మా దివాకర్ల వెంకట అవధాని సార్

మా దివాకర్ల వెంకట అవధాని సార్ తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలో ఎంత గాఢానురక్తిని క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం. పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా చదివి వినిపించే ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి. ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్ అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని ప్రవరుడి ఘ...