చాటు పద్యం .

పూర్వం విజయనగర ప్రాంతంలో వైదిక బ్రాహ్మణ స్త్రీలు మాటాడే భాష నవ్వు తెప్పిస్తుంది. 

.

అట్లాంటి చాటు పద్యం ఇది. శార్దూల పద్యం.

.

“ అస్సే! చూస్తివషే! వొసే చెముడషే! అష్లాగషే యేమిషే? 

విస్సా వజ్ఝుల వారి బుఱ్ఱినష ఆ విస్సాయి కిస్సారషే ! 

విస్సండెంతటివాడె ? యేండ్లు పదిషే! విన్నావషే ! యెంత వ 

ర్చస్సే!’ యందురు శ్రోత్రియోత్తమపద స్త్రీ లాంధ్ర దేశమ్మునన్!”

.

చెరువుకి నీళ్ళ కోసం వెళ్లి ( అప్పట్లో కొళాయిలు లేవు) బిందెలు తోముకొంటూ జరిపిన సభాషణ,పై చాటు పద్యం. భావం వివరిస్తాను.

.

“ అవునే చూసావా! (అంటే ప్రక్కావిడ పలకలేదు.) ఏమే నీకుచేముడా!(రెండో ఆమె) అయ్యో అలాగా ఏమిటి? (అని అడిగింది) విస్సా వఝలవారి అమ్మాయిని (బుఱ్ఱి అంటే అమ్మాయి) మన విస్సాయికి (కుర్రవాడికి) ఇచ్చి పెళ్లి చేస్తారట! వాడికి పదేళ్ళ వయసు. వింటున్నావా ? వాడు ఎంత కళగా ఉంటాడో” అని శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీలు మాటాడుకొంటారు. చూసారా ఎంత చక్కని చాటుపద్యం కవి కలంనుండి జాలువారిందో!

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!