శ్రీకాళహస్తీశ్వర శతకము.! ధూర్జటి. ( 11/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.! ధూర్జటి. ( 11/5/15.)

.

మును నీచే నపవర్గ రాజపదవీ / మూర్థాభిషేకంబు గాం

చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో / చింతించి చూడంగ, నె

ట్లనినం కీట,ఫణీంద్ర,పోత,మదవే / శండోగ్రహింసా విచా

రిణిగాగా నినుగాన రాక మదిలో / శ్రీకాళహస్తీశ్వరా!

.

.కాళహస్తీశ్వరా! అలోచించినట్లైన , పూర్వము నీవలన మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకములు పొందిన పుణ్యాత్ములతో నేనునూ సమానుడనే అగుచున్నాను. ఎట్లనగా సాలెపురుగు,బలిసిన సర్పము,మదించిన ఏనుగు, కిరాతడగు తిన్నడు మున్నగు వారు మనస్సులోగాక నిన్నే ప్రత్యక్షంగా చూచారు.నేను మాత్రం ప్రత్యక్షంగా చూడలేక, మనస్సులో మాత్రము వారివలె నిన్ను చూచితిని.అందుచె వారితో నేను కూడ సమానుడను.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.