శ్రీకాళహస్తీశ్వర శతకము.
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివే / కుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల పుట్టరె కౌరవేంధ్రునకనే / కుల్,వారిచే నేగతుల్
పడసెన్? పుత్రులులేని యా శకునకున / వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ / శ్రీకాళహస్తీశ్వరా!
.
ధూర్జటీ
శ్రీకాళహస్తీశ్వర శతకము.
.శ్రీకాళహస్తీశ్వరా!లోకంలో కొందఱు కొడుకుఅను కనలేక పోతిమి అని భాదపడెదరు.దృతరాష్ట్రునికి వందమంది పుత్రులు పుట్టలేదా?వారివలన యే సద్గతులు ఆయనకు కల్గినవి?పుత్రులులేని శుక మహర్షికి దుర్గతులు కల్గలేదు గదా!పుత్రులు లేని వారికి మోక్షము లభ్యము కాదా?అనగా పుత్రులు లేకపోయినను ముక్తిని పొందవచ్చును అని భావము.
Comments
Post a Comment