❤️🔻🌹-మన పెద్దబాలశిక్ష. పుట్టుక కధ .-🌹🔻❤️
❤️🔻🌹-మన పెద్దబాలశిక్ష. పుట్టుక కధ .-🌹🔻❤️ . #నేటివుల(అప్పటి ప్రజల ) విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకుని ,.ఆనాటి మద్రాసు గవర్నరు సర్ తామస్ మన్రో 1822 జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు .అందులో ఇలా వుంది : ‘రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము .దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము.జనాభా లెక్కలు గుణించాము.అంతేగాని నేటివుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.' నేటివులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో మార్పులను తీసుకు రావాలి అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు నేటివుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు. 1832 లో మేస్తర్ కుళులో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన #పుదూరు చదలవాడ సీతారామశాస్త్రిగారి చేత ‘బాలశిక్ష ‘అనే గ్రంథాన్ని రచింపచేశాడు. వీరి రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని గ్రంథకర్త రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.#vva . 1856లో అంటే...