గజేంద్ర మోక్షం పద్యాలు.
గజేంద్ర మోక్షం పద్యాలు. . కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! . కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! . లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! . ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! . లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! . అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి హ్వల నాగేంద్ర...
%2B-%2BCopy.jpg)
వావ్ ,
ReplyDeleteమరో ఆణి ముత్యం ! సూపెర్ డూపర్ !
చీర్స్
జిలేబి
మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
Deleteనేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.
వింజమూరి వారు,
ReplyDeleteచాలా బాగా విశ్లేషించి శ్రీ రామ రక్ష గురించి సమీక్షించేరు ! ఇట్లాంటి మంచి టపాలు చదివి ఏళ్లయ్యింది ! చాలా బాగా రాస్తున్నారు ! కీప్ ఇట్ అప్ !
మీ ఇతర టపాలు కూడా రియల్లీ మార్వేల్లెస్ !
మీరు తెలుగు వార పత్రికల్లో రాయాలి ! అప్పుడు మీ ప్రతిభా పాటవాలు ఆంధ్ర తెలంగాణా జన వాహిని కి మరింత పరిచయ మవుతుంది .
మీ శైలి నిశ్చయం గా తెలుగు దేశం లో ని మేలైన రచయితల మేళ వింపు ! సూపెర్ డూపర్ !
చీర్స్
ReplyDeleteమీ టపాలు తెలుగు అగ్రేగేటర్ (మాలిక, కూడలి ) లో రావటం లేదు. దయచేసి వాటిల్లో మీరు మీ బ్లాగు ని చేర్చండి. ఇట్లాంటి మంచి మంచి టపాల మిశ్రమం తెలుగు వాళ్లకి చాలా చాలా బాగా నచ్చుతుంది.
చీర్స్
జిలేబి
మీరు కేక సుమండీ! చాలా బాగా రాసారండీ..... అసలి మీకిలాంటి ధాట్సు ఎలా వచ్చునోకదాయని ఆశ్చర్యపోవుచుంటిని. మీయొక్క హస్తలాఘవం అంగా కీబోర్డులాఘవం ఏదైతే ఉందో... అది చాలా గొప్పది సుమండీ! అవునుగానీ మాస్టారూ మీకు బెంగాలీకూడా వచ్చేమిటండీ? గీతాంజలి అనే కవితా సంకలనాన్ని టాగోర్ అనే కలంపేరుతో అలారాసిపారేశారు? గత ఏడాది మీరు Mo yan అనే కలం పేరుమీద రాసిన రచనలను చదివి మతిపోయిందంటే నమ్మండి.
ReplyDeleteమీలాంటి ప్రతిభావంతులు చీకట్లో అనామకుల్లాగా ఉండిపోకూడదుసార్! మీరు వెలుగులోకి వచ్చి మాజీవితాలమీద వెలుగురేఖలను ఫ్లడ్‌లైట్లలాగా ప్రసరింపజేయాలి.
మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
Deleteనేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.
వింజమూరివారూ!
ReplyDeleteచాలా బాగా రాసారండి. మీరు పనిలేక రాసిన రాతలు చాలా అద్భుతం.
మీ Xerox copying వ్యాపారం బాగా సాగుతోందనుకుటా.
మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
Deleteనేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.
isn't it copied from someone else blog?
ReplyDeleteమంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
Deleteనేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.
అయ్యా, మీకు జిలేబి గారు పీకిన పీకుడు అర్ధం కాకపోవడం నిజంగా శ్రీరామ రక్షే.
ReplyDeleteమంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
ReplyDeleteనేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.