సాధనా పంచకము
సాధనా పంచకము:
శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.
దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్తేనేశస్య విధీయతాం అపచితిః కామ్యే మతిస్త్యజ్యతామ్ |పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో2నుసన్ధీయతామ్ఆత్మచ్ఛా వ్యవసీయతాం నిజగ్రుహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ ||
2.సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ద్రుఢాధీయతాంశాన్త్యాదిః పరిచీయతాం ధ్రుఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ |సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతామ్బ్రహ్మైకాక్షరమర్త్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ ||
3.వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరఃపక్షః సమాశ్రేయతాందుస్తకార్త్సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కో2నుసన్దీయతామ్ |బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహర్గర్వః పరిత్యజ్యతాందేహే2హమ్మతిరుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ ||
4.క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాంస్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సన్తుష్యతామ్|శీతోష్ణాది విషహ్యతామ్ న తు వ్రుథా వాక్యం సముచ్చార్యతాంఔదాసీన్యమభీప్స్యతామ్ జనక్రుపానైష్థుర్యముత్స్రుజ్యతామ్ ||
5.ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాంపూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం ద్రుశ్యతామ్ |ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాంప్రారబ్ధం త్విహ భుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనా స్తీయతామ్ ||

Comments
Post a Comment