గజేంద్ర మోక్షం పద్యాలు.
గజేంద్ర మోక్షం పద్యాలు. . కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! . కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! . లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! . ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! . లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! . అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి హ్వల నాగేంద్ర...

వింజమూరి వారు,
ReplyDeleteచాలా బాగా విశ్లేషించి దేవదాసు గురించి సమీక్షించేరు ! ఇట్లాంటి మంచి టపాలు చదివి ఏళ్లయ్యింది ! చాలా బాగా రాస్తున్నారు ! కీప్ ఇట్ అప్ !
మీ ఇతర టపాలు కూడా రియల్లీ మార్వేల్లెస్ !
మీరు తెలుగు వార పత్రికల్లో రాయాలి ! అప్పుడు మీ ప్రతిభా పాటవాలు ఆంధ్ర తెలంగాణా జన వాహిని కి మరింత పరిచయ మవుతుంది .
మీ శైలి నిశ్చయం గా తెలుగు దేశం లో ని మేలైన రచయితల మేళ వింపు ! సూపెర్ డూపర్ !
చీర్స్
జిలేబి
వింజమూరి వారి వింజామర?
ReplyDeleteవింజామరకే సిగ్గు గద, ఔర!
మీ విశ్లేషణ తీరు చాలా బాగుంది .
ReplyDeleteకాకుంటే మీరన్నట్లు గా ఆ రెండు పాత్రలు వుంటే కధగా , ఓ అంతు తెలియని వ్యధగా మిగిలేది కాదేమో ?
ఇంత తెలివైన పార్వతి 'దేవదాసుని ప్రేమించడం' అన్న తెలివితక్కువ పని ఎందుకు చేసిందనేది!..ఎందుకంటే ఎంత తెలివైన వారికైనా వేపకాయంత వెర్రి ఉంటున్దికనుక రావు గారూ..
ReplyDelete