దాశరథీ శతకము------రామదాసు

తరుణికులేశ!నా నుడులఁ దప్పులు గల్గిన,నీదు నామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రము గాదె?వియున్నదీజలం
బరుగుచు వంకయైన,మలినాకృతిఁబాఱినఁదన్మహత్త్వముం
దరమె గణింప నెవ్వరికి?దాశరథీ,కరుణాపయోనిధీ.
.
(
దాశరథీ శతకము------రామదాసు.)
.ఓయి సూర్యవంశ ప్రభూ!రామా!దయాసముద్రా!నా మాటలలో దోషములున్నను,నీపేర బాగుగా రచింపఁబడిన కావ్యము పవిత్రమేయగునుగదా!అది యెట్లున,ఆకాశగంగా నదీజలము ప్రవహించునపుడెన్ని వంకరలు తిరుగును, ఎంత కలుషితమైనను దాని మహాత్మ్యమును లెక్కించుటకెవరికైన శక్యమగునా?కాదనుట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!