దాశరథీ శతకము.....

దాశరథీ శతకము.....

'రా'కలుషంబులెల్ల బయలంబడఁ ద్రోచిన,'మా'కవాటమై

దీకొని ప్రోచు నిక్కమని దీయుతులైనఁదదీయ వర్ణముల్

గైకొని భక్తిచే నుడువఁ గానరుగాక విపత్పరంపరల్

దాకొనునే జగజ్జనుల?దాశరథీ!కరుణాపయోనిదీ!


రామా!దయాసముద్రా!'రామా' అను పదమునందలి 'రా' అను అక్షరము పాపముల నన్నిటిని వెలికి నెట్టివేఁయగా; 'మా'అను నక్షరము ఆ పాపములు లోనికి రాకుండా మూసుకొనిపోయి రక్షించును.అది నిజమని భావించి, బుద్దిమంతులు రామా అను పదములోని రెండక్షరములను నుచ్చరింపఁజూడరు గాని,అట్లుచ్చరించినచో లోకులను ఆపదల సమూహను లంటునా?అంటవనుట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!