శ్రీకాళహస్తీశ్వర శతకము. ధూర్జటి...(10/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము. ధూర్జటి...(10/5/15.)

.

రాజన్నంతనెబోవు నా కృపయు,ధ ర్మం,బాభిజాత్యంబు,వి

ద్యాజతక్షమ, సత్యభాషణము,వి శ్వన్మిత్ర సంరక్షయున్

సౌజన్యంబు, కృతంబెరుంగుటయు, వి శ్వాంసంబుగాకున్న దు

ర్బీజ శ్రేష్ఠులుగా గతంబు కలదే శ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీకాళహస్తీశ్వరా! రాజు అని ఒకనికి పేరుపెట్టగానే అంతకు ముందున్న దయ, దర్మము, సత్కులీనత, విద్య,క్షమ, సత్యవాక్యము,విద్వాంసులను గౌరవించుట,

మిత్రులను రక్షించుట,జనులయందు మంచి భావముతో సంచరించుట చేసిన మేలు గుర్తించుకొనుట,విశ్వాసము కల్గియుండుట మొదలగు మంచి లక్షణములు నశించిఇపోవును.

లేనిచో రాజులు ఇంత దుర్మార్గులు కావలసిన కారణము ఉన్నదా?

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!