ఆదర్శ పురుషుడు రామయ్య తండ్రి


ఆదర్శ పురుషుడు
పితృవాక్య పరిపాలకుడు రామయ్య తండ్రి
మహా సాధ్వి
పతివ్రతా శిరోమణి సీతమ్మ తల్లి

సేవాతత్పరులు
అన్న మాట జవదాటని సోదరులు
లక్ష్మణ, భరత శతృఘ్నులు

భక్తాగ్రేసరుడు
మాహాశక్తి సంపన్నుడు
పరాక్రమశాలి హనుమంతుడు

ఉన్నతమైన వ్యక్తిత్వములు
ఆదర్శమైన జీవితములు

అందుకే రామ రాజ్యము రామ రాజ్యమే
రామ నామము రామ నామమే ...

రెండు అక్షరముల 'శ్రీ రామ ' నామము
ఇహ పరములు తరియింప చేయు
భవ భంధములను దూరము చేయు
భక్తి ముక్తులు కలుగచేయు
ఈతి బాధలు తొలగింపచేయు
ఆత్మ పరమాత్మలను ఏకము చేయు

జయ శ్రీ రాం జయ సీతా రాం

-

Comments

Post a Comment

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.