


.


విశ్వ నట చక్రవర్తి..


నట సార్వభౌమ..


నట శేఖర..


నట సింహ..ఇలాంటివి అయన నటనకి ఇచ్చిన కొన్ని బిరుదులు..


.


ఐదుసార్లు రాష్ట్రపతి అవార్డు అందుకున్న వ్యక్తి..!!


.


ఫిలింఫేర్..


రాష్ట్రపతి అవార్డు..


నంది అవార్డు..


ఇంటర్నేషనల్ అవార్డు…


పై అవార్డులు భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి..!!


.


యాభైవ దశకంలో NTR ANR కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న వ్యక్తి..!!


.


ఇవన్నీ అయన నటనకి దక్కిన గౌరవాలు అని చెప్పగలను..!!


ఇంత గొప్ప నటుడు తెలుగునాట పుట్టడం ఒక అదృష్టం అయితే..


ఇలాంటి నడుటు పొరపాటున ఏ ఇతరదేశంలో పుట్టి ఉంటే


ప్రపంచఖ్యాతి పొంది ఉండేవారు అని మరోవైపు కొంచెం బాధ కూడా కలిగిస్తుంది..!!


ఒక తెలుగువాడిగా అయన మనవాడు అని ఎప్పటికి గర్వంగానే చెప్పుకోవాలి..!!


(నెట్ నుండి ..... ఎవరు రాసేరో తెలియదు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!