🚩 వాల్మీకి మహర్షిని -

🚩 వాల్మీకి మహర్షిని -


"దుర్భరతపోవిభవాధికుడు (అధికతపస్సంపద చేత గొప్పవాడు),


గురుపద్యవిద్యకు ఆద్యుడు (పద్యరచనా సంప్రదాయానికి తొలి కవి),


అంబురుహ గర్భవిభుడు, (బ్రహ్మతో సమానుడు)"


అన్నారు మన మహర్షి ఆదికవి నన్నయగారు.🙏🏿


🚩 వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి.


రామాయణాన్ని వ్రాశాడు.


ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు.


ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు.


ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం.


🚩 మహర్షి వాల్మీకి ఎవరు?


వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి.


మరామరా అని తపస్సుచేసిన వారు కావున మహర్షి, రాముడి


జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి నవాడిగా


ఆదికవి అయ్యాడు.


అయితే వాల్మీకి జన్మము ఎట్టిది? ఆయన తల్లితండ్రులు ఎవరు? అనే


విషయము పై అనేక తర్జనభర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యములో ఉన్నాయి.


ఏ రచయత అయినా తన గురించి ఉపోధ్గాతము మరియు పరిచయము


తదితర అంశములను తెలుపుకోవటము ఈనాటి రచయతలు పాటిస్తున్న


విధానము. వేదవ్యాసుడు తాను మత్స్యగంధి, పరాశరుల


కుమారుడనని తన రచనలలోనే చెప్పుకోవడముతో వ్యాసుడు


ఎవరన్నది కచ్చితముగా తెలిసింది.


అదేవిధముగా రచయతగా తాను ఎవరన్నది ప్రత్యేకముగా వాల్మీకి


వ్రాయనప్పటికీ సందర్భానుసారముగా సీతను రాముడికి అప్పచెబుతున్న


సమయములో ఉత్తరకాండ (రామాయణము)లో వాల్మీకి ఇలా రాసాడు


“రామా నేను ప్రాచేతసుడను ప్రచేతసుడి ఏడవ (దశమ) కుమారుడిని.


వేలసంవత్సరాలు తపస్సు చేసి, ఏ పాపము చేయని, అబద్దమాడని


మహర్షిని. సీత నిన్ను తప్ప మనసా, వాచా పరపురుషుడిని ఎరగని


మహాపతివ్రత. నా మాట నమ్ము, సీతను ఏలుకో. నా మాటలు తప్పు,


అబద్దము అయితే ఇంతకాలము నేను చేసిన తపస్సు భగ్నము అవుగాక.”


అంటాడు.


(వాల్మీకి రామాయణ తెలుగుఅనువాదము,క్రీ.శే.పురిపండాఅప్పలస్వామి)


వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు ప్రాచేతసుడని ఇక్కడ మనము


గుర్తించవచ్చును.ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పుకున్న


విషయము. ఆయన మాటలలో ఆర్ధత, నిజాయతీ ఉట్టిపడుతున్నాయి.


🚩ప్రాచేతసుడు క్షత్రియవంశములో జన్మించాడు,


నారదుల ఉపదేశముతోనూ, తండ్రి, తాతల, ముత్తాతల సుకృతము,


శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా


రూపొందింపచేశాయి. వాల్మీకిమహర్షి యొక్క నిజకథ ఇది.


ఈ విషయములను కప్పిపుచ్చి అనేక కథలు తరతరాలుగా ప్రాచుర్యము


పొందాయి.వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరూ పరిశోధనలు గావించక


పోవడముతో కట్టుకథలు ఇంత వరకు ప్రాచుర్యములో ఉన్నాయి.


రాముడు అనే పాత్రను లోకానికి ఆదర్శపురుషుడిగా చూపించాలని


ఆదికవి తపనే గాని ఆపాత్రకు గుణగణాలు రూపొందిచటమే తన ధృష్టి


తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలనే ఆలోచన తన రచనల్లో


కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పక పోవడముతో ఎవరికి తోచినది వారు


ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి,


వారి బాగుగురించి ఆలోచిస్తారే తప్ప వారి గురించి వారు తపించరు.


మహర్షివాల్మీకి ఎప్పుడూ, ఎక్కడా తాను తన జీవితచరిత్రను వెలి బుచ్చక


పోవటముతో కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని ఆయన


పూర్వాశ్రమములో దొంగ, దారి దోపిడీదారుడని వ్రాశారు.


మరి కొందరు ఆయన బ్రాహ్మణుడని,పేరు అగ్నిశర్మ అని దొంగల ముటాలో


దొంగ అయినాడని వ్రాశారు. ఈ కట్టు కథలకు ఎక్కడా ఆధారాలు లేవు (ఇలపావులూరి పాండురంగారావు,ఆచార్య సహదేవ, జస్టిస్ భల్లా).


భగవధ్గీతలో కూడా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని,


మూల గీతలో లేని అనేక శ్లోక ములు చేర్చబడ్డాయని డాక్టర్ రాధాకృష్ణన్,


రుడాల్ఫ్ ఓటో అభిప్రాయ బడ్డారు. 

(దర్శనములు-మతములు-విజ్ఞాన సర్వస్వము, నాలుగవ సంపుటము-


ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి) వాల్మీకిమహర్షి గురించి కొందరు


ఓర్వలేక, అసూయతో లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చు


అనేందుకు ఉదాహరణగా చూపేందు కో అల్లిన కట్టు కథలు.


భారతీయ సాహిత్య నిర్మాతలు-వాల్మీకి అనే ఆంగ్లపుస్తకములో


ఇలపావులూరి పాండురంగారావు గారు ఈ క్రింది విధముగా


వాల్మీకిమహర్షి పై వ్యాఖ్యానించారు.


“వాల్మీకి తన జీవితారంభ దశలో కిరాతుడని, సప్తరుషులచే ఋషిగా


పరివర్తన పొందగలిగాడని ప్రచారములో ఉన్న కథ వినడానికి ఉత్కంఠ


భరితముగా ఉండవచ్చుగాని దానికి తగిన చారిత్రాత్మక ఆధారాలు లేవు.


జీవితాన్ని గూర్చి సంపూర్ణ అవగాహన గలిగి, శాస్త్రీయ ధృక్పథముతో రసజ్ఞ


సౌందర్యాన్ని కవితామయముగా మేళవించిన వ్యక్తిని గూర్చి అలా


చెప్పడము భావ్యము కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ


ప్రచారములో ఉన్నందున ఆ ధృక్పథము తోనే చూస్తున్నారు.”


🚩రామాయణ కర్తగా వాల్మీకి 🌹


వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు


7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి.


రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి.


ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం.


ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది నాలుగు రెట్లు పెద్దది.


రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు


నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి


కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలుపుగోరులకు, తీసివేతలకు గురి అయింది.


వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు.


శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి


పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది.


ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం


ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.


🚩తొలి శ్లోకం


వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు.


ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా.


భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు.


మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని


చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు.


చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో


ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా


అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి


శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ


చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు.


వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని


శపిస్తూ ఈ మాటలు అంటాడు:


మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥


యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥


ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.


ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని


చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే


సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం.


అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.


వాల్మీకి వలసఅటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు


కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు


చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి


దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం,


ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో


బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన


రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని


కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో


విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం


సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు.


శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు.


వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.


👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!