శ్రీకాళహస్తీశ్వర శతకము---- ధూర్జటీ
.
ఒక పూటించక కూడుతక్కువగునే / నోర్వంగలే,దెండకో
పక నీడన్వెదకుం,చలింజడిసి సుం / పట్లెత్తుకోజూచు,వా
నకు ఇండ్లిండ్లును దూరు,నీ తనువుదీ / నన్వచ్చు సౌఖ్యంబు రో
సి కడాసింపరుగాక మర్తులకటా! / శ్రీకాళహస్తీశ్వరా!
.
(శ్రీకాళహస్తీశ్వర శతకము---- ధూర్జటీ)
.
శ్రీకాళహస్తీశ్వరా!ఈ లోకంలో మనుజులు ఒక్క పూట అన్నము తక్కువగుచో సహింపలేరు.ఎండకు తాళలేక నీడదరికి చేరుకున్నారు.చలికి భయపడి కుంపట్లు పెట్టుకొని వేడి పొందుచున్నారు.వానకు భయపడి రక్షణకై ఇంటింటికి తిరుగుచున్నారు.కాబట్టి ఈ శరీరమువలన సుఖమును అసహ్యించుకొని నీ సాద్యమునకు చేరుటను ఈ మనుష్యులు కోరుకొనుట లేదు.
శ్రీకాళహస్తీశ్వర శతకము......(ధూర్జటీ).
.
అంతా సందయమే శరీర ఘటనం / బంతా విదారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమే మే / నంతా భయభ్రాంతమే
యంతానంత శరీరశోషణమే దు / ర్వ్యాపారమే దేహికిన్
చింతన్నిన్నుదలంచి పొందురు నరుల్ / శ్రీ కాళహస్తీశ్వరా!
.
శ్రీ కాళహస్తీశ్వరా! పరీక్షించి చూడగా శరీరంతయును భయ భ్రాంతులచేత కూడినట్టిదే.విచారించి చూడగా జరుగుతున్నదంతా శరీరమును శుధ్కింపచేసే విషయాలే.లోపల ఉన్న జీవుడు ఒక దుఃఖంలోకి పడినట్లుగా ఒక జన్మ నుంచి ఇంకొక జ్న్మానికి చేసే ప్రయాణమే.ఈ ప్రపంచమంతా సందేహాలమయమే.అయినా ఈ మనుష్యులు తమ మనస్సులలో నిన్ను గురించి అలోచించి నిన్ను చేరుకొనే ప్రయత్నం చేయటంలేదు.
ఒకరింజంపి పదస్థులై బ్రతుక తా / మొక్కొక్క రుహింతు రే
లకొ తామెన్నడు జావరో తమకు బో / వో సంపదల్ పుత్ర మి
త్ర కళత్రాదులతోడ నిత్యసుఖమం / దం గందురో,యున్నవా
రికి లేదో మృతి యెన్నడుం గటకటా! / శ్రీకాళహస్తీశ్వరా!
.
శ్రీకాళహస్తీశ్వరా!మానవులు తమ కోఱ్కెల కొఱకు మరొకరిని భాదించి,రాజ్యము మొదలైన పదవిని పొందుతారు.తాము ఒక నాటికైనా పదవి నుంచి తొలిగిపోతారు.అట్లే తమ సంపదలు నశించిపోవును. కుమారులు, స్నేహితులు, భార్యలు మొదలైనవారితో శాశ్విత సుఖాలుండవు?సంపదలున్నా చావు తప్పదను జ్ఞానము ఉండదా?
Comments
Post a Comment