పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 5 /5/15. )

పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 5 /5/15. )
.ఓ మ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు ననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా న్నల సురభులాన మంజులవాణీ!

.

తెలుగులో ఇంతకంటే సరళమైన పద్యం ఉండదు .
ఒక్క సురభులాన అన్న పదం తప్పితే మిగిలీన పదాలన్నీ మనం ప్రతిదినం వాడేవే . శ్రీకృష్ణుడు చిలిపి పనులు చేస్తున్నాడు . వెన్న కనిపిస్తే వదలడు . పాలు పెరుగు మాట వేరే చెప్పవలసిన పని లేదు . గొల్లభామలకు ఏం చేయాలో తోచలేదు . యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ” అమ్మా ! నీ కొడుకు మా ఇళ్ళలో పాలూ , పెరుగూ దక్కనీయడం లేదు . ఈ బాధలు భరించలేము . . ఇక పిల్లాపాపలతో ఎక్కడికైనా వెళ్ళిపోతాం . మా ఆవులమీద ఒట్టు ” అని మొరపెట్టుకున్నారు . ఇవేవో మన ఇళ్ళల్లో మాట్లాడుకున్నట్టుగా లేవూ ?
ఈ పద్యం శ్రీకృష్ణుని కాలంలోని ప్రజల అమాయకపుదనాన్ని ,
ముగ్ధత్వాన్ని తెలియజేస్తుంది . ఇంత సరళంగా మన అలోచనలుంటే
మన జీవితం కూడా చింతలకూ చీకాకులకూ దూరమవుతుంది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!