ఆ ఈశ్వరుని, ఆ స్థూల రూపుని, . ఆ సూక్ష్మరూపుని నేను భజియింతును.

శ్రేష్ఠములైన ధర్మార్థ కామములను త్యజించు కోరిక గలవారై జ్ఞానులు ఎవరిని సేవించి 
.
తమకు ప్రీతిపాత్రమైన మోక్షగతిని పొందుదురో,
.
దగ్గరకు వచ్చి కోరువారికి నశ్వరము కాని దివ్యదేహమును దయతో ఎవరు ప్రసాదింతురో,
.
ముక్తిని కోరువారు పూని ఎవరిని ధ్యానింతురో,
.
సంతోష సాగరమందు మునిగి యున్న వారు విడువని భక్తి గలవారయి ఎవరిని ఏమియు కోరక పుణ్యచరిత్రమును పాడుచు నుందురో,
.
ఆ మహేశ్వరుని, ఆ అంతటికి ఆద్యుడైన వానిని,
.
ఆ తెలుసుకొనుటకు వీలు గాని వానిని,
.
అధ్యాత్మ యోగము ద్వారా చేరుకొన గలిగిన అట్టి వానిని,
.
ఆ సర్వ వ్యాపిని
.
, ఆ పరమాత్ముని,
.
ఆ పరబ్రహ్మముని,
.
ఆ ఇంద్రియముల కతీతుడైన వానిని,
.
ఆ ఈశ్వరుని, ఆ స్థూల రూపుని,
.
ఆ సూక్ష్మరూపుని నేను భజియింతును.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!