చిలిపి వింజామర
=====================================================================
తెలుగులో తెలుగు పద్యం రాయడం, చదవడం, మెచ్చుకోవడం గొప్ప కాదు. ఇంగ్లీషును తెలుగు పద్యం రాయడమేమిటో చదివి అస్వాదిద్దామా సాహితీ ప్రియులారా!!
కవివరేణ్యులు కాళ్ళకూరి నారాయణ రావుగారు -మధుసేవ- నాటకంలొ ఒక చక్కని పద్యం అల్లారు..
"మార్నింగు కాగానె మంచమ్ము లీవింగు
మొగము వాషింగు చక్కగ సిటింగు
కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు
గడగడా డ్రింకింగు గ్రంబులింగు
భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు
క్లబ్బుకు రీచింగు గ్యాంబులింగు
విత్తమ్ము లూటింగు చిత్తమ్ము రేసింగు
వెంతనే డ్రింకింగు వేవరింగు
మరల మరల రిపీటింగు మట్టరింగు
బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు
దారిపొడుగున డాన్సింగు థండరింగు
సారె సారెకు బొరింగు స్లంబరింగు..
మందులో సోడా కలిసినట్లు ఇంగ్లీషు తెలుగు భాషా పదాలు ఒకటే మిక్సింగుట..
======================================================================
ప్రశ్న 1: భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడో 5 వరుసలకు మించకుండా వివరింపుడు? (5 మార్కులకు)
జవాబు: భీముడు బకాసురుణ్ణి గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది గుద్ది …చంపాడు.
Comments
Post a Comment