అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా?

అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా?

.

దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది.

.

దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో!

.

ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని.

.

తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడు తప్ప గత్యంతరం లేని అనివార్య పరిస్థితులు తనకుతానే సృష్టించుకున్నాడు. తనని తాను హింసించుకుంటూ తనచుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెట్టాడు. అందుకే సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist గా తేల్చేశారు. తాగుడు వల్ల బాధ మర్చిపోవచ్చనుకుంటే.. తాగుబోతు అవ్వాల్సింది పార్వతి. దేవదాసు కాదు!

.

పార్వతి చేసుకున్న పాపం దేవదాసు పొరుగున పుట్టటమే. పిచ్చిపిల్ల.. దేవదాసుని unconditional గా ప్రేమించేస్తుంది. ధైర్యవంతురాలు. తమ ప్రేమ సంగతి తండ్రికి చెప్పమని దేవదాసుని కోరుతుంది. దేవదాసు తండ్రి తన వంశంని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అహం దెబ్బతింటుంది. జీవితంలో మొదటిసారి దేవదాసుని ప్రశ్నిస్తుంది.

.

పెళ్లి కుదిరిన తరవాత కూడా అర్ధరాత్రి దేవదాసు ఇంటి తలుపు తడుతుంది. తనని తీసుకెళ్ళిపొమ్మని ప్రాధేయపడుతుంది. పార్వతికున్న ధైర్యంలో ఒక నలుసు దేవదాసుకి కూడా ఉండిఉంటే కథ సుఖాంతం అయ్యేది. కానీ దేవదాసు అర్భకుడు. పార్వతి ప్రేమకు అపాత్రుడు. సమాజ (కృత్రిమ) విలువలకి తలవంచిన పిరికివాడు. 'ధైర్యం' అన్న పదానికి అర్ధం దేవదాసు dictionary లోనే లేదు.

.

దేవదాసు గూర్చి పార్వతికి సరియైన అవగాహనే ఉన్నట్లు 'అంతా భ్రాంతియేనా!' అనే ఈ పాట వింటే తెలుస్తుంది. అందుకే ఆ అమ్మాయి దేవదాసు కోణం కూడా అర్ధం చేసుకుని పాడింది. నాకర్ధం కానిదల్లా.. ఇంత తెలివైన పార్వతి 'దేవదాసుని ప్రేమించడం' అన్న తెలివితక్కువ పని ఎందుకు చేసిందనేది!

.

x

Comments

  1. వింజమూరి వారు,

    చాలా బాగా విశ్లేషించి దేవదాసు గురించి సమీక్షించేరు ! ఇట్లాంటి మంచి టపాలు చదివి ఏళ్లయ్యింది ! చాలా బాగా రాస్తున్నారు ! కీప్ ఇట్ అప్ !

    మీ ఇతర టపాలు కూడా రియల్లీ మార్వేల్లెస్ !

    మీరు తెలుగు వార పత్రికల్లో రాయాలి ! అప్పుడు మీ ప్రతిభా పాటవాలు ఆంధ్ర తెలంగాణా జన వాహిని కి మరింత పరిచయ మవుతుంది .

    మీ శైలి నిశ్చయం గా తెలుగు దేశం లో ని మేలైన రచయితల మేళ వింపు ! సూపెర్ డూపర్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. వింజమూరి వారి వింజామర?
    వింజామరకే సిగ్గు గద, ఔర!

    ReplyDelete
  3. మీ విశ్లేషణ తీరు చాలా బాగుంది .

    కాకుంటే మీరన్నట్లు గా ఆ రెండు పాత్రలు వుంటే కధగా , ఓ అంతు తెలియని వ్యధగా మిగిలేది కాదేమో ?

    ReplyDelete
  4. ఇంత తెలివైన పార్వతి 'దేవదాసుని ప్రేమించడం' అన్న తెలివితక్కువ పని ఎందుకు చేసిందనేది!..ఎందుకంటే ఎంత తెలివైన వారికైనా వేపకాయంత వెర్రి ఉంటున్దికనుక రావు గారూ..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!