శ్రీకాళహస్తీశ్వర శతకము. (ధూర్జటి)

శ్రీకాళహస్తీశ్వర శతకము. (ధూర్జటి)


అమ్మా యయ్యయటంచు నెవ్వరినినే నన్న న్శివా! నిన్ను నే

సుమ్మీ!నీ మది తల్లి దండ్రులటం చు న్జూడగా బోకు నా

కిమ్మె తల్లియు తండ్రియున్ గురుడు నీ వేకాగ సంసారపుం

జిమ్మంజీకటి గప్పకుండ గనుమా శ్రీకాళహస్తీశ్వరా!


శ్రీకాళహస్తీశ్వరా!నిన్ను తప్ప నేనెవ్వరినీ అమ్మా,అయ్యా అని అనలేదు.ఒక వేళా అవిదముగా పిల్చినను అది నిన్నే.కాబట్టి నా ఈ శరీరమునకు తల్లి,దండ్రి,గురువు,దైవము అన్నియునూ నీవే అని నమ్మియున్నాను.నన్ను సంసారము అను చీకటిలో పడకుండా రక్షించి కాపాడుము.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!