నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం.!

పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో 

నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం.!

.

మృగమదసౌరభవిభవ

ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ

స్థగితేతర పరిమళమై

మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్.!.

.

“కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే గాలితెమ్మెర … అలా …వీచిందిట!”

.

పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!