దాశరథీ శతకము....

దాశరథీ శతకము....


హల కులిశాంకుశ ద్వజ దరాసన శంఖ రథాంగకల్పకో

జ్జ్వల జలజాత రేఖలును,సొంకమలై కనుపట్టుచున్న మీ

కలిత పదాంబుజద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా

తలఁపునఁజేర్చి కావఁగాదె?దాశరథీ!కరుణాపయోనిదీ!


రామా!దయాసముద్రా! నాఁగలి, వజ్రము, అంకుశము, ద్వజము, విల్లు, చక్రము, కల్పవృక్షమువలెఁ బ్రకాశించు పద్మరేఖలును చిహ్నములతోఁ గూడినవై కనిపించచున్న మీ యడుగుఁదామరల జంటను శిలారూపమునొందిన గౌతమి మహర్షి భార్యయైన అహల్య కిచ్చినట్లు నా మనస్సునఁ బాదుకొలిపి నన్ను రక్షింపవా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!