తెలుగు సాహిత్యంలో హాస్యం-2.

తెలుగు సాహిత్యంలో హాస్యం-2.

.

శ్రీనాధుని హరవిలాసంలో మాయా బ్రహ్మచారి పార్వతిని పరీక్షించాలని వచ్చి ఆమె ఎదుట శివుని నిందిస్తూ, వారి కళ్యాణాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగం,,

“రాయంచ యంచు చీరెక్కు జోకయగుగాక

పచ్చి మెనిక తోలు పచ్చ్చడంబు,”..

వంటి వ్యంగ్యాలు హాస్య రసాన్ని అందిస్తాయి. శ్రీనాధునివిగా ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో కావలసినంత హాస్యం మనకు కనిపిస్తుంది.

ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట.

.

సిరిగలవానికి చెల్లును

తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్..

తిరిపెమున కిద్దరాండ్రా

పరమేశా గంగను విడుము పార్వతి చాలున్..

.

నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.

.

ఆయనదే మరో పద్యం..

పూజారి వారి కోడలు

తాజారగబిందె జారి దబ్బున పడియెన్

మైజారు కొంగు తడిసిన

బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్…

.

ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు,.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!