శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి...6/5/15.

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి...6/5/15.

.

ఎన్నేళ్ళుండుదు?నేమి గందునిక నే  నెవ్వారి రక్షించెదన్

నిన్నె నిష్టభజించెద న్నిరూపమో  న్నిద్రాప్రమోదంబు నా

కెన్నండబ్బెడు నెంత కాలమిక నే  నిట్లున్న నన్నియ్యెడం

జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే  శ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీకాళహస్తీశ్వరా!నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకగలను?

నేను బ్రతికి చూడవలసినదేమున్నది?ఎవరిని కాపడగలను? 

ఎటువంటి నిష్టతో నీకు సేవలు చేయగలను?

ఎల్లపుడు నీ స్మరణ నిద్ర యందే మేలుకొని యుండు స్థితి నాకు ఎప్పుడు లభీమ్చునో!ఇంకెన్నాళ్ళు శక్తి లేని వానిగ ఉండవలెనో తెల్పుము.నీవు నన్ను తక్కువ్బగా చూడక త్వరితగతితో నన్ను ఏలుకొనుము.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!