తానో "లాములు",

తానో "లాములు", "తండ్రి పేరెవరయా?" "దాచాదమాలాలు"- "నౌ 

లే, నాపేర?"న "నమ్మగాల"నగ నోలిందల్లి - "కౌసల్య తం 

డ్రీ !"నాగాననబోయి రాక కనులన్ నీర్వెట్టఁగౌసల్య "నౌఁ 

గానే కానులె యమ్మనే!" యని ప్రభున్ గౌసల్య ముద్దాడినన్.


ఇది రామాయణ కల్పవృక్షంలో, బాలకాండ, అవతార ఖండంలోని పద్యం. బాలరామునకు అప్పడప్పుడే మాటలు వస్తున్న సందర్భం. కౌసల్యా, బాలరాముల సంభాషణం. పిల్లల వచ్చీ రాని మాటలు ఎంతో ముచ్చట గొలుపుతూ ఉంటాయి. 


కౌసల్య: (ఈ అబ్బాయి) తానెవరయ్యా? 


రాముడు: లాములు (రాముడు) 


కౌసల్య: మరి తండ్రి పేరెవరయ్యా? 


రాముడు: దాచాద మాలాలు (దశరథమహారాజు) 


కౌసల్య: ఔనులే. మరి నాపేరు...? 


రాముడు: అమ్మగాలు... (అమ్మగారు) 


కౌసల్య: కాదు తండ్రీ ! నాపేరు... కౌసల్య 


బాలరాముడు "కౌసల్య" అనబోయాడు. కానీ ఆ పేరు పలకటం రాకపోవటంతో ఏడవటం ప్రారంభించాడు. అతడు ఆ పేరు చెప్పలేక కన్నీరు పెట్టటం కౌసల్య భరించలేకపోయింది. వెంటనే- 


కౌసల్య: సరే నాన్నా! నేను కౌసల్యను కాదురా ! .. అమ్మనే!... అలాగే అను అంటూ బాలరాముని ముద్దాడింది. 


ఇది ఎంత మధుర సన్నివేశమో కదా?


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!